twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Today Episode:రిషిధారల మధ్య తొలగిన అడ్డుతెర.. పూల వర్షం కురుపించుకున్న ప్రేమజంట

    |

    రిషిని తలచుకుంటూ బాధపడుతున్న మహేంద్రకు తినిపిస్తుంది జగతి. ఏంటి మహేంద్ర ఈ బాధ తీర్పు చెప్పి.. నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావ్ అని జగతి అంటే.. నేను ఏమైనా తప్పు చేశానా.. అని అడుగుతాడు మహేంద్ర. ఇంతలో మహేంద్రకు పొలమారుతుంది. దీంతో రిషి తలుచుకుంటున్నాడేమో అంటాడు మహేంద్ర. ప్రతిక్షణం నిన్ను తలచుకుంటూనే ఉంటున్నాడు అని జగతి అంటుంది. నాతో ఉంటున్నావ్ అనే కానీ రిషికి కనిపిస్తే మనసు అదుపులో ఉంచుకోలేవు కదా అని అడుగుతుంది జగతి. అదే ప్రేమలో ఉన్న మ్యాజిక్. రిషి కనిపిస్తే మనం ఏం చేయలేమని మహేంద్ర అంటాడు. తర్వాత జగతికీ టిఫిన్ తినిపిస్తాడు మహేంద్ర. తర్వాత జగతి వెళ్లిపోతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 31, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 595లో ఏం జరిగిందో చదివేసేయండి.

    అమ్మా అని పిలవమని మిమ్మల్ని బాధపెట్టాను..

    అమ్మా అని పిలవమని మిమ్మల్ని బాధపెట్టాను..

    టిఫిన్ తినిపించిన జగతి వెళ్లిపోయాక నువ్ నాతో ఉన్నావ్.. నా గుండెలో రిషి ఉన్నాడు.. నేను కోరుకుంది జరుగుతుంది అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. రిషి ఫొటో చూస్తూ ఏం చేస్తున్నావ్ నాన్నా అని మహేంద్ర అంటాడు. మరోవైపు రిషిని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తుంది వసుధార. ఇద్దరు అమ్మవారికి మొక్కుతారు. తర్వాత రిషి చేతులు పట్టుకుని నన్ను క్షమించండి సార్. నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా ఆశలు అన్నీ బలవంతంగా మీపై రుద్ది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. జగతి మేడమ్ ని అమ్మా అని పిలవమని మిమ్మల్ని బాధపెట్టాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది వసుధార. దీంతో అవన్నీ ఇప్పుడు ఎందుకు వసుధార అని రిషి అంటాడు.

    మీ ప్రేమ గొప్పది సార్..

    మీ ప్రేమ గొప్పది సార్..

    అయినా వసుధార కంటిన్యూ చేస్తుంది. నా మొండితనం, పంతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఒక సందర్భంలో ఈ ఒప్పందం మన బంధాన్ని దూరం చేస్తుందా అని కూడా చాలా భయపడ్డాను. ఈ విషయంలో మీకు కోపం వచ్చినా, బాధ కలిగిననా సహనం చూపించారు. ఎక్కడా కూడా నాపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మీరు చాలా గ్రేట్ సార్. మీ సహనం ముందు నా పట్టుదల చిన్నబోయింది సార్. మీ ప్రేమ గొప్పది సార్. మీ చేయి పట్టుకుని జీవితాంతం నడవాల్సిన దాన్ని మిమ్మల్ని బాధపెట్టాను. ఆ విషయంలో నేను మీకు సారీ చెప్పాలి అని వసుధార అంటుంది. మనకి మనకి సారీలు ఏంటీ అని రిషి అంటాడు. క్షమించమని అడిగితే మనసులోని భారం దిగిపోతుంది సార్ అని వసుధార అంటుంది.

    మారమని చెప్పే హక్కు నాకు లేదు.

    మారమని చెప్పే హక్కు నాకు లేదు.

