Guppedantha Manasu: బెడసి కొట్టిన దేవయాని ప్లాన్​.. సాక్షిపై సీరియస్​.. రిషిధారకు పెళ్లి ఫిక్స్​!

వసుధార చాలా నీరసంగా ఎగ్జామ్​ హాల్​కు వచ్చి పరీక్ష రాస్తూ ఉంటుంది. ఇది చూసి ఎస్​ దటీజ్​ వసుధార అని అనుకుంటాడు రిషి. మహీంద్రా కూడా వచ్చి వసుధార ఎగ్జామ్​ రాయగలదు. నువ్వేం టెన్షన్​ పడకు. నువ్వు వెళ్లి రెస్ట్​ తీసుకో అంటాడు. వసుధార పరీక్ష రాయడంతో అందరూ రిలాక్స్​ అవుతారు. ఇక్కడ సీన్​ కట్​ చేస్తే తర్వాత సీన్​ కాఫీ షాపులో ఉంటుంది. అసలు వసుధారకు ఏమైంది? ఎందుకు పరీక్షకు లేట్​గా వచ్చింది? అని జగతిని మహీంద్రా అడుగుతాడు.

దానికి ఏమైందో తెలియదు అని జగతి సమాధానం ఇస్తుంది. వసుధార వెనుక ఏదో జరుగుతోందని నాకు అనుమానంగా ఉంది జగతి అని మహీంద్రా చెబుతాడు. దీంతో నాకు కూడా అని అంటుంది జగతి. ఇలా వసుధారకు ఏమై ఉంటుందా అనే అనుమానంతో ప్రారంభమైన ఇవాళ్టి అంటే సెప్టెంబర్​ 3, 2022 శనివారం నాటి 'గుప్పెడంత మనసు' సీరియల్​ తాజా ఎపిసోడ్​ 546లో ఏం జరిగిందో చదివేసేయండి.

సమస్య ఉందా?

సమస్య ఉందా?

అక్కయ్య గారు కూడా గతంలా ప్రవర్తించడం లేదు అంటుంది జగతి. మొత్తానికి ఏదో జరుగుతోందన్న విషయం నాకు అర్థం అవుతోంది అని మహీంద్రాతో జగతి అంటుంది. అలాగే రిషిని అంతగా కావాలనుకున్న సాక్షి.. రిషిని మరిచిపోతుందని నాకు అనిపించడం లేదు అని అంటుంది జగతి. సాక్షి వైపు నుంచి రిషికి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? అంటాడు మహీంద్రా. దీనికి అవును అని సమాధానం ఇస్తుంది జగతి. ఏది ఏమైనా రిషి, వసుధార విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి పెళ్లి త్వరగా చేసేద్దాం అని చెబుతాడు మహీంద్రా. దూకుడుగా ముందుకు అడుగు వేయకపోతే కుదిరేలా లేదు అని మహీంద్రా అంటాడు. వాళ్ల పెళ్లికి బాగా తొందరపడుతున్నట్లు ఉన్నారు అని జగతి అంటుంది.

పెళ్లి చేసేద్దాం!

పెళ్లి చేసేద్దాం!

ఇంతలో అక్కడికి గౌతమ్​ వచ్చి.. అంకుల్ నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. త్వరగా రిషి, వసుధార పెళ్లి చేసేద్దాం అంటాడు. దీంతో మహీంద్రా, జగతి షాక్​ అయి.. మేము కూడా ఇదే ఆలోచిస్తున్నాం అని అంటారు. మొత్తంగా వాళ్లంతా కలిసి వసుధార తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేద్దామని ఫిక్స్​ అవుతారు. ఎగ్జామ్స్​ అయిపోయాయి, రిషిగాడు ఎక్కడున్నాడో తెలియదు? వసుధార రెస్టారెంట్​కు రాలేదు.. దీని అర్థం ఏంటీ అని అడుగుతాడు గౌతమ్. దీంతో బాబు గౌతమ్​.. నాకు మాత్రం ఏం తెలుసు. పక్షులు విహారం చేస్తున్నట్లున్నాయి అని అంటాడు మహీంద్రా.

ఆట ఆడుకుంటున్నావేంటీ?

ఆట ఆడుకుంటున్నావేంటీ?

