Guppedantha Manasu: వంటగదిలో రిషిధార ప్రేమాయణం.. రిషిని చూసి వసుధార షాక్

చాలా ఆసక్తికరంగా సాగిపోతుంది గుప్పెడంత మనసు సీరియల్. వసుధారను మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేయించింది సాక్షినే అని తెలుసుకున్నప్పటి నుంచి రిషి కోపంతో రగిలిపోతుంటాడు. ఇంతపెద్ద విషయాన్ని తన దగ్గర వసుధార దాచిందా అని అనుకుంటాడు. తర్వాత ఈ విషయాన్ని వసుధారను అడుగుదామనుకుని కాల్ చేస్తే కలవదు. తర్వాత రెస్టారెంట్ కాల్ చేసి అడుగుతాడు. అక్కడ వసుధార లేదని చెప్పడంతో తన ఇంటికి వెళ్తాడు రిషి. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోంది లవ్ స్టోరీ సీరియల్ గుప్పెడంత మనసు. సెప్టెంబర్​ 23, 2022 శుక్రవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 563 ప్రోమోలో ఏం జరిగిందో చదివేసేయండి.

సాక్షిపై కోపంగా రిషి..

సాక్షిపై కోపంగా రిషి..


సాక్షి విషయం వసుధారను అడుగుదామనుకున్న రిషి మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గుతాడు. తర్వాత తన వసుధార తన ఇంట్లోనే ఉందని తెలుసుకున్న రిషి ఇంటికి వెళతాడు. ఆతర్వాత దేవయాని రూమ్ కి వెళ్లి పెద్దమ్మా లోపలకు రావొచ్చా అని అడుగుతాడు. సీసీ ఫుటేజ్ వీడియో గుర్తు చేసుకుని.. సాక్షి గురించి తలుచుకుంటే మండిపోతుందంటాడు రిషి. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అని అనుకున్న దేవయాని.. సాక్షి మాటెత్తగానే షాక్ అవుతుంది. దీనికి కొనసాగింపుగా శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది.

రిషిని చూసి వసుధార షాక్..

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో వంటగదిలో హడావిడిగా వంట చేస్తుంటుంది వసుధార. తన వెనుకగా వచ్చిన వ్యక్తి జగతి మేడం అనుకుని.. ఏంటీ మేడం.. మీరు కొంచెం కూరలు తరగండి అంటుంది. ఈ మాట విన్న రిషి ఏం మాట్లాడకుండా కూరగాయలు కట్ చేసేందుకు సిద్ధమవుతాడు. వసుధార మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంటుంది. రిషి సార్ కూడా మీలాగే మేడం.. ఆల్ రౌండర్. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. నాలాంటి వ్యక్తి దొరకడం రిషి సార్ అదృష్టం కదా మేడం అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడున్న రిషిని చూసి వసుధార షాక్ కావడంతో ఈ ప్రొమో ముగుస్తుంది.

వసుధారపై రిషి కోపం..

వసుధారపై రిషి కోపం..

ఇక గురువారం అంటే సెప్టెంబర్ 22న జరిగిన ఎపిసోడ్ లో రిషి పెన్ డ్రైవ్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ చూస్తాడు. వసుధారను పరీక్షలు రాయకుండా చేసేందుకు సాక్షి దగ్గరుండి కిడ్నాప్ చేయించిందని అర్థం చేసుకున్న రిషి షాక్ అవుతాడు. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావ్ వసుధార అంటూ కోపానికి వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ధరణికి సేవలు చేస్తున్న వసుధార ఇదంతా తనవల్లే జరిగిందని బాధపడుతుంది. అలా ఏం కాదని ధరణి సర్ది చెబుతుంది. హాల్లో సోఫాలో జగతి, మహేంద్ర, దేవయాని కూర్చుని ఉంటారు. ధరణికి సేవలు చేసేందుకు ఎవరున్నారని దేవయాని అనడంతో నర్స్ ను రమ్మని చెబుతా అని మహేంద్ర అంటాడు.

 వాడిపోయిన దేవయాని మొహం..

వాడిపోయిన దేవయాని మొహం..

నేను చూసుకుంటాను కదా అని జగతి అంటుంది. ఉదయాన్నే బ్యాగ్ తగిలించుకుని కాలేజ్ కు వెళతావు, నువ్వెక్కడ చూసుకుంటావ్ అని అంటుంది. అయినా వసు ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది. తనని ఇంటికి పంపించేయండి అని దేవయాని అనగానే.. సరే వదినగారు ఓ మాట రిషితో చెప్పి పంపించేస్తానని చెబుతాడు మహేంద్ర. ఇక్కడ కొద్దిసేపు డిస్కషన్ తర్వాత ఇంటికి వస్తాడు రిషి. అది చూసిన దేవయాని వసుధార ఇంకా ఇక్కడే ఉందని రిషికి చెబుతుంది. దీంతో ఉండని.. ధరణిని బాగా చూసుకుంటుంది అని దేవయానితో అంటాడు రిషి. దీంతో దేవయాని మొహం వాడిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X