Guppedantha Manasu: సంబరపడిపోతున్న దేవయాని.. రిషి ప్రశ్నకు వసుధార ఏం సమాధానం చెప్పనుంది?

రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది వసుధార. కానీ రిషి మాట్లాడకపోవడంతో, బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. అనంతరం మహేంద్రా, జగతి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. మనవళ్ల వాళ్లు విడిపోవాల్సి వచ్చింది, లేదంటే.. రిషి, వసుధార చాలా సంతోషంగా ఉండేవారు అని, అవును.. ఇదంతా నేనే చేశాను అని మహేంద్రా.. జగతితో అంటాడు.

నేను అనేదాన్ని లేకపోతే ఇలా జరిగేది కాదు కదా మహేంద్రా అని జగతి అంటుంది. ఇలా వీళ్లిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇలా ఆసక్తికరంగా సాగిన సెప్టెంబర్​ 19, 2022 సోమవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 559లో ఏం జరిగిందో చదివేసేయండి.

సంతోషంగా దేవయాని

సంతోషంగా దేవయాని

ఒకరినొకరు నిందించికుంటూ బాధపడుతుంటారు మహేంద్రా, జగతి. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, రిషి తన తప్పు తానే తెలుసుకునే రోజు కూడా వస్తుంది అని అంటాడు మహీంద్రా. మరోవైపు దేవయాని చాలా సంతోషంగా ఉంటుంది.

ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంటే ఎంత బావుందో అనుకుంటూ.. వీళ్ల ఏడుపులు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి లేకపోతే ఏంటి నన్ను పట్టించుకోకుండా వీళ్లకు వీళ్లు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చూడు ఏమైందో అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది దేవయాని. తర్వాత రిషి దగ్గరికి వెళ్తుంది దేవయాని.

కోపానికి వచ్చిన రిషి..

కోపానికి వచ్చిన రిషి..

రిషి దగ్గరికి వెళ్లిన దేవయాని.. నాన్నా నీ గురించే బాధపడుతున్నాను, నీ కోసమని ఇప్పటిదాకా తినకుండా ఉన్నాను అని చెబుతూ ఉంటుంది దేవయాని. అలాగే వసుధార ఎంత తెలివైందో తెలియాలనే ఇలా చేశానే తప్పా.. ఇంకో ఉద్దేశం వేరే ఏం లేదు నాన్నా, తను కూడా చాలా మంచిది అనడంతో రిషి కోపానికి వస్తాడు.

పెద్దమ్మ అంటూ.. ఈ ఇంట్లో మీరొక్కరే నాకు ఉన్నది, మీరు కూడా ఇలా మాట్లాడకండి అని చెప్పడంతో లోలోపలే దేవయాని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. రిషి మనసులో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అని, ఇదే కదా నాకు కావాల్సింది అనుకుంటూ వెళ్లిపోతుంది దేవయాని.

ధరణికి తెలిసిపోయిన దేవయాని కుట్ర..

తర్వాత తన రూమ్ లోకి వెళ్లి.. రాజీవ్ కు ఫోన్ చేస్తుంది దేవయాని. ఫోన్ కాల్ లో ఇదే సరైన సమయం.. వీళ్లిద్దరూ విడిపోయారు.. నువ్వు వసుధారను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ అవకాశం వదులుకోవద్దు అని చెబుతుంది దేవయాని. ఇదంతా విన్న ధరణి.. మీ నిజస్వరూపం బయట పడే రోజూ వచ్చింది.. ఇంత కుట్ర పన్నుతారా అత్తయ్య అని మనసులో అనుకుంటూ, ఏం తెలియనట్లు వెళ్లి దేవయానికి కాఫీ ఇస్తుంది ధరణి. ఇదిలా ఉంటే మరోవైపు.. ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు వసుధార అని రిషి అంటాడు.

నువ్వు నన్ను ప్రేమించింది రిషి సార్ గానా? లేకపోతే జగతి మేడం కొడుకుగాననా? అని అనడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రిషి అడిగిన ప్రశ్నకు వసుధార ఏం సమాధానం చెబుతుందో తెలియాలంటో తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X