twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: పట్టుబట్టిన వసధార.. ఇంట్లోంచి వెళ్తున్న జగతి.. మంచి నిర్ణయమన్న రిషి

    |

    రిషి గదికి వచ్చిన జగతి ప్రేమ బంధం గురించి చెబుతుంది. వసుధారను పోగొట్టుకోవద్దు రిషి అని జగతి అన్న మాటలకు.. అది వసుధార చేతిలోనే ఉంది మేడమ్ అంటాడు రిషి. అది నీకు చాలా ముఖ్యమైన బంధం కదా రిషి అని బాధగా జగతి అంటే బంధం అంటేనే ఇద్దరి మధ్య ఉండేది కదా మేడమ్.. అటువైపు నుంచి కూడా సమానమైన బాధ్యత ఉండాలి కదా మేడమ్.. తన (వసుధార) కోసం నేను వెనుకడుగు వేయలేను మేడమ్.. తనే ముందు అడుగు వేయాలి, నిర్ణయం తనదే కదా అని రిషి అంటాడు. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ సెప్టెంబర్​ 27, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 566లో ఏం జరిగిందో చదివేసేయండి.

    వసుధారను నిలదీసి జగతి..

    వసుధారను నిలదీసి జగతి..

    రిషి అన్న మాటలతో ఇక చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది జగతి. వసుధార నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకుంటాడు రిషి. ఇక వెంటనే వసుధార గదికి వెళ్తుంది జగతి. అప్పటికి వసుధార నిద్రలో ఉంటడంతో తలుపు కొట్టినా లేవదు. దీంతో వసుధారకు జగతికి కాల్ చేస్తుంది లేచిన వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి తలుపు డోర్ తీస్తుంది.

    మేడమ్ మీరేంటి ఇలా అని వసుధార కంగారు పడుతుంటే లోపలికి పదా వసు అంటుంది జగతి. ఇద్దరూ లోపలికి వెళ్తారు. రిషికి నీకు మధ్య ఏం గొడవ జరిగింది అంటూ వసుధారను నిలదీస్తుంది. వసుధార మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. వెంటనే వసుధార చేయి పట్టుకున్న జగతి.. నా దగ్గర కూడా దాస్తున్నావా అంటూ గట్టిగా అరుస్తుంది.

    షాక్ అయిన జగతి..

    షాక్ అయిన జగతి..

    నేనేం దాస్తున్నాను మేడమ్.. అంటూ తడబడుతుంది వసుధార. నేను రిషితో మాట్లాడాను. ఏదో తుది నిర్ణయం నీదే అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏమైందో చెప్పు వసు. అని కోపంగా అడుగుతుంది జగతి. మేడమ్.. గురు దక్షిణ విషయాన్ని రిషి సార్ మరిచిపోమంటున్నారు అంటూ మూడు రోజుల గడువు గురించి చెబుతుంది వసుధార.

    దీంతో జగతి షాక్ అవుతుంది. ఏమైంది నీకు.. తెలివైన దానివే కదా.. ఈ గురు దక్షిణ విషయాన్ని అప్పుడే మరిచిపోవాలి కదా.. రిషి అడిగే దాకా గడువు ఇచ్చే దాకా ఎందుకు తెచ్చుకున్నావ్.. నా మాట విని రిషి మాటే విను. గొడవ పెద్దది చేసుకోవద్దు. గురు దక్షిణ లేదు ఏం లేదు. రిషి నన్ను అమ్మా అని పిలవకున్నా నాకేం పర్వాలేదు. నువ్ రిషి చెప్పినట్లే విను అని ఆవేదనగా అంటుంది జగతి.

    పంతాలతో జీవితం పాడుచేసుకోకు..

    పంతాలతో జీవితం పాడుచేసుకోకు..

    నేను వినను మేడమ్.. అని సమాధానం ఇచ్చిన వసుధారతో ఏంటి వసు ఇది. పంతాలకు వెళ్లకు. నా కోసం నీ జీవితం పాడుచేసుకోకు. రిషిని వదులుకోకు అని జగతి అంటుంది. నేను అస్సలు వెనక్కి తగ్గను మేడమ్.. అని వసుధార అంటే.. ఎందుకు ఒప్పుకోవు.. రిషిని పోగొట్టుకుంటావా అని కోపంగా అంటుంది జగతి. ఆయనే నా ప్రాణం.