    మీరు ఆరోజు చీర కట్టుకోమన్నారు. కాదని, అందరినీ బాధపెట్టాను. ఒకరికోసం ఒకరు మారితే అది ప్రేమ ఎలా అవుతుంది. మార్పు అనేది సహజంగా కాలక్రమేణ రావాలి. మచ్చలేని చంద్రుడిగా మిమ్మల్ని చూడాలని అనుకున్నా. కానీ, చందమామని మార్చాలని ఆశించడం తప్పని తెలుసుకున్నా. నా పంతంతో, మహేంద్ర సార్ దూరం అయిపోయారని బాధగా ఉంది. తల్లి ప్రేమ కోసం తండ్రి ప్రేమను దూరం చేసిన దాన్ని అని బాధగా ఉంది. మీరు నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను అని వసుధార అంటుంది. మన మధ్య ఇంకా ఎలాంటి అడ్డంకులు లేనట్టేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రిషి. దీంతో ఉండవు అని ఆశిస్తున్నా సార్. మీ మనసు చెప్పింది మీరు వినండి. మిమ్మల్ని మారమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ మీరు మారితే సంతోషపడే క్షణాలను నేను ఆస్వాదిస్తాను అని వసుధార అంటుంది.

    ఆ తల్లికొడుకులను నువ్వే కలపాలి..

    ఆ తల్లికొడుకులను నువ్వే కలపాలి..

    నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉన్నా ఏదో అడ్డుతెర ఉన్నట్లు ఉంది. కానీ ఇప్పుడు అది తొలగిపోయింది. ఇక మనమధ్య ఏ విషయంలోనూ అభిప్రాయబేధాలు రావని ఆశిస్తున్నా అని రిషి అంటే అవును అని మాట ఇస్తుంది వసుధార. ఇద్దరు మళ్లీ అమ్మవారికి మొక్కుతారు. మహేంద్ర సార్ కి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను అలా అని రిషి సార్ ను బాధపెట్టలేను.. ఆ తల్లికొడుకులను నువ్వే కలపాలి అమ్మా అని అమ్మావారికి ప్రార్థిస్తుంది వసుధార. ఇంతలో వసుధారపై పూల వర్షం కురిపిస్తాడు రిషి. చాలా సంతోషంగా ఉంది అంటాడు. తర్వాత రిషిపై కూడా పూలు వేస్తుంది వసుధార. మరోవైపు కాలేజీలో లెక్చరర్లు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుని జగతి మేడమ్ కోసం దేవయాని ఇంటికి కాల్ చేస్తారు. ధరణి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే మధ్యలో తీసుకుని దేవయాని మాట్లాడుతుంది.

    నాకు నాన్చడం నచ్చదు..

    నాకు నాన్చడం నచ్చదు..

    జగతి మేడమ్ గురించి దేవయానిని అడిగితే.. జగతి మేడమ్ ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్లారో.. ఎప్పుడు వస్తారో.. అసలు వస్తారో రారో కూడా తెలియదు.. ఇంకోసారి ఫోన్ చేయకండి అని పెట్టేస్తుంది. ఎందుకలా చెప్పారని ధరణి అడిగితే.. మనకు తెలియని విషయాలను చెప్పడం మంచిది.. నాకు నాన్చడం నచ్చదు అని ఘాటుగా సమాధానం ఇస్తుంది దేవయాని. అప్పుడే లోపలికి వచ్చిన గౌతమ్ ఇదంతా వింటాడు. గౌతమ్ ను చూసిన దేవయాని కొద్దిసేపు ఆగుతుంది. నేను చెప్పింది కరెక్టేనా గౌతమ్ అని అడుగుంతి దేవయాని. పెద్దమ్మా ఏంటీ దూకుడుగా మాట్లాడుతుందనుకొని అవును పెద్దమ్మా అంటాడు. రియాలిటీని యాక్సేప్ట్ చేస్తే హాయిగా ఉంటుందని దేవయాని అంటే.. అవును అనుకుంటూ వెళ్లిపోతాడు గౌతమ్. మరోవైపు కారులు వెళ్తుంటారు రిషి, వసుధార. వసుధార అన్న మాటలను గుర్తు చేసుకుంటూ సంతోషిస్తాడు రిషి.

    English summary
    Guppedantha Manasu Serial October 31 2022 Today Full Episode 595
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X