twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: అప్పుడే ప్రేమ.. అంతలోనే కోపం.. అడ్డొస్తున్న 'అమ్మా' అనే పిలుపు

    |

    మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా పొలాల్లోకి వెళతారు రిషి, వసుధార. ఆ తర్వాత అలిసిపోయిన రిషి, వసుధార ఒక చోట కూర్చుని ఉంటారు. అక్కడున్న లోకల్ వాళ్లు వెళ్లి జామకాయలు తీసుకొచ్చి ఇస్తారు. దీనికి ఇప్పుడు జామకాయ పుట్టుపూర్వోత్తరాలు మొదలు పెడతావా అని వసుధారపై సెటైర్ వేస్తాడు రిషి. కారం పెట్టిన జామకాయ తిన్నప్పుడు నోరు మండినా ఆ టేస్టే వేరంటూ క్లాస్ స్టార్ట్ చేస్తుంది వసుధార. అనంతరం ఇద్దరూ బయలుదేరతారు. టూ వీలర్ ను వాళ్లుక ఇచ్చేయ్.. నువ్ ఎలా నడుపుతున్నావో అనే టెన్షన్ ఉంటుందని రిషి అంటే.. ఆటోలో తిరిగే దానికిన్నా ఇదే బెటర్ సార్.. నాకు అలవాటే పర్వాలేదు అని వసుధార అంటుంది. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 6, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 574లో ఏం జరిగిందో చదివేసేయండి.

    స్కూటిపై బయలుదేరుతుండగా..

    స్కూటిపై బయలుదేరుతుండగా..

    బైక్ పై తిరగడం అలవాటే పర్వాలేదని వసుధార చెప్పడంతో.. నా కార్లు నీ కార్లు కావా అని రిషి అంటాడు. ఇద్దరం ఒక్కటవలేదు కదా అని వసుధార అంటుంది. వసుధార మాట పూర్తవ్వకుండానే కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత వసుధార స్కూటిపై బయలుదేరుతుండగా రిషి ఎదురుగా నిల్చొని ఉంటాడు. కారు టైర్ పంచర్ అయింది లిఫ్ట్ కావాలని అడుగుతాడు. పంచరైందా.. కొంపతీసి అని సాగదీస్తుంది వసుధార.. నాకేం పంచర్ చేసే అలవాటు లేదంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరు కలిసి బైక్ పై వెళతారు. వసుధార డ్రైవ్ చేస్తుంటే రిషి వెనక్కి తిరిగి కూర్చుంటాడు. నాకేం బాలేదని రిషి అంటే.. ఎప్పుడూ మీరే డ్రైవ్ చేస్తారా.. అందుకే నేను బైక్ నడుపుతున్నా అని వసుధార అంటుంది. ఇక వెనక్కి తిరగి కూర్చున్న రిషిని చూసి చుట్టు జనం నవ్వుతారు. దీంతో తనే స్కూటి నడుపుతా అని తీసుకుంటాడు.

    రిషి. లోపలికి రావొచ్చు కదా సార్..

    రిషి. లోపలికి రావొచ్చు కదా సార్..

    ఆ తర్వాత వెనక కూర్చున్న వసుధార మాత్రం రిషి భుజంపై చేయి వేస్తుంది. అనంతరం తన రూమ్ దగ్గర వసుధారను డ్రాప్ చేస్తాడు రిషి. లోపలికి రావొచ్చు కదా సార్ అని వసుధార.. లోపలికి పిలవచ్చుగా అని రిషి మనసులో అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ అని రిషి అంటే.. మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని వసుధార అంటే ఈ విషయంలో నిన్ను మించి ఎవరుంటారని మళ్లీ సెటైర్ వేస్తాడు రిషి. తర్వాత ఆగమనొచ్చు కదా అని రిషి.. ఆగొచ్చు కదా అని వసుధార మనసులో అనుకుంటారు. దీంతో రిషినే వెనక్కి వస్తాడు. చాక్లెట్ కవర్ తో బొమ్మ చేసి వసుధారకు ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ బొమ్మ పట్టుకుని గదిలో కూర్చుని ఆలోచిస్తుంటుంది వసుధార. ఇంతలో డోర్ సౌండ్ కావడంతో పిల్లలెవరో వచ్చారనుకుంటుంది. కానీ, అక్కడ రిషి ఉంటాడు. కూర్చోమని చెప్పి టీ తీసుకొస్తానంటుంది వసుధార.

    జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తే..

    జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తే..

