twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దేవయాని దొంగ ఏడుపు.. రిషిధార ప్రేమయుద్ధం.. మహేంద్ర, జగతి షాక్

    |

    జగతి ఇంటి నుంచి వెళ్లిపోవడం చూసి తన దైన మాట తీరుతో ఆపే ప్రయత్నం చేస్తాడు రిషి. ఇంతలో వచ్చిన దేవయాని ఈ అవకాశం వదులుకోవద్దు అనుకొని రిషి నువ్ ఇక్కడే ఆగు అంటుంది. గుమ్మం దగ్గర బ్యాగ్ తో ఉన్న జగతిని.. ఏంటీ జగతి నాటకాలు.. అని దేవయాని అంటే నాటకాలేంటి అక్కయ్యా అని సమాధానం ఇస్తుంది జగతి. అది విన్న మహేంద్ర కోపంగా వదినగారు దయచేసి ఈ విషయంలో మీరు కలుగజేసుకోకండి అంటాడు. దీంతో ఏడుపు స్టార్ట్ చేస్తుంది దేవయాని. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ సెప్టెంబర్​ 28, 2022 బుధవారం నాటి తాజా ఎపిసోడ్​ 567లో ఏం జరిగిందో చదివేసేయండి.

    దేవయాని దొంగ ఏడుపు..

    దేవయాని దొంగ ఏడుపు..

    దేవయాని దొంగ ఏడుపు ఏస్తూ మహేంద్ర ఎంత మాట అన్నావ్.. జగతి నీ భార్య, రిషి మీ కొడుకు మీరంతా ఒక కుటుంబం. నేను పరాయి దాన్ని అనే కదా నీ ఉద్దేశం అంటూ చీరకొంగు అడ్డం పెట్టుకుంటుంది. రిషి షాక్ అవుతాడు. దేవయాని దగ్గరకు వెళ్లి.. పెద్దమ్మా ఏంటీ మీరు అంటూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తాడు. పెద్దమ్మ మీరు ఏడవకండి అంటూనే డాడ్ మీరు అన్నమాట నాకు నచ్చలేదు అని అరుస్తాడు. అక్కడి నుంచి దేవయానిని తీసుకువెళతాడు. అప్పుడు వెనక్కి తిరిగి మహేంద్రను చూసి వెకిలిగా నవ్వుతుంది దేవయాని. ఇది చూసి షాక్ అవుతారు మహేంద్ర, జగతి. దీంతో జగతిని గుండెలకు హత్తుకుని బాధపడతాడు మహేంద్ర.

    వసును నిలదీసిన రిషి..

    వసును నిలదీసిన రిషి..


    ఆ తర్వాత వసుధార కోసం రిషి బయలుదేరతాడు. ఓ అమ్మవారి గుడిలో ఉంటుంది వసుధార. నా కోరిక సరైనదే కదమ్మా.. జగతి మేడమ్ ని రిషి సార్ అమ్మా అని పిలవలాని కోరుకోవడం తప్పా అని అంటుంటే.. తప్పే.. ముమ్మాటికీ తప్పే అంటాడు అప్పుడే వచ్చిన రిషి. తన దగ్గరికి జగతి వెళ్లిన విషయం అడిగుతూ వసుధారను నిలదీస్తాడు రిషి. ఏంటీ సార్ మీరు.. జగతి మేడమ్ ఎప్పుడూ మీ సౌకర్యం కోసమే ఆలోచిస్తారు తెలుసా. అసలు మేడమ్ ఏమన్నారో తెలుసా సార్. రిషి నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు. నా ఆశని చంపుకుంటాను కానీ. నా వల్ల మీ ఇద్దరూ దూరం కావొద్దు అన్నారు సార్. ఓ కన్న తల్లి గండెల నిండా దుఃఖాన్ని మోసుకుంటూ కళ్లల్లో కన్నీళ్లు దాచుకుని నాకోసం ఆలోచించొద్దు అన్నారు సార్. రిషి ఏం చెబితే అది విను అన్నారు. ఎంత గొప్ప మనసు సార్ మేడమ్ ది అని చెబుతుంది వసుధార.

    చెడ్డ లక్షణం ఉండకూడదు..

    చెడ్డ లక్షణం ఉండకూడదు..

