Guppedantha Manasu: రిషిని బాగా అర్థం చేసుకోగలనని వసుధార.. ఎప్పటికీ మారనంటూ రిషి..

రిషి, వసుధారలు కారులో బయటకు వెళ్తారు. కారు ఆపి కిందకు దిగుతారు. తర్వాత ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు వసుధార అని రిషి అంటాడు. నువ్వు నన్ను ప్రేమించింది రిషి సార్ గానా? లేకపోతే జగతి మేడం కొడుకుగాననా? అని వసుధారను అడుగుతాడు రిషి. వెంటనే నేను ప్రేమించిన వ్యక్తి జగతి మేడం కొడుకు కాదా సార్ అని అంటుంది వసుధార. అంతేకాకుండా ఇందులో తప్పేముంది అంటూ.. అసలు ఇంతకు ఏం జరిగిందంటే అని వసుధార చెప్పబొతుండగా అడ్డుకుంటాడు రిషి. లా ఆసక్తికరంగా సాగిన సెప్టెంబర్​ 20, 2022 మంగళవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 560లో ఏం జరిగిందో చదివేసేయండి.

 జగతి మేడం కొడుకే కదా..

జగతి మేడం కొడుకే కదా..


నువ్ నన్ను రిషిగా ప్రేమించావా? లేకపోతే జగతి మేడం కొడుకుగా ప్రేమించావా? అని వసుధారను రిషి ప్రశ్నించగా.. మీరు జగతి మేడం కొడుకే కదా సార్ అని అంటుంది వసుధార. నువ్వు తెలివిగా సమాధానం చెప్పకు వసుధార అని రిషి అంటాడు. సార్ మీరు ఎలా అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీరే నా ప్రాణం సార్ అని వసుధార అంటుంది. అలాగే అసలు ఇంతకీ ఏం జరిగిందంటే అని వసుధార చెబుతుండగా ఆపుతాడు రిషి.

 ఒప్పందాలు, షరతులు పెట్టావనే బాధ..

ఒప్పందాలు, షరతులు పెట్టావనే బాధ..


వసుధార చెప్పే విషయాన్ని వినుకుండా ఆపిన రిషి.. మా డాడ్ కి నీకు మధ్య జరిగిన దానికి మన ప్రేమకు ఎలాంటి సంబంధం లేదు. ఒక మనిషిని ప్రేమించడానికి ఒప్పందాలు, షరతులు పెట్టావనే బాధ తప్ప మరేమి లేదు అని అంటాడు. ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ మీద నాకు ప్రేమ పోలేదు. కోపం మాత్రమే ఉంది వసుధార అని రిషి తన మనసులో అనుకుంటాడు. తర్వాత వసుధారను ఇంట్లో డ్రాప్ చేస్తాడు రిషి. ఆ తర్వాత రిషి తన ఇంటికి వెళ్లగానే.. వసుధార ఎక్కడ అని గౌతమ్ ప్రశ్నిస్తాడు.

మధ్యలోనే వదిలేస్తావా?

మధ్యలోనే వదిలేస్తావా?

వాళ్ల ఇంట్లో దించేసి వస్తున్నానని రిషి అనడంతో అలా మధ్యలోనే వదిలేస్తావా? అని గౌతమ్ అంటాడు. దీంతో లేదు, నేను వదిలేయలేదు. తనే వెళ్లిపోవాలనుకుంది. తన నిర్ణయాన్ని నేను గౌరవించాను అని గౌతమ్ కు సమాధానం చెబుతాడు రిషి. తర్వాత మరోవైపు జగతి మేడంను రిషి సార్ అమ్మా అని పిలిస్తే ఎంత బావుంటుందో అని అనుకుంటుంది వసుధార. మీ మనసు మీకన్నా బాగా నేనే అర్థం చేసుకోగలను అని, జగతి మేడం విషయంలో మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదులుకోను అని గట్టిగా మనసులో అనుకుంటుంది వసుధార. ఇక రిషి ఏమో.. వసుధార నన్ను ప్రేమిస్తే నా మనసు అర్థం చేసుకోవాలి కదా.. నేను ఎప్పటికీ మారను అని భీష్మించుకుంటాడు రిషి.

నిన్న జరిగిన కథ ఏంటంటే?

నిన్న జరిగిన కథ ఏంటంటే?

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 సోమవారం జరిగిన ఎపిసోడ్ లో రిషి, వసుధారలు విడిపోయారని ఒకరినొకరు నిందించుకుంటూ బాధపడుతుంటారు మహేంద్ర, జగతి. ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్ కంగారుగా, వసుధార కనిపించడం లేదు అని చెబుతాడు. దీంతో అందరూ కలిసి వసుధార కోసం వెతుకుతూ ఉంటారు. రిషి వద్దకు వెళ్లి వసుధార కనిపించడం లేదని, నీకేమైన చెప్పిందా? అని అడుగుతాడు. దీంతో తనతో ఏం చెప్పలేదని రిషి చెప్పడంతో గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో వసుధారకు ఏమైంది అని వెతుకుతూ మేడపైకి వెళతాడు రిషి. అక్కడ వసుధార దీపాన్ని ఆకాశంలోకి వదులుతూ జగతి మేడం విషయంలో నేను అనుకున్నది జరగాలని కోరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X