ఎగ్జామ్స్​ అయిపోవడంతో చాలా సంతోషంగా ఉంటుంది వసుధార. ఇంతలో వసుధార దగ్గరికి రిషి వస్తాడు. దీంతో రిషి చేతులు పట్టుకుని గిరగిరా తిరుగుతూ ఉంటుంది. వసుధార ఆగు అంటాడు రిషి. ఎగ్జామ్స్​ అయిపోవడంతో ఒప్పుల కుప్ప వయ్యారి బావ ఆట ఆడుతున్నాం సార్ అంటుంది వసుధార. అలాగే సార్​.. మీరేంటి ఇలా సడెన్​గా వచ్చారు అని అంటుంది. అసలేంటీ నువ్వు. ఏం జరిగిందో నీకు ఏమైందో అని టెన్షన్ పడుతుంటే కుప్పల కుప్ప ఆట ఆడుకుంటున్నావా? అని రిషి అంటాడు. ఎగ్జామ్స్​ బాగానే రాశాను కదా సార్ అంటుంది వసుధార. అసలు నువ్వు ఆ స్టోర్ రూమ్​లో ఎలా పడిపోయావు? అంత మత్తులో ఎందుకు ఉన్నావు? అసలు వచ్చిందెవరు? వంటి ప్రశ్నలు అడుగుతాడు రిషి.

సాక్షిపై దేవయాని సీరియస్​..

సాక్షిపై దేవయాని సీరియస్​..

ఇది సాక్షి పని అయి ఉంటుందని రిషికి చెబితే ఇంకేమైనా ఉందా? రిషి సార్​కు ఈ విషయం చెప్పను. నేనే సాక్షి సంగతి చూసుకుంటాను అని మనసులో అనుకొని వాళ్లేవరో నాకు తెలియదు అని రిషికి చెబుతుంది వసుధార. కట్​ చేస్తే తమ ప్లాన్​ ఫెయిల్​ అయిందని టెన్షన్​ పడుతుంది దేవయాని. ఇంతలో దేవయానికి సాక్షి ఫోన్​ చేస్తుంది. నేను చేయాల్సిదంతా చేశాను. ఎలా కనిపెట్టారో తెలియదు అని సాక్షి చెబుతుంది. వసుధారను ఎక్కడో దాచిపెట్టమంటే అక్కడే కాలేజ్​ ల్యాబ్​లో పడేస్తే ఏం లాభం అంటుంది దేవయాని. పనులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే పర్​ఫెక్ట్​గా చేస్తారు. నీలో ఆ పర్​ఫెక్షన్ లేదు. నీకు తెలివితేటలు ఉంటే.. నువ్వు కరెక్ట్​గా ఉంటే ఎంగేజ్​మెంట్​ అయ్యాక రిషి నిన్నుు ఎందుకు వదులుకుంటాడు. రెండోసారి నువ్వు రిషిని వదులుకున్నావు. నీ తెలివితేటలు ఇలా తగలబడ్డాయి మరి. ఎగ్జామ్స్​ అయిపోయాయిగా, వాళ్లిద్దరూ ఎంజాయ్​ చేస్తూ ఉంటారు అని సాక్షిపై దేవయాని చాలా సీరియస్​ అవుతుంది.

చిన్న అవకాశం చాలు..

చిన్న అవకాశం చాలు..

మీరు టెన్షన్ పడకండి ఆంటీ.. వసుధారకు లక్​ బాగుంది. అందుకే చివరి నిమిషంలో రిషి చూశాడు. రిషి మంచితనమే మనకు ఆయుధంగా ఉపయోగపడుతుంది. తన ప్రేమనే క్షణాల్లో ద్వేషంగా మార్చొచ్చు. ఒక చిన్న అవకాశం చాలు.. రిషి, వసుధారను విడదీయడానికి అని దేవయానితో సాక్షి అంటుంది. రిషిని డిస్టర్బ్​ చేసే అవకాశం మీరు వెతకండి, వసుధారను వెళ్లగొట్టే దారి నేను వెతుకుతాను అని సాక్షి అంటుంది. రిషిని వసుధార కాదు కదా.. ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను అని అనుకుంటున్న సాక్షితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్​ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X