Guppedantha Manasu: వసుధార చివరి పరీక్ష రాయకుండా దేవయాని వేసిన ప్లాన్ ఫలిస్తుందా ?
ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. పరీక్షలు ఎలా రాశారు అని స్టూడెంట్స్‌ను అడుగుతాడు రిషి. బాగానే రాస్తున్నాం అని ఓ విద్యార్థిని ఆన్సర్ ఇవ్వగా.. అందరూ సమాధానం చెప్పాలి కదా అని అంటాడు రిషి. దీంతో నేను కూడా బాగానే రాస్తున్నాను సార్ అని అంటుంది వసుధార. ఇంకో పరీక్ష ఉంది. అది పూర్తయ్యే వరకు మీరు రిలాక్స్ కాకూడదు. అర్థం అవుతోంది కదా అని రిషి చెప్పగా.. అర్థం అయింది సార్ అని అంటుంది వసుధార. తర్వాత మనం ఇవన్నీ మిస్ అవుతాం కదా అని వసుతో అంటుంది పుష్ప. నేను మాత్రం రిషి సార్‌ను మిస్ అవుతాను అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇలా సాగుతున్న సీరియల్లో సాక్షి వేసే ప్లాన్ ఎలా మలుపు తిప్పిందో తెలియాలంటే సెప్టెంబర్ 1, 2022 గురువారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్ తాజా ఎపిసోడ్ 544 చదవాల్సిందే!

మనమిద్దరం ఓడిపోతాం..
రిషి సార్‌ను మిస్ అవుతానని మనసులో వసుధార అనుకుంటుండగా.. మరోవైపు దేవయాని, సాక్షి ఇద్దరూ కలుస్తారు. వసుధారను ఇంటి వాళ్లు అందరూ నెత్తిమీద పెట్టుకుంటున్నారు. తను జీవితంలో ఏదో సాధించినట్లు ఎన్నో కలలు కంటున్నారు. తను పాస్ అయి గొప్పదని పేరు తెచ్చుకుంటే వసుధార గెలుస్తుంది. దీంతోపాటు రిషి గెలుస్తాడు. మనమిద్దరం ఓడిపోతాం. అని అంటుంది దేవయాని. నాకు దక్కని రిషి వేరే ఎవ్వరికీ దక్కకూడదు అని మనసులో అనుకుంటుని, మరి ఏం చేద్దాం ఆంటీ అని దేవయానిని సాక్షి అడుగుతుంది. వసుధార చివరి పరీక్ష రాయకూడదు అని సమాధానమిస్తుంది దేవయాని.

పరీక్షలో ఫెయిల్ అయితే..
మరి ఎలా చేద్దాం అని సాక్షి అడిగ్గా.. ఒక పథకం చెబుతాను. నువ్వు దాన్ని అమలు చేయి అంటుంది దేవయాని. వసుధార పరీక్షలో ఫెయిల్ అయితే రిషి కూడా ఫెయిల్ అయినట్లే అంటుంది దేవయాని. వసుధార అసలు పరీక్ష హాల్లోకి వెళ్లకూడదు అని అంటుంది. ఇక మరోవైపు వసుధారను జగతి కలుస్తుంది. పద వసుధార నిన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తానంటుంది. ఇక ప్లాన్‌లో భాగంగా సాక్షి ఎవరినో కాలేజ్‌లో పురమాయిస్తుంది. వసుధార పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు ఒక మహిళ ఎదురుచూస్తు ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి.. పరీక్షకు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నట్లే కదా అని జగతిని అడుగుతాడు.

లాంగ్ డ్రైవ్ వెళ్లాలి..
ఈ సీన్ తర్వాత రిషి తన రూమ్‌లోకి వెళ్లి ఎగ్జామ్ ఎలా రాశావు? అని వసుధారకు మెసెజ్ పెడతాడు. దానికి బాగానే రాశాను సార్ అంటుంది వసుధార. తర్వాత ఏంటీ? అని రిషి అడగ్గా.. లాస్ట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ కావాలని అంటుంది వసు. ఆ ఎగ్జామ్ తర్వాతం ఏంటీ? అన్న రిషి ప్రశ్నకు.. పిక్నిక్ లేదా లాంగ్ డ్రైవ్ అని చెబుతుంది వసుధార. ఎవరితో అని అడుగుతాడు రిషి. దీనికి నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతనితో అని అంటుంది వసు. మరి పర్మిషన్ తీసుకున్నావా? అని అడుగుతాడు రిషి. పర్మిషన్ ఇంకా తీసుకోలేదు. తీసుకోవాలి అని అంటుంది వసుధార. ఈలోపు రిషికి కాల్ వచ్చేసరికి మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు.

