twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: పంట పొలాల్లో విహరిస్తున్న రిషిధార.. పెళ్లి సంబంధంతో దేవయాని ప్లాన్?

    |

    రిషి క్యాబిన్ కు వెళ్లిన వసుధార అక్కడున్న కుర్చీలతో, టేబుళ్లతో మాట్లాడుతుంది. తర్వాత కుర్చీలో కూర్చొని చాక్లెట్ తిందామా.. మీకు సగం నాకు సగం.. మీ వాటా కూడా నేనే తినేస్తాను. రిషి.. వసు.. వసు..రిషి.. రిషిధార భలే ఉంది కదా అంటూ ఆ పక్కనే పెట్టుకున్న లవ్ సింబల్ చేతిలోకి తీసుకుంటుంది. ఇదంతా చాటుగా ఉండి వీడియో తీస్తుంటాడు రిషి. ఈలోపు రిషి ఫోన్ రింగ్ కావడంతో కంగారుగా వసుధార లవ్ సింబల్ ను పడేయబోతుంటే.. రిషి కాల్ కట్ చేసి క్యాబిన్ లోకి వెళతాడు. ఏంటిక్కడ అని రిషి అడగ్గా.. అది.. అది.. అని నసిగిన వసుధార నేను మళ్లీ కలుస్తాను సార్ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వసుధార వదిలేసిన చాక్లెట్ ను, లవ్ సింబల్ ను చేతిలోకి తీసుకుంటాడు. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 5, 2022 బుధవారం నాటి తాజా ఎపిసోడ్​ 573లో ఏం జరిగిందో చదివేసేయండి.

    జగతికి చెప్పడం ఎందుకు..

    జగతికి చెప్పడం ఎందుకు..

    కట్ చేస్తే బయట మహేంద్ర, జగతి మాట్లాడుకుంటారు. నువ్ ఎప్పటిలా హుషారుగా లేవు.. ఏం జరిగింది మహేంద్ర.. రిషితో గొడవపడ్డావా.. రిషి ఏమైనా అన్నాడా అని జగతి అడుగుతుంది. ఏం లేదు. తను ఏమైనా అంటే నేనేందుకు ఫీల్ అవుతాను అని మహేంద్ర అంటాడు. కానీ మనసులో మాత్రం రిషి గురించి జగతికి చెప్పడం ఎందుకు అనుకుంటాడు. ఈలోపు రిషి బయటకు వచ్చి జగతిని అక్కడే చూసి.. మీరు వెళ్లలేదా అని అడిగితే.. జగతికి ఒంట్లో బాలేదు.. అందుకే వసుధార మాత్రమే వెళ్లిందని మహేంద్ర చెబుతాడు. అంతదూరం టూ వీలర్ పై ఒక్కతే ఎలా వెళ్తుందని కోప్పడిని రిషి కారు తీసుకుని వెళ్లిపోతాడు. వసుధారను ఫాలో అవుతాడు. టూ వీలర్ పై అంతదూరం వెళ్లడం అవసరమా.. ఈ పొగరుకి.. అస్సలు తనపై శ్రద్ధ లేదనుకుంటూ ఫోన్ చేస్తాడు. డ్రైవింగ్ లో ఉండి కాల్ లిఫ్ట్ చేయదు వసుధారు. ఇలా బైక్ నడుపుతూ గట్టిగా అరుస్తూ పాటలు పాడుకుంటూ వెళితే ఎంత బాగుంటుందో అనుకుంటుంది వసుధార.

    వర్షంలో చిక్కుకుపోతే ఎలా..

    వర్షంలో చిక్కుకుపోతే ఎలా..

    తర్వాత విజిట్ చేయాల్సిన ప్లేస్ కు వెళ్లి బైక్ దిగిన తర్వాత రిషి కాల్ చేసిన విషయం చూసుకుని తిరిగి ఫోన్ చేస్తుంది. ఇంతలో రిషి వసుధార వెనకే నిల్చుంటాడు. మీరేంటి సార్.. అని వసుధార అంటే వెళ్లిపోమంటావా అంటాడు రిషి. మేడమ్ రాలేదని నేను వచ్చాను.. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా.. నిన్ను తిట్టాలని వచ్చానని అంటాడు. నువ్ ఇలా టూ వీలర్ పై తిరిగితే ఎలా.. వర్షాలు పడుతున్నాయి.. వర్షంలో చిక్కుకుపోతే ఎలా ఇలాంటి పనులు చేయొద్దు అంటుండగా.. స్లమ్ ఏరియా వాళ్లు అక్కడికి వస్తారు. తర్వాత పొలం గట్లపై నడుస్తున్న వసుధార తూలి పడబోతుంటే రిషి పట్టుకుంటాడు. మేడమ్ కి కొత్త కదా సార్.. అని అక్కడున్న వాళ్లు అనడంతో.. నేను కూడా పల్లెటూరి అమ్మాయినే అంటూ తనగురించి చెప్పుకొస్తుంది. వసుధార జాగ్రత్తగా నడువు అని చెప్పిన రిషి పడబోతుంటే వసుధార పట్టుకుంటుంది.

