Guppedantha Manasu: నీరసంగా ఎగ్జామ్​ హాల్​లోకి వసుధార.. ఆశయం నెరవేరేనా?

రిషి, గౌతమ్​ కాలేజ్​కు వసుధారను వెతికేందుకు కాలేజ్​కు వెళ్తారు. ఇంతలో మహీంద్రా, జగతి కూడా కాలేజ్​కు వస్తారు. అంతా కలిసి కాలేజ్​ మొత్తం వెతుకుతారు. కానీ ఎక్కడా వసుధార కనిపించదు. ఈ రాత్రి నేను గెస్ట్​ హౌస్​లోనే ఉంటాను, మీరు వెళ్లండి అని రిషి చెబుతాడు. దీంతో జగతి, మహీంద్రా ఇంటికి వెళ్లిపోతారు. గెస్ట్​ హౌస్​కు వెళ్లిన రిషి.. వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మళ్లీ ఫోన్ చేస్తాడు. స్విచ్​ ఆఫ్ వస్తుంది. దీంతో రిషికి పిచ్చెక్కినంత పనవుతుంది. వసుధారకు ఏమైంది? రేపు ఎగ్జామ్​ ఉంది కదా.. ఎక్కడికి వెళ్లావు? వసుధార అనుకుంటూ అక్కడే సోఫాపై పడుకుంటాడు. ఇలా వసుధార కోసం రిషి టెన్షన్​ పడుతూ ప్రారంభమైన ఇవాళ్టి అంటే సెప్టెంబర్​ 2, 2022 శుక్రవారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్​ తాజా ఎపిసోడ్​ 545లో ఏం జరిగిందో ఇలా చదివి తెలుసుకోండి.

ఉదయం అవుతుంది. రిషి లేచి చూసేసరికి 8.30 గంటలు అవుతుంది. పరీక్ష సమయం అవుతోంది. వసుధార ఎక్కడ ఉంది అని రిషి టెన్షన్​ పడుతుంటాడు. మళ్లీ ఫోన్​ చేస్తాడు కానీ మళ్లీ అదే స్విచ్​ ఆఫ్ అని వస్తుంది. ఈరోజు వసుధార ఎగ్జామ్​ రాయకపోతే తను అనుకున్న లక్ష్యం ఏం కావాలి. ఎక్కడికి వెళ్లావు వసుధార అని అనుకుంటాడు రిషి. ఇంతలో జగతి, మహీంద్రా వస్తారు. వసుధార గురించి ఏమైనా తెలిసిందా? అని మహీంద్రాను అడుగుతాడు రిషి. దానికి ఏం తెలియదు అంటాడు మహీంద్రా. వసుధార గురించి జగతిని అడుగుతాడు రిషి. మేమందరం వసుధార ఫ్రెండ్స్​ అందరికి ఫోన్​ చేసి అడిగాం. ఎవ్వరూ తెలియదు అని చెబుతున్నారని జగతి సమాధానం ఇస్తుంది.

ఇంతలో పుష్ప వస్తుంది. తనకు కూడా తెలియదు అని చెబుతుంది. రిషి టెన్షన్​ పడుతూ ఉంటే ఎగ్జామ్​కు టైమ్​ అవుతోంది. ఆ ఏర్పాట్లు చూడాలి అని మహీంద్రా అంటాడు. దీంతో మీరు వెళ్లండి అని రిషి చెబుతాడు. ఆ తర్వాత కాలేజ్​ లోపలికి వెళ్తాడు రిషి. నాకోసం అయినా కనిపించు వసుధార అని అనుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్.. మీరు జెంటిల్​మేన్​ సార్​ అని వసుధార అన్నట్లుగా కలగంటాడు రిషి. ఇంతలో వసుధార బ్యాగు నుంచి కింద పడ్డ గోలీలు కనిపిస్తాయి. ఇవి వసుధార దాచుకున్న గోలీలే కదా అని.. వాటిని చూస్తూ వెళ్తాడు రిషి. అక్కడ ఉన్న రూమ్​లో చెక్ చేస్తాడు. కానీ వసుధార కనిపించదు. మరో గదికి వెళ్లి చూస్తాడు. అక్కడ తన కాళ్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లి వసుధార కిందపడి పోయి ఉండటం చూసి షాక్ అవుతాడు.

Guppedantha Manasu Serial September 2 2022 Today Full Episode 545

వెంటనే తన దగ్గరకు వెళ్లి.. వసుధార నీకు ఏమైంది? వసుధార లే అని అంటాడు. రిషి ఎంత లేపిన వసుధార లేవదు. ఇంతలో గౌతమ్ వస్తాడు. వసుధార ఇక్కడ పడిపోయింది. వెంటనే డాక్టర్​ను తీసుకురా అని గౌతమ్​కు చెబుతాడు రిషి. వసుధారను లేపి అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. తన గదిలో సోఫాపై కూర్చోబెడతాడు. నీళ్లు కొట్టిన వసుధార లేవదు. దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నీకు ఎగ్జామ్​ ఉంది వసుధార. ఇది నువ్వు రాసి తీరాలి వసుధార అని అంటాడు రిషి. నీళ్లు తాగు వసుధార అంటాడు రిషి. అయినా వసుధార లేవదు. నువ్వు ఎగ్జామ్​ రాయాలి. నీకు లక్ష్యం ఉంది. నువ్వు యూనివర్సిటీ టాపర్ అవ్వాలి అంటాడు. నేను రిషిని చెబుతున్నా లే అను అంటాడు.

మరోవైపు ఎగ్జామ్​ ప్రారంభం అవుతుంది. జగతి క్వశ్చన్​ పేపర్స్​ తీసుకెళ్తుంది. వసుధారకు ఏమైంది? ఎగ్జామ్​కు ఎందుకు రాలేదు అని జగతి అనుకుంటుంది. క్వశ్చన్​ పేపర్స్​ అందరికీ ఇచ్చేశాక పరీక్ష స్టార్ట్​ అవ్వగానే.. మేడమ్​ క్వశ్చన్​ పేపర్​ అని వసుధార అడుగుతుంది. దీంతో ఏమైంది వసుధార? అని అడుగుతుంది. తర్వాత.. సరే ముందు ఎగ్జామ్ రాయి.. తర్వాత మాట్లాడుదాం అంటుంది జగతి. ఇక ఎగ్జామ్​ రాసేందుకు ప్రయత్నిస్తుంది వసుధార. కానీ, రాయలేకపోతుంది. వసుధార కళ్లు బైర్లు కమ్ముతాయి. చేతిలో పెన్ను కిందపడిపోతుంది. టేబుల్​పై పడిపోతుంది. రిషి వచ్చి లేపి చేతికి పెన్ను అందిస్తాడు. వసుధారకు ఎగ్జామ్​ రాసేంత శక్తి రావాలి అని రిషి అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్​ ఎపిసోడ్​ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X