    నేనేందుకు ఆయన్ని పోగొట్టుకుంటాను.. మేడమ్ ఇది మెండికేయడం కాదు. నేను ఒకదాన్ని నమ్మాను. అదే అభిప్రాయం మీద స్ట్రాంగ్ గా నిలుచున్నాను అని వసుధార అంటే.. అయ్యో వసు.. నీకు అర్థం కావట్లేదు. ఇదంతా మొదలు పెట్టిన మహేంద్రను అనాలి అని కోపంగా జగతి అంటుంది. అయినా ఏ మాత్రం తగ్గదు వసుధార. అదే పట్టుదలతో నమ్మకంతో ఉంటుంది.

    రిషి సార్ మారాలి..

    రిషి సార్ మారాలి..

    ఎవరినీ ఏం అననవసరం లేదు మేడమ్.. రిషి సార్ మారాలి. ఆయన ఆలోచనలు మారాలి. మిమ్మల్ని అమ్మా అని పిలవాలి అంటూ జగతి భుజంపై చేయి వేస్తూ ప్రేమగా అంటుంది వసుధార. నాకు అవసరం లేదు అని కోపంగా జగతి అంటే.. నాకు అవసరం మేడమ్.. నాకు అవసరం. రిషి సార్ లో మార్పు నాకు అవసరం.

    ఎలాంటి మచ్చలేని రిషి సార్ ని నేను చూడాలి. నా రిషి సార్ కన్న తల్లిని అమ్మా అని పిలవలేని కఠినమైన మనసు ఉన్నవాడా మేడమ్. నాకు ఇష్టం లేదు. తను మారాలి. నేను మార్చుకుంటాను అని అంటుంది వసుధార. జరగని వాటి కోసం ఆశపడొద్దు వసుధార అని జగతి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జగతి. అయినా వినదు వసుధార.

    డాడ్ ను వదిలి వెళ్లిపోతున్నారా..

    డాడ్ ను వదిలి వెళ్లిపోతున్నారా..

    తర్వాత బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోతుంది జగతి. అది చూసిన రిషి.. ఏంటి మేడమ్ ఈ ఇల్లు వదిలి పెట్టి వెళ్తున్నారా.. గుడ్ మేడం, గుడ్ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇల్లు, డాడ్ ను వదిలి వెళ్లిపోతున్నారా.. అప్పుడు నా చిన్నప్పుడు ఎందుకు వెళ్లారో ఎప్పుడూ అడగలేదు అడగను కూడా. కానీ ఇప్పుడు వెళ్తోంది మాత్రం నా కారణంగా అంటున్నారు. ఇదేంటి మేడమ్ మీరు వస్తానని అనలేదు. నేను రమ్మన్నాను. మా డాడ్ సంతోషాన్ని కళ్లారా చూశాను. ఇప్పుడు నా ఆనందాన్ని భరించలేక పోతున్నారా అని అంటే రిషి.. అలా మాట్లాడకు ప్లీజ్ అని జగతి అంటుంది.

    మీకు మా డాడ్ అసరం లేదు..

    మీకు మా డాడ్ అసరం లేదు..

    మీరు ఇలా వెళుతుంటే నేను ఇలాగే మాట్లాడతాను మేడమ్.. డాడ్ ఆనందం, సంతోషం మీకు అవసరం లేదా.. తనని వదిలేసి వెళ్లిపోతారా ఏంటీ మేడం మీరు. ఏం ఆలోచిస్తున్నారు. మీరు వెళ్లిపోతే వసుధార నా జీవితంలోకి వస్తుందని మీరేలా అనుకుంటున్నారు. ఆ వసుధారకు పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు పొగరు కూడా ఎక్కువే. మీకు మా డాడ్ అసరం లేదు వసుధారకు నేను అవసరం లేదు.

    మీ పంతాలు, పట్టింపులే కావాలి. వెళ్లండి మేడమ్ వెళ్లండి. బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, ప్రేమలు ఇవన్నీ బాగా వివరిస్తారు కదా మీరిద్దరూ. మరి మీరిలా వెళ్లడం ఏంటీ. మీరు వెళ్లానుకుంటే డాడ్ తో కలిసి వెళ్లండి. మీ ఇద్దర్నీ విడదీసిన పాపం నాకెందుకు మేడం. తల్లి లేకుండా బతికినవాడిని తండ్రిని దూరం చేసుకుని బతకడం కూడా అలవాటు చేసుకుంటాను వెళ్లండి అని అంటాడు.

    English summary
    Guppedantha Manasu Serial September 27 2022 Today Full Episode 566
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X