Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Guppedantha Manasu: వసుధారను దొంగచాటుగా వీడియో తీసిన రిషి.. బాధలో మహేంద్ర
వసుధార గురించి ఆలిచిస్తూ ఉంటాడు రిషి. ఇంతలో రిషికి వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన లొకేషన్స్ పెట్టిందనుకుని ఎప్పుడు వెళ్లాలని రిప్లై ఇస్తాడు రిషి. మీ వీలు చూసుకుని వెళ్లండి అని వసుధార అంటుంది. రావొచ్చుగా అని రిషి అనుకుంటే.. రమ్మని పిలవచ్చుగా.. పిలుస్తారులే అని వసుధార అనుకుంటుంది. ఈలోపులోనే నువ్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ ప్లేస్ కి మేడంతో కలిసి వెళ్లు అని రిషి రిప్లై పెడతాడు. ఏంటీ సార్ నా అంచనాలను తారుమారు చేస్తున్నారు అని అనుకుంటుంది వసుధార. తర్వాత చందమామని చూస్తూ రిషి, తన గదిలో వసుధార మాట్లాడుకుంటారు. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 4, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 572లో ఏం జరిగిందో చదివేసేయండి.
ముభావంగా ఉన్న మహేంద్ర..
అలా వసుధార, రిషి ఇద్దరూ చందమామను చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార తనేను అర్థం చేసుకోవట్లేదని రిషి, మీరు జగమొండి, జెంటిల్ మెన్ అని రిషి గురించి వసుధార అనుకుంటారు. కట్ చేస్తే జగతి, మహేంద్ర కాలేజీకి బయలుదేరతారు. ఈలోపు మహేంద్రతో కిందకు వచ్చిన రిషి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మహేంద్ర ముభావంగా ఉంటాడు. ఏంటి జగతి కాఫీ కోసం ఆగుదామంటే వద్దాన్నావ్.. ఇప్పుడెందుకు ఆగావు పదా వెళదాం అని వెళ్లిపోతుంటాడు మహేంద్ర. అయితే రిషి మాట్లాడాలనుకున్న విషయం అర్థం చేసుకున్న జగతి నాకు పని ఉంది వెళతాను అని చెప్పేసి వెళ్లోపోతుంది. మేడమ్ కి నా మనసులో మాట అర్థమైందా లేక నిజంగానే పని ఉందా అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రిషి, మహేంద్ర ఇద్దరు బయటకొచ్చి ఆగుతారు.
కేవలం నీ ఆనందం కోసమే ఇలా చేశాను..
పెద్దమ్మకి సారీ చెప్పినందుకు ఇలా ఉన్నారేమో అని అనుకున్న రిషి.. నేను నిన్న సారీ అడిగినందుకు ఏం బాధపడడం లేదు.. నీకోసం, కేవలం నీ ఆనందం కోసమే ఇలా చేశానని మహేంద్ర అనకుంటాడు. డాడ్ నాకు చిన్నప్పటినుంచి మీరు ఏం అడిగినా ఇచ్చారు. ఎప్పుడు నా సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు చేశారు. ఆ ఒక్క పని తప్ప మిగిలింది ఏం అడిగినా మీరు క్షణాల్లో తెచ్చేవారు అని రిషి అనుకుంటే నువ్వు అమ్మ కావాలి అని అడిగేవాడివి అది తప్ప అన్ని ఇచ్చాను అని మనసులో మహేంద్ర అనుకుంటాడు. నాకు వసుధార అంటే ఇష్టం డాడ్. నాకు తను కావాలి. కానీ నాకు తను తానుగానే కావాలి. ఈ ఒప్పందాలు ఏం వద్దు అని మనసులో రిషి అనుకుంటే నన్ను ఒప్పందం తిరిగి తీసురకోమని చెప్పలేక చెబుతున్నాట్టున్నాడు అని మహేంద్ర అనుకుంటాడు. నాకు వసుధార.. వసుధారలాగే కావాలి. నేను తనను ఏ విషయం కోసం వదులుకోవాలనుకోవడం లేదని చెప్పేసి మహేంద్రని కౌగిలించుకుని వెళ్లిపోతాడు రిషి.
రిషి కోసం ఆలోచిస్తే జగతికి అన్యాయం జరుగుతుంది..
ఇప్పుడు రిషి కోసం ఆలోచిస్తే అక్కడ జగతికి అన్యాయం జరుగుతుంది. జగతి కోసం ఆలోచిస్తే రిషిధార ప్రేమ పోతుంది. నాకు వీళ్ల ప్రేమ ముఖ్యం. రిషి ఆనందానికి అడ్డు రాకూడదు అని మహేంద్ర అనుకుంటాడు. కట్ చేస్తే జగతిని కలిసిన వసుధార మేడమ్ బయలుదేరదామా అని అంటుంది. ఎక్కడికి జగతి అని అడగడంతో క్యాంప్ కు మేడం అని వసుధార చెబుతుంది. నాకు ఒంట్లో బాలేదు. నేను రాలేను అని జగతి అనడంతో సరే మేడమ్.. నేను వెళ్తాను అని వసుధార అంటుంది. ఎలా వెళ్తావని జగతి అడిగితే.. నాకు టూ వీలర్ ఇచ్చారు మేడమ్ నేను వెళ్లగలను అని చెబుతుంది. అంతదూరం ఒక్కదానివి వెళ్తావా అని జగతి అంటే నాకు అలవాటే మేడమ్ అంటుంది వసుధార. నీకు మొండితనం పెరిగిపోతుందనుకుంటూ వసుధారతో రిషిని పంపిస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇలా అనుకుంటుండగా..కారు నుంచి దిగుతారు రిషి, మహేంద్ర.
టూ వీలర్ పై వీఆర్..
ఆ కారు పక్కనే టూ వీలర్ ఉంటుంది. దానికి వీఆర్ అని రాసి ఉంటుంది. మీరిద్దరూ క్యాంప్ కు వెళ్తున్నారా అని మహేంద్ర అడగడంతో లేదు సార్.. మేడమ్ కి ఒంట్లో బాలేదట నేను వెళ్తున్నాను అని వసుధార అంటుంది. నేను కూడా వస్తాను అని మహేంద్ర అనడంతో.. జగతి ఆపి ఇక్కడ మనకు పనులున్నాయి.. రిషిని వెళ్లమని అడుగు అని చెబుతుంది. రిషి క్యాబిన్ కు వెళ్తుంది వసుధార. అక్కడ రిషి ఉండడు. ఆ కుర్చీతో అక్కడున్న వస్తువులతో మాట్లాడుతూ ఏంటి విశేషాల.. జెంటిల్ మెన్ లా ఉంటారు. కానీ వస్తువులేవి సరిగ్గా ఉంచుకోరు అని వస్తువులను సర్దుతూ ఉంటుంది. ఇంతలో వచ్చిన రిషి ఒక మూల నుంచి దొంగచాటుగా వసుధారను వీడియో తీస్తుంటాడు. రిషి సార్ ఎంతో మంచోళ్లు.. ఎంతో ప్రేమ ఉంది. కానీ అంత ముక్కు మీద కోపం ఏంటి ఆ మనిషికి అని అంటుంది వసుధార. ఈ కుర్చీలో కూర్చుందామా.. మన రిషి సారే కదా.. అని రిషి కుర్చీలో కూర్చుంటుంది వసుధార. ఇదంతా వీడియో తీస్తుంటాడు రిషి.