    ఈ ఒక్క పని చేయలేనా..

    ఈ ఒక్క పని చేయలేనా..

    మరోవైపు సోఫాలో కూర్చుని రిషి మాటలు తల్చుకుంటాడు మహేంద్ర. ఇంతలో దేవయాని కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది. కాఫీ ఇచ్చానని ఆశ్చర్యపోతున్నావా నా దగ్గర ఇంలాంటి సర్ ప్రైజ్ లు చాలానే ఉన్నాయి అని అంటుంది దేవయాని. సారి చెప్పించిందని, సారి చెప్పావని ఫీలవుతున్నావా.. అది రిషికి నాపై ఉన్న ప్రేమ. సారి చెప్పినంతమాత్రానా కిరీటాలు పడిపోతాయా ఏంటీ.. లోపల అహం అనేది ఉంటుంది కదా.. అది తృప్తి పడుతుంది. ఆలోచిస్తున్నా మహేంద్రతో వసుధారను నువ్ మర్చిపో.. నేను సాక్షిని మర్చిపోతాను.. మన స్థాయికి తగ్గ సంబంధం చూసి గ్రాండ్ గా రిషి పెళ్లి చేద్దాం.. అంటే మహేంద్ర ఏదో చెప్పబోతుండగా.. రిషి ఒప్పుకోడంటావా.. ఒప్పించు మహేంద్ర అని అంటుంది దేవయాని. దీనికి ఆ పనేదో మీరే చేయొచ్చుగా అని మహేంద్ర అంటే.. నేను ఏ పని అయినా చేయగలను.. ఎన్నో చేసినదాన్ని ఈ ఒక్క పని చేయలేనా.. కానీ ఎవరు ఏది చేయాలో వాళ్లే చేయాలి.. రిషికి ఎప్పుడు ఏది చెప్పాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తండ్రిగా బాధ్యత తీసుకుని రిషిని వేరే సంబంధానికి ఒప్పించు.. చెప్పింది మర్చిపోకు మహేంద్ర అని వెళ్లిపోతుంది దేవయాని.

    నీకు ఇష్టం లేనివి ఏమున్నాయి..

    నీకు ఇష్టం లేనివి ఏమున్నాయి..

    తర్వాత లోపలకు వెళ్లిన దేవయానికి జగతి ఎదురుపడుతుంది. వెళ్లు వెళ్లు మహేంద్ర ఎందుకో డల్ గా ఉన్నాడు.. మహేంద్రతో సారి చెప్పించగలిగిన దాన్ని నేను ఏదైనా చేయగలనని తెలుసుకోవడం మంచిది అంటుంది దేవయాని. మహేంద్ర దగ్గరికి వెళ్లిన జగతి.. అక్కయ్య ఏమంటోంది అని అడుగుతుంది. దీనికి విషపు నాగు ఎప్పుడూ ఎవర్ని కాటేయాలా అని ఆలోచిస్తుంది అని చెబుతాడు మహేంద్ర. ఇక మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ పనులు అయి తిరిగి వెళుతున్న రిషిధారలు ఒక చోట కూర్చుంటారు. పొలం చూద్దాం పదండి సార్ అని లోకల్ వాళ్లు అంటే నాకు ఓపిక లేదయ్యా అని రిప్లై ఇస్తాడు రిషి. దీంతో మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోకల్ అతను వెళ్లిపోతాడు. అలా అతను వెళ్లడంతో వాళ్లు జామకాయలు తీసుకొచ్చి ఇస్తారు.. నాకు చాలా ఇష్టం అని వసుధారం అంటుంది. దీనికి నీకు ఇష్టం లేనివి ఏమున్నాయి అని సెటైర్ వేస్తాడు రిషి. తర్వాత ఈ వాతావరణంలో మీరు నేను జామకాయలు తింటుంటే ఎంత బాగుంటుందో కదా సార్ అని వసుధార అంటుంది.

    English summary
    Guppedantha Manasu Serial October 5 2022 Today Full Episode 573
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X