Guppedantha Manasu: రిషికి అన్నం తినిపించిన వసుధార.. ఆపరేషన్ రిషిధారకు వ్యూహం!

కాలేజ్ గెస్ట్ హౌజ్ లో ఉన్న రిషి చేతికి వసుధార కట్టుకడుతుంది. నా మనసేం బాలేదు.. నేను తర్వాత వస్తా నువ్ వెళ్లు అని వసుధారతో రిషి అంటాడు. మీకేనా మనసుంది.. నాకు కూడా ఉంది కదా అంటుంది వసుధార. నాతో నీకేంటీ అని రిషి అంటే.. మీరు నేను ఒకటే కదా సార్ అంటుంది వసుధార. ఆ తర్వాత మీరు వెళితేనే నేను వెళ్తా అని మొండిపట్టు పడుతుంది వసుధార. ఏంటీ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని రిషి అనడంతో బ్లాక్ మెయిల్ కాదు.. ఓ మనసు కోసం మరో మనసు పడే తపన ఇది అని వసుధార సమాధానం ఇస్తుంది. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ సెప్టెంబర్​ 29, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 568లో ఏం జరిగిందో చదివేసేయండి.

మీ వెంటే నేనుంటాను..

మీ వెంటే నేనుంటాను..


నువ్వు ఇలా తయారయ్యావేంటీ.. నాకు కోపం తెప్పిస్తున్నావ్.. అని రిషి అంటే.. మీకు కోపం వచ్చినా మీ వెంటే నేనుంటాను అని వసుధార చెబుతుంది. దీంతో నీతో వాదించలేను.. క్యాబ్ వచ్చింది వెళ్లు అని రిషి అంటే.. ఎంత కోపం ఉన్నా.. కేరింగ్ మాత్రం తగ్గదు.. మీరు జెంటిల్ మెన్ సార్.. అని క్యాబ్ లో వెళ్తుంది. వసుధార క్యాబ్ లో వెళ్లగానే రిషి ఇంటికెళతాడు. మహేంద్ర, జగతి ఇద్దరూ రిషి కోసం టెన్షన్ పడుతుంటారు. రిషి కోపంగా బయటకు వెళ్లాడని జగతి అంటే రిషి మూడ్ ఎప్పుడు శాంతంగా ఉందని మహేంద్ర అంటాడు. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. ఏంటీ ఆలుమగలు ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు.. ఏం ఆలోచిస్తున్నారేంటీ అని అంటుంది దేవయాని.

ఫోన్ తీస్తాడు కదా..

ఫోన్ తీస్తాడు కదా..

రిషి మూడ్ ఆఫ్ లో బయటకు వెళ్లాడు.. మహేంద్ర కాల్ చేస్తే ఎత్తట్లేదు.. మీరొకసారి ఫోన్ చేయండి అక్కయ్యా.. మీ ఫోన్ తీస్తాడు కదా అని జగతి అంటుంది. నీ స్వభావానికి విరుద్ధంగా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావ్.. నన్ను అడగకూడదు కదా నువ్.. మెట్టు దిగి అడిగావే అనుకో నేను చేస్తాను అనుకుంటున్నావా.. అని దేవయాని అంటుంది. నువ్వు నేను కాల్ చేస్తే రిషి తీయకపోవచ్చు..కానీ అక్కయ్యా కాల్ చేస్తే తీయొచ్చు కదా .. అని మహేంద్రతో జగతి అంటుంది. ఇప్పుడిదే అవసరం ఉందని ఫోన్ చేయమంటున్నావ్.. తప్పు జగతి.. నువ్వు అడగకూడదు.. అడిగినా చేయకూడదు.. కాల్ చేసి ఏమని అడగాలి.. నువ్వు అమ్మా అని పిలవని అమ్మ కంగారుపడుతోంది ఎక్కడున్నావ్ అని అడగలేను కదా.. అని అంటుండగా ఇంతలో అక్కడికి వచ్చిన ధరణి.. నేను కాల్ చేస్తాను లిఫ్ట్ చేస్తాడని అంటుంది.

నన్ను డిస్టర్బ్ చేయొద్దు..

