twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: కోపతాపాలతో రిషిధార.. పరిష్కారం కోసం మహేంద్ర ఆలోచన

    |

    తమని వదిలి జగతి మేడమ్ ఎందుకు వెళ్లారో మీకు తెలుసా అని రిషితో వసుధార అనగానే.. ఎందుకు వెళ్లిందో కాదు.. నన్ను వదిలేసి వెళ్లారు అంతే.. అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. ఇంతలో కారు తీసుకొచ్చిన గౌతమ్.. రా కూర్చో అంటాడు. వసుధార నుంచి కాల్ రావడంతో గౌతమ్ ఇబ్బందిగా లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లాక్కున్న రిషి ఏంటిది.. అని ఫోన్ కట్ చేస్తాడు. నువ్ నడుచుకుంటూ రావడం, నేను కారులో రావడం ఏంట్రా అని గౌతమ్ అడిగితే చిరాకు పడతాడు రిషి. దీంతో గౌతమ్ సైలెంట్ అయిపోతాడు. ఇంటికి చేరుకున్న రిషి వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 7, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 575లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఈ సమస్యకు పరిష్కారం ఏంటీ..

    ఈ సమస్యకు పరిష్కారం ఏంటీ..

    రిషి మాత్రమే కాకుండా మరోవైపు మహేంద్ర కూడా వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వసుధారను ఒప్పించమని రిషి అంటున్నాడు.. వదిన రిషిని ఒప్పించమంటోంది.. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటీ అని అనుకుంటాడు. ఇంతలో వచ్చిన రిషి ఇక్కడ కూర్చున్నారేంటి అని అడుగుతాడు. అన్ని మర్చిపోయి ఓ రోజంతా తనివితీరా నిద్రపోవాలని ఉంది. కళ్లు మూసుకుంటే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయని మహేంద్ర అంటాడు. ఇది నా వల్లనా అని రిషి అడగడంతో.. మన వల్ల అనుకోవాలి అని మహేంద్ర సమాధానం ఇస్తాడు. నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా, మొండిగా ప్రవర్తిస్తున్నానా అని రిషి అంటాడు. ప్రకృతికి ఒక ధర్మం ఉంటుంది. దానికి విరుద్ధంగా వెళ్లకూడదు. ప్రవాహ దిశను మార్చాలని చూస్తున్నావ్ అందుకే నువ్ బాధపడుతున్నావ్ అని మహేంద్ర అంటాడు. వసుధారతో బంధం వదులుకోవాలని నేను అనుకోవట్లేదు కానీ తనే.. అని రిషి అంటే.. బంధం పరిమళం లాంటిది. ఒక్కోసారి నువ్ వద్దన్నా అది నిన్ను వీడిపోలేదు. ఇప్పుడు జగతిని నేను వదులుకోగలనా.. నేను జగతిని వదులుకోలేను.. నువ్వు వసుధారని వదులుకోలేవు అని మహేంద్ర చెబుతాడు.

     మన ఆలోచనలో పరిణితి ఉండాలి..

    మన ఆలోచనలో పరిణితి ఉండాలి..

    దీంతో మన ఇద్దరం ఉన్నప్పుడే బాగుండేవాళ్లం డాడ్ మీకు నాకు మధ్య మేడమ్ వచ్చింది అని రిషి అంటాడు. నీకు నాకు మధ్య వసుధార వచ్చింది. సమస్య వ్యక్తులు రావడం వల్ల కాదు. మన ఆలోచనలో పరిణితి ఉండాలి అంటున్న మహేంద్ర ఒళ్లో తలపెట్టి పడుకుంటాడు రిషి. మనిషి కష్టాలకు కోరికలే మూలం అంటూ చెప్పుకొస్తాడు మహేంద్ర. చెప్పినంత ఈజీ కాదు కొన్ని పాటించడం అని సమాధానం రిషి సమాధానం ఇస్తాడు. వీళ్లద్దరిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది జగతి. ఆ తర్వాత రోజు ఆటోలో వెళ్తుంది వసుధార. ఆటో వెళుతూ టూ వీలర్ పై తిరగొద్దు అన్న రిషి మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార. నేను చెబితే వినరు కానీ, మీరు చెప్పగానే నేను వింటాను అని అనుకుంటుది. నన్ను పొగరు అంటారు కానీ, ఆ పొగరులో కూడా ప్రేమ కనిపిస్తుంది. ఇంతలో ఆటో డ్రైవర్ కి ఫోన్ వస్తుంది. ఆటో పక్కన ఆపి కాల్ మాట్లాడండి, డ్రైవింగ్ చేస్తూ వద్దంటుంది వసుధార. ఆటో పక్కన ఆపిన డ్రైవర్ తన కుమార్తెతో మాట్లాడుతాడు. కాల్ తర్వాత మీ అమ్మాయా అని వసుధార అడుగుతుంది.