వసుధార ఫోన్ స్విచ్ ఆఫ్..
ఇదిలా ఉంటే మరోవైపు ఒక మహిళను కాలేజ్‌కు తీసుకొస్తుంది సాక్షి. మత్తుమందు చల్లిన కర్చీఫ్ తెచ్చి వసుధార మొహానికి పెడుతుంది. దీంతో వసుధార స్పృహ తప్పుతుంది. వెంటనే తనను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి వెళ్తారు సాక్షి, ఆ మహిళ. రాత్రి అవుతుంది. వసు ఏం చేస్తుంది అని మెసేజ్ చేస్తాడు రిషిభూషన్. రిప్లై రాదు. దీంతో తను ఏం చేస్తుందో అని ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో రిషి టెన్షన్ పడుతుండగా, గౌతమ్ అప్పుడే వస్తాడు. ఏమైందిరా అని అడుగుతాడు. వసుధార ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది అని చెబుతాడు. మరోవైపు దేవయానికి సాక్షి మెసేజ్ చేస్తుంది. మన ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ ఆంటీ అని మెసేజ్ పెడుతుంది సాక్షి. దీంతో వెరీ గుడ్ సాక్షి. ఈ ఒక్క పని అయనా సరిగ్గా చేశావు అని అనుకుంటుంది దేవయాని.

దేవయాని షాక్..
టెన్షన్ పడుతున్న రిషి.. గౌతమ్‌తో వసుధార ఇంటికి వెళ్లి చూస్తారు. ఇల్లు లాక్ చేసి ఉండేసరికి మరింత టెన్షన్ పడుతాడు రిషి. రెస్టారెంట్‌కు కాల్ చేయడం, ఫైనల్ ఇయర్ గ్రూప్‌లో మెసేజ్ పెట్డడం వంటి చాలా పనులు చేస్తాడు రిషి. జగతికి, మహీంద్రాకు వసుధార కనిపించట్లేదని చెబుతారు. మరోవైపు కాలేజ్‌కు వెళ్దాం పదా అంటాడు రిషి. దీంతో మనం కూడా వెళ్దాం పదా అని మహీంద్రా, జగతి ఇద్దరు బయటకు వెళ్తుంటారు. ఇంతలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దేవయాని. దీనికి వసుధార కనిపించట్లేదని సమాధానం ఇస్తారు. అయ్యయ్యో.. వసుధార కనిపించకపోవడం ఏంటీ? అని షాక్ అవుతుంది దేవయాని.

వసుని చూసి షాక్ అయిన రిషి..
ఆ తర్వాత జగతి, మహీంద్రా ఇద్దరు బయటకు వెళ్తారు. పాపం వసుధారకు ఏమైందో అని ధరణి అంటే.. మనకు అవసరమా ఈ టాపిక్. వెళ్లి పని చూసుకో అని దేవయాని అంటుంది. ఇక్కడ కట్ చేస్తే రిషి, గౌతమ్ ఇద్దరూ కాలేజ్‌కు వెళ్తారు. మహీంద్రా, జగతి కూడా కాలేజ్‌కు వస్తారు. సెక్యూరిటీని అడుగుతారు. తర్వాత వసుధారను పడుకోబెట్టిన రూమ్‌కు వెళ్తాడు రిషి. అక్కడ వసుధారను చూసి షాక్ అవుతాడు రిషి. ఆ తర్వాత వసుధారను ఇంటికి తీసుకొస్తాడు రిషి. నీ ఆశయం బతకాలి. లే.. వసుధార అంటాడు. కానీ.. వసు లేవదు. ఇక్కడితో 544 ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