నన్ను డిస్టర్బ్ చేయొద్దు..

దీంతో దేవయాని కోప్పడుతుంది. కోపంగా లోపలికి పో.. అని అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. ఇంతలో రిషి రానే వస్తాడు. రిషి రాగానే.. విసిగించకు గౌతమ్.. ఎన్నో పనులుంటాయి.. ఎన్నో టెన్షన్లు ఉంటాయని చెప్పి.. డ్రామా స్టార్ట్ చేస్తుంది. దీంతో ఎవ్వరూ సీన్ చేయకండి.. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. తర్వాత రిషి ఏం చెప్పాడో అర్థమైంది కదా అంటుంది దేవయాని. గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంట్లోకి కంగారుగా వస్తుంది వసుధార. వసుధారని చూసిన దేవయాని ఇదేంటి ఏకంగా ఇంటికొచ్చి సరాసరి రిషి గదికే వెళ్తోంది అనుకుంటూ వెనుకే ఫాలో అవుతుంది. ఎదురుగా నిల్చున్న వసుధారని చూసి అంతా భ్రమే అనుకుంటాడు రిషి. భోజనం చేశారా అని అడుగుతుంది వసుధార. నువ్ నిజంగా వచ్చావా అని అంటాడు రిషి.

 దేవయాని దొంగప్రేమ..

దేవయాని దొంగప్రేమ..


మరోవైపు జగతి-ధరణి కలిసి రిషికి భోజనం తీసుకెళ్తుండగా దేవయాని పిలుస్తుంది. లోపలకు పదండి మీ ఒళ్లు పులకరించి పోతుందని చెప్పి అందరూ రండి అని పిలుస్తుంది.. ధరణి చేతిలో భోజనం ప్లేట్ లాక్కుంటుంది దేవయాని. లోపలికి వెళ్లిన తర్వాత ఏదైనా పనిమీద వచ్చావా వసుధార అని దేవయాని అంటే.. లేదు మేడం.. రిషి సార్ కోసమే వచ్చాను.. అని సమాధానం చెబుతుంది వసుధార. రిషిని భోజనం చేయమని అందరూ బతిమిలాడతారు. దేవయాని దొంగప్రేమ నటిస్తుంది. నిజంగానే తినాలనిపించడంలేదని రిషి అంటే.. ఎలా తినరో అని ప్లేట్ తీసుకుంటుంది వసుధార. ఏంటీ సార్ గాయం ఎలా అయింది.. తినండి సార్ అంటుంది. ఏంటీ వసుధార ఇంత దూకుడుగా ఉంది.. ఇప్పుడు తినకపోతే.. తినడమే మంచిది అని తింటాడు. దీంతో అంతా సంతోషిస్తే.. దేవయాని మాత్రం రగిలిపోతుంది.

ఇద్దరి పంతం ఇలాగే కొనసాగితే..

ఇద్దరి పంతం ఇలాగే కొనసాగితే..

వాళ్లంతా వెళ్లాక పక్కన కూర్చొని రిషికి అన్నం తినిపిస్తుంది వసుధార. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటారు వీరిద్దరు. మరోవైపు జగతి, మహేంద్ర, గౌతమ్ ముగ్గురు వీళ్లిద్దరి గురించి డిస్కషన్ పెడతారు. ఇద్దరూ వదులుకోలేరు. ఇద్దరూ తగ్గడం లేదు. ఏం చేద్దాం అనుకుంటారు.. ఈ ఇద్దరి పంతం ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేజారిపోతాయేమో అని జగతి భయపడుతుంది. ఆ మాటకి ఇద్దరూ దూరంగా ఉండటం కరెక్ట్ కాదు.. ఇద్దర్నీ ఒకే దగ్గర ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తాడు మహేంద్ర. ఇద్దరూ కలిసి ఉండే అవకాశం కాలేజ్ లో ఉంది కానీ పరీక్షలు అయిపోయాయి కదా.. వసుధారకు వచ్చే అవకాశం లేదంటుంది జగతి. దీంతో మిషన్ ఎడ్యుకేషన్ పేరుతో ఇద్దర్నీ ఒకే చోట చేర్చేందుకు వ్యూహం రచిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X