Guppedantha Manasu Today Episode:తండ్రి కోసం రిషి ఆరాటం.. ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలని మహేంద్ర

వసుధార, దేవయాని మాట్లాకుంటుండగా రిషి వస్తాడు. ఏమైంది పెద్దమ్మా.. వసుధారను ఏదో అంటున్నారని అడుగుతాడు రిషి. దీనికి నేను ఇక్కడ ఉండటం చాలా నచ్చిందట సార్. నేను మీకు తోడుగా ఉంటున్నానని నన్ను మెచ్చుకుంటున్నారు. వీలైతే ఇక్కడే ఉండమంటున్నారు. వెళ్లొద్దని చెబుతున్నారు అని వసుధార చెబుతుంది. దీంతో రిషి ముందు ఏం మాట్లాడలేక తల ఊపుతుంది దేవయాని. అప్పుడు దేవయానితో.. మీరు వసుధారకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు పెద్దమ్మ.

ఎంత కాదనుకున్న వసుధార మన కుటుంబ సభ్యురాలు కదా అంటాడు రిషి. బయటకు వెళ్లిన రిషి తండ్రి మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెనుకే వచ్చిన వసుధార.. నా కారణంగానే మహేంద్ర సార్ వెళ్లిపోయారా.. నా కారణంగా ఓ కుటుంబం ముక్కలైందా.. లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నానా అని బాధపడుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 29, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 594లో ఏం జరిగిందో చదివేసేయండి.

 నన్ను వదిలి వెళ్లడం ఎందుకు..

నన్ను వదిలి వెళ్లడం ఎందుకు..

వెనుకే వచ్చిన వసుధారతో అసలు ఏం జరిగి ఉంటుంది వసుధార.. డాడ్ ఇల్లు వదిలి, నన్ను వదిలి వెళ్లడం ఏంటి.. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. లోపం ఎక్కడుంది.మనం ఏదో ఎక్కడో మిస్ అవుతున్నాం అనిపిస్తోంది. డాడ్ ఇకా నాకు ఎప్పటికీ కనిపించరా.. ఎప్పటికీ నా నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా.. తనకు నేను గుర్తు రావడం లేదా.. నన్ను చూడాలని అనిపించడం లేదా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి.

దీంతో మీకన్నా ఎక్కువగా అక్కడ వాళ్లు బాధపడుతుంటారని వసుధార అంటుంది. మరి అంత బాధ ఉన్నప్పుడు నన్ను వదిలి వెళ్లడం ఎందుకు.. అయినా జగతి మేడమ్ కి అన్నీ తెలుసు కదా. వెళ్లొద్దని డాడ్ కి చెప్పాలి కదా అని అంటాడు రిషి.

ఆ బాధను నేను తీరుస్తాను..

ఆ బాధను నేను తీరుస్తాను..

ఆవిడ చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం. మీ అందరి దగ్గరా ఓ గొప్ప లక్షణం కామన్ గా ఉంది. మీరంతా మంచి వారు సార్. మంచితనం, ప్రేమ, ఇంకాస్త మొండితనం అన్నీ కలగలపి ఉన్నాయి. అందుకే ఇంత బాధను అనుభవిస్తున్నారేమో అనిపిస్తోందని అంటుంది వసుధార. అలాగే మనసులో దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను.

మిమ్మల్ని కలుపుతాను. మహేంద్ర సార్ లేకపోవడంతో దేవయాని మేడమ్ ఇంకా బాగా నటిస్తూ మీ బాధ మరింత పెంచుతోంది. ఆ బాధను నేను తీరుస్తాను అని అనుకుంటుంది వసుధార. ఎక్కడికి వెళ్తున్నాం అని రిషి అడిగితే మీకు, నాకు బాగా పరిచయం ఉన్న చోటుకి అంటుంది వసుధార.

ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలి..

ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలి..