    ముందు వాటర్ తెచ్చి రిషికి ఇస్తుంది వసుధార. వసుధార చేయి పట్టుకుని కోర్చో వసుధార మాట్లాడాలి అని అంటాడు రిషి. ఎగిరే పక్షుల రెక్కలు విరిగిపోతే ఎలా తల్లడిల్లిపోతుందో అలా ఉంది నా పరిస్థితి. నీకు నాకు ఈ తెలియని దూరం ఏంటి వసుధార ఇది. నాకేం బాలేదు. మధ్యలో మాట్లాడాలనుకున్న వసుధారని ఆపి నేను చెప్పేది విను అంటాడు. మనిద్దరం కలిసి కారులో ప్రయాణం చేస్తోనే ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగేసుకున్నాం. అలాంటిది జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుందో కాదా.. మనిద్దరి మధ్య ఈ ఒక్క విషయం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతోంది. ప్రేమంటే ఎదుటి వాళ్లని భరించడమా, గౌరవించడమా.. అని అడుగుతాడు రిషి. అందుకు, ప్రేమంటే అన్నీ.. మిమ్మల్ని బాధించాలని నేనెప్పుడూ అనుకోను.. ఏం జరిగిందని మీరు ఇంతలా బాధపడుతున్నారు అని వసుధార అంటుంది.

    వసుధార కళ్లలో నీళ్లు..

    వసుధార కళ్లలో నీళ్లు..

    కష్టాలు, బాధలు, ఒంటరితనం నాలో నన్నే కుచించుకుపోయేలా చేస్తున్నాయి.. ఇప్పుడేదో బాగుంది అనుకుంటే నువ్వు కూడానా.. అని రిషి అనేలోపు వసుధార కళ్లలో నీళ్లు చూసి రిషి కంగారు పడతాడు. ఆనందం సార్.. ఇది గుండెపట్టలేని ఆనందం.. మీ దృష్టిలో నాకున్న స్థానం తెలుసుకుని నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి సార్. చిన్న పిల్లలకు కలల్లో సైతం ఊహించని బొమ్మ కానుకగా ఇస్తే ఆనందంతో పాటు ఆ బొమ్మ ఎక్కడ దూరమవుతుందో అనే భయం ఉంటుంది. అలా మీరెక్కడ దూరమవుతారో అని అనుక్షణం మనసులో గుబులుగా ఉంటోంది. పరీక్షలు అయిపోగానే అమ్మా నాన్న దగ్గరకు వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ మీకు దూరంగా ఉండలేక రిజల్ట్ వచ్చాక వెళదాం అని సర్ది చెప్పుకున్నా.. కొన్ని రోజులే మిమ్మల్ని వదిలి ఊరు వెళ్లడానికి మనసు రావడం లేదంటే.. ఏమైంది సార్ నాకు.. ఏం మాయ చేశారు అని వసుధార తన మనసులోని మాట చెబుతుంది.

    మాయ జరిగింది వసుధార..

    మాయ జరిగింది వసుధార..

    దీంతో మాయ జరిగింది వసుధార.. ఏం మాయ చేశావ్ అని నన్ను అడుగుతున్నావ్.. కానీ అదే మాయ నాకు కూడా జరిగింది కదా.. ఒకప్పుడు రిషి వేరు. కాలేజీకి నువ్ వచ్చాక నా జీవితంలోకి నువ్ వచ్చాక ఈ రిషి వేరు. పాఠాలు లెక్కలు చెప్పే నాకు జీవిత పాఠాలు చెప్పావ్. కొత్త లెక్కలు నేర్పావ్. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఆస్తులుగా అందించావ్. చివరి శ్వాస వరకు మనం కలిసి ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఈ దూరం.. శ్వాస ఆగిపోయినట్లు చేస్తోంది. ఎందుకు మన మధ్య ఈ దూరం అని రిషి అడుగుతాడు. నేను కూడా అదే చెబుతున్నాను సార్.. మన మధ్య దూరం లేదు. జగతి మేడం అనే చిన్న అభిప్రాయ బేధం ఉంది సార్. జగతి మేడమ్ ని అమ్మా అని పిలిస్తే.. అని అనేలోపు వసుధార అని గట్టిగా అరిచి లేచి నిల్చుంటాడు రిషి. నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ ప్రస్తావన వద్దని.. నేను ఏం కోల్పోయానో నీకేం తెలుసు.. అని రిషి అంటే.. కోల్పోయిన తల్లి ప్రేమ ఇప్పుడైన పొందుచ్చు కదా.. నిజం తెలుసుకోండి సార్ అని వసుధార అంటుంది. అందుకు నిజం నాకు తెలుసు అని రిషి అనడంతో.. జగతి మేడమ్ ఎందుకు వెళ్లారో మీకు తెలుసా అని వసుధార అంటే.. ఎందుకు వెళ్లిందో కాదు.. నన్ను వదిలేసి వెళ్లారు అంతే.. అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి

    English summary
    Guppedantha Manasu Serial October 6 2022 Today Full Episode 574
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X