twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: మన ప్రేమకోసం సాయం చేయమని అడిగిన రిషి.. కన్నీళ్లు పెట్టుకున్న వసుధార

    |

    వసుధార, రిషి ప్రేమ కథ సీరియల్ గుప్పెడంత మనసు ఆసక్తికరంగా సాగుతోంది. రిషి ఇంకా ఇంటికి రాలేదని మహేంద్రా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపే గౌతమ్ అక్కడికి వచ్చి అంకుల్ రిషి కాల్ చేశాడా అని అడుగుతాడు. దీంతో మహేంద్ర లేదని చెప్పడంతో.. ఎందుకు అంకుల్ డల్ గా ఉన్నారని అని మహీంద్రని గౌతమ్ ప్రశ్నిస్తాడు. ఇంతలోపే రిషి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఆసక్తికరంగా సాగుతూ.. సెప్టెంబర్​ 21, 2022 బుధవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 561 ప్రోమోలో ఏం జరిగిందో చదివేసేయండి.

    కోపాన్ని పక్కన పెడతాను..

    కోపాన్ని పక్కన పెడతాను..

    ఇంట్లోకి రిషి ఎంట్రీ ఇవ్వడం చూసి నాపై కోపంగా ఉన్నాడు. పలకరించకుండానే వెళతాడేమో అనుకుంటాడు మహేంద్ర. ఇక ఇదిలా ఉంటే ఇవాళ్టీ ఎపిసోడ్ లో రిషి, వసుధార మధ్య డిస్కషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నా కోపం.. నా ప్రేమ ఒక్కసారి వస్తే పోయేవి కాదు.. మన ప్రేమ కోసం నా కోపాన్ని పక్కన పెడతాను. దానికి నువ్వు ఒక సాయం చేయాలి. ఇది మన ప్రేమ కోసం అంటూ వసుధారతో రిషి చెబుతాడు. అందుకు ఏం చేయాలి సార్ అని రిషిని తిరిగి అడుగుతుంది వసుధార. దీంతో వసుధారకు రిషి ఏదో చెబుతుండటం చూపించారు ప్రొమోలో.

    వసుధారకు కన్నీళ్లు..

    వసుధారకు కన్నీళ్లు..

    రిషి చెబుతుంటే వసుధార కళ్లలో నీళ్లు తిరిగి రిషి చేతిపై పడతాయి. మన ప్రేమ కోసం ఈ మాత్రం చేయలేవా అని వసు చేతిపై చేయి వేసి అడుగుతాడు రిషి. ఇంతకీ రిషి ఏం చెప్పాడో.. ఏం కోరాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ 20న జరిగిన 560 పూర్తి ఎపిసోడ్ లో వసుధార వెళ్లిపోయిప్పుడు పెరుగు పంచదార కలిపి ధరణి ఇవ్వడంపై దేవయాని ఫైర్ అవుతుంది. నువ్ ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా. పెరుగులో చక్కెర కలిపి ఇంటి కోడళ్లకి, ఇంటి ఆడపిల్లలకు ఇస్తారు. నువ్ వసుధారకి ఇచ్చావంటే నేను ఏం అనుకోవాలి అని అంటుంది.

    ఇది నా ఇల్లు..

    ఇది నా ఇల్లు..

    ఇంతలో అక్కడకి జగతి, ఆ తర్వాత మహీంద్ర వస్తారు. ఇది నా ఇల్లు.. నేను ఎవర్నీ రమ్మంటే వాళ్లు రావాలి.. ఎవరు ఉండాలనుకుంటే వాళ్లే ఉండాలి. తోటి కోడలు ఎలాగు నాకు విలువ ఇవ్వదు. నువ్ కూడా ఈ మధ్య విలువ ఇవ్వట్లేదు జాగ్రత్త అని వారిస్తుంది దేవయాని. ఆ తర్వాత దేవయాని వెళ్లిన తర్వాత అక్కయ్య గురించి తెలిసిందే కదా.. మనసుకు తీసుకోకు అని ధరణితో జగతి అంటుంది.

    నాలా నన్ను ఉండనీ..

    నాలా నన్ను ఉండనీ..

    మరోవైపు వసుధారను డ్రాప్ చేసిన వెళ్లిపోతున్న రిషితో సాయంత్రం రెస్టారెంట్ కు వస్తారు కదా సార్ అని అడుగుతుంది వసుధార. ఇప్పుడు విషయం ఇది కాదు వసుధార. నేను ఇంత సైలెంట్ గా ఉన్నా అంటే జరిగిన సంఘటనలు ఒప్పుకున్నట్లు కాదు. కొన్ని విషయాల్లో నన్ను ప్రభావితం చేయొద్దు.. నా ఆలోచనలు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించొద్దు. నన్ను నాలా ఉండనీ. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు అని అంటాడు. దీంతో జగతి మేడం విషయం గురించే కదా సార్.. అని మనసులో అనుకుంటుంది వసుధార.

    ఏదో ఒక రోజు అమ్మా అని పిలుస్తాడేమో..

    ఏదో ఒక రోజు అమ్మా అని పిలుస్తాడేమో..

    ఇక్కడ కట్ చేస్తే మరోవైపు ఇంట్లో రిషి రాలేదని మహేంద్రి టెన్షన్ పడుతుంటాడు. నీది స్వార్థమైన ప్రేమ అని రిషి అన్నా నీకు ఏమాత్రం కోపం రాలేదు అంటుంది జగతి. ఎందుకో తెలియదు. రిషి అంటే నాకు ప్రాణం. నా శరీరంలో ఒక భాగమైపోయాడు. వాడి మీద నాకు ఎందుకు కోపం వస్తుంది అని మహేంద్ర అనడంతో నీకెందుకు కోపం ఉంటుంది.

    మహేంద్ర నీ సొంత కొడుకు కదా అని జగతి అంటుంది. నీ కొడుకు కూడా జగతి. ఏమో ఏదో ఒక రోజు రిషి కూడా నిన్ను అమ్మా అని పిలిచే రోజు వస్తుందేమో అని అంటాడు మహేంద్ర. మరోవైపు రోడ్డు పక్కన కారు ఆపి రిషి.. గదిలో వసుధార ఒకే విషయంపై ఆలోచిస్తూ ఉంటారు.

    English summary
    Guppedantha Manasu Serial September 21 2022 Today Full Episode 561
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X