వసుధార అలా అనడంతో కారు పోనిస్తాడు రిషి. మరోవైపు మహేంద్ర-జగతి కూర్చుని మాట్లాడుకుంటారు. వసుధార సారీ అని మెసేజ్ పెట్టిందని మహేంద్రతో జగతి అంటుంది. అందుకోసం మనం ఇక్కడికి రాలేదు కదా.. సారీ చెప్పగానే వెళ్లిపోవడానికి అని మహేంద్ర అంటాడు. వాళ్ల మనసులు మారాలి కదా అని మహేంద్ర అంటే.. రిషి మారాడు కదా అని జగతి సమాధానం ఇస్తుంది.

మనం వెళ్తే సమస్య మళ్లీ తిరిగి మొదటికే వచ్చేస్తుంది. కాబట్టి ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలి. రిషి-వసుధార దగ్గర అవ్వాలనే కదా వచ్చేశాం.. నువ్ బాధపడి నన్ను బాధపెట్టకు.. ఇంకొన్నాళ్లు తప్పదు అని అంటాడు మహేంద్ర.

వాళ్లు కాల్ చేశారా అని చూస్తున్నారా..

వాళ్లు కాల్ చేశారా అని చూస్తున్నారా..

ఇక్కడ కట్ చేస్తే ఇంకోవైపు హాల్లో కూర్చుని ఉంటుంది దేవయాని. ధరణి అని పిలవగానే.. కాఫీ కావాలా అని అడుగుతుంది ధరణి. కాఫీలు తాగడానికే పుట్టినట్లు మాట్లాడతావేంటి.. ఇటు రా.. కూర్చో సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటుంది దేవయాని. దీంతో షాక్ అయి అలానే చూస్తుంటుంది ధరణి.

కబుర్లు చెప్పడానికి కూర్చోమన్నాను. కత్తులతో పొడవటానికి కాదు.. కూర్చో ధరణి.. కూర్చో అని దేవయాని అంటుంది. మీరంటే గౌరవం.. నేను కూర్చోలేను అని ధరణి సమాధానం ఇస్తుంది. ఓసారి నీ ఫోన్ తీసుకురా అని అడగడంతో ఫోన్ తీసుకొని ఇస్తుంది ధరణి. జగతి అత్తయ్య వాళ్లు కాల్ చేశారా అని చూస్తున్నారా. చిన్నత్తయ్య వాళ్లు వెళ్లినప్పుడు చూసింది మీరే కదా అని అంటుంది ధరణి.

మహేంద్రకు అన్నం తినిపించిన జగతి..

మహేంద్రకు అన్నం తినిపించిన జగతి..

చూస్తే.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో అడ్రస్ తెలుసుకోవాలా అని సమాధానం ఇస్తుంది దేవయాని. దీంతో వసుధార మాటలు గుర్తు తెచ్చుకున్న ధరణి.. మనం అన్నీ జరగాలి అనుకుంటాం జరగవు కదా.. నాకు కిచెన్ లో పనుంది.. ఫోన్ వస్తే పిలవండి అనేసి.. అందులో పాము, ముంగిస గేమ్ ఉంది. ఆడుకోండి. భలే బాగుంటుంది అని అంటుంది ధరణి.

మరోవైపు రిషి ఫొటో చూస్తూ మహేంద్ర బాధపడుతుంటాడు. భోజనం చేయి మహేంద్ర అని జగతి అంటే.. రిషిని చూస్తుంటే చాలు నాకేం వద్దంటాడు మహేంద్ర. ఇప్పుడు రిషి కూడా నీ గురించే ఆలోచిస్తూ భోజనం మానేయాలి అని నువ్వు కోరుకోవు కదా.. రా మహేంద్ర.. అని తినిపిస్తుంది జగతి. అప్పుడు రిషియే తనకు తినిపిస్తున్నట్లు భావిస్తూ చాలా బాధపడిపోతుంటాడు మహేంద్ర. ఇలా ఆద్యంతం ఆసక్తిగా సాగుతోన్న గుప్పెడంత సీరియల్ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X