    తనకు అక్కర్లేని పిలుపు నీకెందుకు.. అమ్మా.. అన్న పిలుపు వద్దన్న మీ మేడమ్ కు థ్యాంక్స్ చెప్పు. అయినా తనకు లేని ఆరాటం పంతం నీకెందుకు చెప్పు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ వసుధార. అమ్మవార సమక్షంలో ఉన్నాం. ఈ విషయం వదిలేద్దాం అంటాడు రిషి. సార్ ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మీరు కన్న తల్లిని అమ్మా అని పిలవలేని చెడ్డ లక్షణం మీకు ఉండకూడదు సార్ అని అరుస్తుంది వసుధార. ఆపుతావా అంటూ పైనున్న గంటను గట్టిగా కొట్టడంతో రిషి చేయి కట్ అవుతుంది. వెంటనే రిషి చేయి పట్టుకుని చూసి రక్తం వస్తోంది సార్ అంటూ ఏడుస్తుంది. ఇది చూసి చేయి వెనక్కి లాక్కున్న రిషి.. గాయం అయితే రక్తమే వస్తుంది వసుధారా.. రక్తమే కనిపిస్తుంది. కానీ, నా మనసుకు అయిన గాయం నా నొప్పి ఎవరికి తెలుస్తుంది. అది నాకు మాత్రమే తెలుస్తుంది అంటాడు.

    నాకు అభయహస్తం సార్..

    నాకు అభయహస్తం సార్..

    కట్టుకట్టనివ్వండి అని వసుధార అడిగితే చేతికి మాత్రమే కట్టుగట్టగలవు. కానీ నా మనసుకైనా గాయానికి ఎవరు కట్టుకడతారు చెప్పు అని అక్కడినుంచి వెళ్లిపోతాడు రిషి. ఆతర్వాత ఓ బస్ స్టాప్ వద్ద వసుధారను బలవంతంగా కారు నుంచి దిగి వెళ్లమంటాడు రిషి. చేసేది లేక కారు దిగుతుంది వసుధార. అనంతరం కాలేజ్ గెస్ట హౌజ్ కు వెళ్లి సోఫాలో పడుకుంటాడు రిషి. కాసేపటకి ఆ సోఫా కిందే కూర్చోని చేతికి ఉన్న కర్చీఫ్ తీసేసి కట్టుకడుతుంది వసుధార. రిషికి మెలకువ వస్తుంది. ఏంటిది అంటూ చేయి వదిలించుకుంటే ఈ చేయి వదలనని ఎప్పుడో చెప్పాను కదా సార్. ఈ చేయి నాకు అభయహస్తం సార్.. నాకు ధైర్యం. నన్ను నడిపించే నమ్మకం. ఇది పేరుకే మీ చేయి పేరుకు మాత్రమే సార్.. మీకు గాయం అయితే నా మనసు విలవిల్లాడుతుంది అంటూ కట్టుకడుతుంది వసుధార.

    లోక కల్యాణం కోసం అంటావ్..

    లోక కల్యాణం కోసం అంటావ్..

    ఇంత ప్రేమ ఉంటే నాతో ఈ గొడవలు ఎందుకు. అన్ని మాటలెందుకు. ఇంత పంతాలెందుకు. ప్రేమిస్తే వెంటనడవాలి. ఎదురు తిరక్కూడదు. అని రిషి అంటే.. సార్ మీరేం చెబితే అలానే నేను నడిస్తే దాన్ని ప్రేమ అనరు. పొరపాట్లను సరిచేయగలడమే ప్రేమంటే.. మీకు ప్రేమ తెలుసు. కానీ క్షమించడం తెలుసుకోవాలి. క్షమించడం గొప్ప లక్షణం సార్ అని వసుధార అంటుంది. చాలు.. నాకు క్షమించడం నేర్పిస్తున్నావా.. నువ్ చేసే పొరపాట్లకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దు. అంతే కదా..నువ్వేం చెప్పవు. అన్నీ దాస్తావ్. ఏంటని అడిగితే లోక కల్యాణం కోసం అంటావ్. అంతే కదా.. నన్ను నా ఆలోచనల్ని మార్చాలనే ప్రయత్నం చేయకు. వెళ్లిపో అంటాడు రిషి. మీరు ఇక్కడి నుంచి వెళ్తేనే వెళ్తాను అంటుంది వసుధార. నా మనసేం బాలేదు అన్న రిషితో మీకేనా మనసుంది.. నాకు కూడా ఉంది కదా అంటుంది వసుధార. నాతో నీకేంటీ అని రిషి అంటే.. మీరు నేను ఒకటే కదా సార్ అంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial September 28 2022 Today Full Episode 567
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X