    నన్ను మర్చిపోయారో ఏంటో..

    నన్ను మర్చిపోయారో ఏంటో..

    దీనికి అవును, బొమ్మల కొలువు పెట్టాలని అల్లరి చేస్తోందని చెబుతాడు ఆ డ్రైవర్. నేనే బొమ్మలు తయారు చేస్తానని చెబుతాడు డ్రైవర్. దీంతో తన తల్లిన గుర్తు చేసుకుంటుంది వసుధార. వాళ్లు నన్ను మర్చిపోయారో ఏంటో అని అందరూ ఎలా ఉన్నారో అని తలుచుకుంటుంది. కట్ చేస్తో కాలేజీలో ఓ చెట్టు కింద వసుధార ఓవైపు రిషి మరోవైపు కూర్చుంటారు. ఒకర్నొకరు చూసుకోరు. కాలేజీ అంతా సందడిగా ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉంది. కాలేజీ అంతా నాదే. కాలేజీలో నేను ఒక్కదాన్నే అనుకుంటుంది. అటు రిషి కూడా వసుధారతో కాలేజీలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. నన్ను మర్చిపోయేలా చేశావ్.. ప్రతి ఆలోచనలో నువ్వే నిండిపోయావ్. ఇప్పుడు రిషి అంటే వసుధార. కానీ ఒకే విషయంలో ఇబ్బంది పెడుతున్నావ్ అనుకునేలోపే మరోవైపు కూర్చున్న చేతిలో ఉన్న రంగు బాటిల్ కిందపడుతుంది. ఆ సౌండ్ తో వసుధారను చూస్తూడా రిషి.

    మీరే నా సైన్యం..

    మీరే నా సైన్యం..

    ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని రిషి అడిగితే.. ఈ బొమ్మల్ని డెకరేట్ చేస్తున్నాను. పండుగలకు బొమ్మల్ని అలంకరించడం చేస్తారు కదా వాటికోసం రాజు రాణి బొమ్మల్ని తెచ్చుకున్నా సార్. దసరా, దీపావళికి బొమ్మల కొలువు పెట్టుకుంటే బాగుంటుంది అని వసుధార అంటే నేను కూడా హెల్ప్ చేయనా.. అని రిషి అడుగుతాడు. అందుకు మీకిది రాదు తర్వాత నేర్పిస్తానంటుంది వసుధార. దీంతో ఇటు రా అని వసుధార చేతిలో ఉన్న బొమ్మలను తీసుకుంటాడు రిషి. రాజు రాణి బొమ్మలు పక్కపక్కనే ఉండాలని వసుధార అంటే మరి సైన్యం ఏది అని రిషి అంటాడు. ఇందుకు మీరే నా సైన్యం అంటుంది వసుధార. తర్వాత నిన్నటి రిపోర్ట సబ్ మిట్ చేయనా అని వసుధార అంటే వెంటనే వెళ్లిపోతావా అని రిషి అంటాడు. తర్వాత మనల్ని కలిపిన ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం. ఇంతమంచి వాతావరణంలో ఏదైనా మంచి పాట పాడొచ్చు కదా అని వసుధార అంటే గౌతమ్ కి కాల్ చేసి ఆర్కేస్ట్రాని పంపించమను.. అసలు విషయాన్ని వదిలేసి మనం ఏవోవో మాట్లాడుకుంటున్నాం అని రిషి అంటాడు.

    ఇద్దరి మధ్య చిన్న అడ్డుతెర..

    అసలు విషయం ఏంటి అని వసుధార అడిగితే.. మన ఇద్దరి మధ్య చిన్న అడ్డుతెర ఉంది. దాన్ని నువ్వు తొలగిస్తావని చూస్తున్నా అని రిషి అంటాడు. నా ఆలోచనలు తప్పు అనిపించవచ్చు కానీ, కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది అని వసుధార అంటుంది. నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు.. ఓ చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకింత మొండిపట్టు పడుతున్నావ్.. నేను బంధాలకు, ప్రేమకు విలువ ఇస్తాను అని రిషి అంటే.. అమ్మను అమ్మా అని పిలవడానికి మీకు ఎందుకింత అని వసుధార అంటుంది. నా మనసులో ఉన్నది పదే పదే చెబుతున్నా.. నీకు అర్థం కావడం లేదంటూ కోపంగా వెళ్లిపోతాడు రిషి. సైట్ విజిటింగ్ రిపోర్ట్ అని వసుధార అడిగితే.. జగతి మేడమ్ కి ఇచ్చేసి వెళ్లు అనేస్తాడు రిషి. తర్వాత మీరు జగతి మేడమ్ ని అమ్మా అని పిలుస్తారు.. పిలిచేలా చేస్తాను అని అనుకుంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial October 7 2022 Today Full Episode 575
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X