Guppedantha Manasu: వసుధారకు రిషి మూడు రోజుల గడువు.. బయట పడిన సాక్షి-దేవయాని కుట్ర!

వసుధారకు ప్రేమ మెలిక పెట్టిన తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ఓ వ్యక్తి వద్ద నుంచి ఒక పెన్ డ్రైవ్ తీసుకుంటాడు రిషి. ఆ తీసుకున్న పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేసి చూస్తాడు రిషి. అందులో సీసీ టీవీ ఫుటేజ్ ఉంటుంది. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోంది లవ్ స్టోరీ సీరియల్ గుప్పెడంత మనసు. సెప్టెంబర్​ 22, 2022 గురువారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 562 ప్రోమోలో ఏం జరిగిందో చదివేసేయండి.

ఎవరికీ తెలియకుండా తీసుకున్న పెన్ డ్రెవ్ లో కాలేజ్ లోని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తాడు రిషి. అందులో వసుధార ముఖానికి కర్చీఫ్ పెట్టి మత్తుమంది పెట్టి ఓ మహిళా కిడ్నాప్ చేయించడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలో సాక్షిని చూసి షాక్ అవుతాడు రిషి. తర్వాత ఇంత పెద్ద విషయాన్ని వసుధార తన దగ్గర దాచిందా అని అనుకుంటాడు రిషి. ఇక్కట సీన్ కట్ చేస్తే రిషి ఇంట్లో ఉంటుంది తర్వాతి సన్నివేశం.

నా దగ్గరికి వచ్చినప్పుడే..

వసుధారను చూడటానికి వెళ్లిన ధరణికి యాక్సిడెంట్ అవడం తెలిసిందే. రిషిని తీసుకుని ధరణి రూమ్ కు వెళుతుంది వసుధార. నా దగ్గరికి వచ్చినప్పుడే ఇలా జరిగింది సార్ అని రిషికి చెబుతూ బాధపడుతుంది వసుధార. దానికి.. నీ దగ్గరికి వచ్చిన ఎవ్వర్నీ ప్రశాంతగా ఉంచవా వసుధార అని అంటాడు రిషి. దీంతో ఏం మాట్లాడలేక బాధగా చూస్తుండిపోతుంది వసుధార. ఇంతవరకు జరిగిన సన్నివేశాలను ఇవాళ్టీ ప్రోమోలో చూపించారు.

 3 రోజుల గడువు..

3 రోజుల గడువు..

ఇక సెప్టెంబర్ 21న జరిగిన 561వ ఎపిసోడ్ లో కాలేజ్ క్లాస్ రూమ్ లో బోర్డు మీద యాంగ్రీ ప్రిన్స్ అని రాసి రిషి గురించి తనలో తానే మాట్లాడుకుంటుంది వసుధార. ఎలాగైన రిషికి ఇక్కడికి రావాలని బోర్డుపై సార్ రావాలి అని రాస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికీ రిషి వస్తాడు. వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చొని వచ్చాడు అని రిషి అనడంతో షాక్ అవుతుంది వసుధార. తర్వాత కొద్దిసేపు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. నా కోపం పక్కన పెడతాను మన ప్రేమ కోసం ఒక సహాయం చేస్తావా వసుధారా అని అడుగుతాడు రిషి. ఏంటీ సార్ అని అంటుంది వసుధార.

నచ్చిన సమాధానం..

నచ్చిన సమాధానం..

ఏం జరిగిన నాకు నీపై ప్రేమ తగ్గదు. కానీ నీ నుంచి నాకు ఒక సమాధానం కావాలి వసుధార. అది కూడా నాకు నచ్చిన సమాధానం కావాలి అని అంటాడు రిషి. దీంతో నచ్చిన సమాధానం అంటే జగతి మేడంను రిషి అమ్మ అని పిలిచే విషయమా అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ ప్రశ్న ఏంటో.. దానికి సమాధానం ఏంటో నీకు తెలుసు వసుధార అని రిషి అనడంతో షాక్ అవుతుంది వసు. ఆ తర్వాత నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను. నీ దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అంటాడు రిషి.

అది మాత్రం మరిచిపోకు..

అది మాత్రం మరిచిపోకు..

దీంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. ఆ కన్నీళ్లు రిషి చేతిపై పడతాయి. కొద్దిసేపు వసుధారను చూసిన రిషి ఈ మూడు రోజుల విషయాన్ని మాత్రం మర్చిపోకు వసుధార అని వెళ్లిపోతాడు. తర్వాత ఒక వ్యక్తి నుంచి పెన్ డ్రైవ్ తీసుకుని ఇంటికి వెళ్తాడు రిషి. ఇంట్లో కి ఎంటర్ అవుతున్న రిషిని చూసి తనతో మాట్లాడుతాడో.. లేదో అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర.

ఇంతలో మహేంద్ర వద్దకు వచ్చి సారీ చెబుతాడు రిషి. నా కోపం ఎంతోసేపు ఉండదు డాడ్ అని సారీ చెబుతూ ఉంటాడు రిషి. ఆ తర్వాత వసుని ఏమైనా అన్నావా అని గౌతమ్ అడగ్గా.. అప్పుడే జగతి వస్తుంది. జగతిని చూసిన రిషి.. నాకు దూరమైన వాళ్లు దగ్గర కాలేరు.. దగ్గరైన వాళ్లు దూరం కారు అని జగతి, వసుధారను ఉద్దేశించి చెప్పినట్లు ఉంటాయి రిషి మాటలు.

దేవయాని ఆగ్రహం..

దేవయాని ఆగ్రహం..

ఇక్కడ కట్ చేస్తే.. ఇంట్లో వదిలేసిన చీరను తీసుకెళ్లి వసుధారకు ఇస్తుంది ధరణి. కాసేపు మాట్లాడక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. కానీ అప్పుడే ధరణి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ధరణి కాలుకు దెబ్బ తగులుతుంది. రిషి ఇంట్లో ధరణి గదిలో ఆమెకు డాక్టర్ చేత చికిత్స చేయిస్తారు. ధరణిని వసుధార ఇంటికి తీసుకురావడం చూసి దేవయాని మండిపడుతుంది. తర్వాత వసుధారను, ధరణి కొన్ని మాటలు అంటుంది దేవయాని. ఇలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X