twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ప్రాజెక్ట్ పేరుతో ఒక్కచోట చేరిన రిషిధార.. మరోవైపు దేవయాని ఆరా!

    |

    మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా రిషి, వసుధార ఒకేచోట కలిసి ఉండేందుకు ప్లాన్ చేస్తారు మహేంద్ర, జగతి, గౌతమ్. వీరు ముగ్గురు మాట్లాడుకోవడం చూసిన దేవయాని వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తుంది. మరోవైపు వసుధార మాటలు తలుచుకుంటూ చేతికున్న కట్టు విప్పుకుంటూ రిషి ఉండగా.. కాఫీ తీసుకొస్తాడు మహేంద్ర. ఆ తర్వాత నేను హెల్ప్ చేయనా అని మహేంద్ర అంటాడు. కాఫీ ఎందుకు తీసుకొచ్చారు.. నేనే వచ్చి తాగేవాడిని కదా అని రిషి అంటాడు. నీకు ఎలా చెప్పాలి.. ప్రతి దాంట్లో అమ్మ ప్రేమనే గొప్పగా ఉదహరించారు. కానీ, తండ్రి ప్రేమకు తగిన ప్రాచుర్యం దక్కలేదని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలనే అనిపిస్తుందని మహేంద్ర చెబుతాడు. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ సెప్టెంబర్​ 30, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 569లో ఏం జరిగిందో చదివేసేయండి.

    నాకు కొడుకులా అనిపించదు..

    నాకు కొడుకులా అనిపించదు..

    నాకు ప్రతి క్షణం నీ దగ్గరే ఉండాలని అనిపిస్తుంది అని మహేంద్ర చెప్పగా.. నాక్కూడా డాడ్ అని అంటాడు రిషి. నువ్ నాకు కొడుకులా అనిపించదు. ఫ్రెండ్ లానే అనిపిస్తుంది అని మహేంద్ర అనడంతో మీరు నాకు ఫ్రెండ్ డాడ్ అని రిషి సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత కాలేజ్ లో మీటింగ్ ఉందని.. నీకు హెల్త్ బాలేదనుకుంటే ఇంట్లోనే ఉండమని రిషికి చెబుతాడు మహేంద్ర. మీటింగ్ దేని గురించి అని రిషి అడగ్గా.. ఫ్రీ ఎడ్యుకేషన్ స్క్రీమ్ గురించి సమాధానమిస్తాడు మహేంద్ర. హాలీడేస్ లో ఎడ్యుకేషన్ విషయం మంచిదే.. మీరు వెళ్లండి, నేను కూడా వస్తానని చెబుతాడు రిషి. కాలేజ్ లో తన క్యాబిన్ లోకి వెళ్లిన రిషి.. అక్కడ హార్ట్ సింబల్ చూసి వసుధారను గుర్తు చేసుకుంటాడు.

    గుండె మోయలోనన్ని జ్ఞాపకాలు..

    గుండె మోయలోనన్ని జ్ఞాపకాలు..


    నా గుండె మోయలోనన్ని జ్ఞాపకాలు ఇచ్చావ్.. గుండె పట్టలేనంత ఆనందం ఇచ్చావ్.. ఇంత చేసి మన మధ్య ఎందుకింత దూరం.. గురు దక్షిణ విషయంలో నువ్వు వెనక్కి తగ్గలేదు.. వసుధారా నిన్ను నన్ను వేరు చేస్తుంది అమ్మా అనే ఒక్క పిలుపు అని అనుకుంటాడు రిషి. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. మినిస్టర్ గారి దగ్గరి నుంచి కో ఆర్డినేటర్ వస్తున్నాడు. ఈ డీటేల్స్ కొంచెం చూస్తావా అని రిషిని జగతి అడుగుతుంది. దానికి ఇప్పుడు వద్దులేండి.. మీరు వెళ్లండి.. అని చెప్పి తన సీట్లో కూర్చొని గతంలో వసుధార తన కోటుకి పెట్టన బ్యాడ్జిని చూసి మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు. ఈ ఫైల్ కొంచెం అని జగతి అడుగుతున్నా.. మీరు వెళ్లండి.. మీటింగ్ లో మాట్లాడతా అని చెబుతాడు రిషి.

    ఆ కో ఆర్డినేటర్ నేనే..

    ఆ కో ఆర్డినేటర్ నేనే..

    ఇంతలో వసుధార వచ్చి.. మీటింగ్ హాల్లో అందరూ కూర్చుని ఉంటారు.. విద్యాశాఖ నుంచి కో ఆర్డినేటర్ వస్తారని అంతా ఎదురుచూస్తుంటారు.. ఆ కో ఆర్డినేటర్ నేనే అని చెబుతుంది వసుధార. ఈ విషయం నాకు చెప్పనేలేదే.. విద్యాశాఖలో కో ఆర్డినేటర్ జాబ్ లో చేరిందా అని అనుకుంటాడు రిషి. ఆ తర్వాత అందరికీ నమస్కారం చెప్పి.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం విద్యాశాఖలో ఉద్యోగంలో చేరానని చెబుతుంది వసుధార. ఆ ప్రాజెక్ట్ గురించి అంతా వివరిస్తుంది వసుధార. జాబ్ లో జాయిన్ అయిన విషయం తనకు చెప్పలేదని అనుకుంటాడు రిషి. చెప్పలేదని ఫీల్ అవుతున్నారా అని మనసులో అనుకుంటుంది వసుధార.

    గౌతమ్ దగ్గర దేవయాని ఆరా..

    గౌతమ్ దగ్గర దేవయాని ఆరా..


    ఇవన్నీ మీరు చూసుకోండని జగతికి చెప్పి కోపంగా లేస్తాడు రిషి. దీంతో చేయికి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు.. వసుధార కూడా వెళ్తూ మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంది. కానీ, రిషి బయటకు వెళ్లిపోతాడు. ఇక్కడ కట్ చేస్తే మరోవైపు గౌతమ్ హాల్లో కూర్చోని ఉంటాడు. దీంతో ఆరా తీసేందుకని దేవయాని వస్తుంది. ఏంటి సంగతులు అని దేవయాని అడిగితే.. సంగతులు ఏముంటాయ్ అంతే.. అని సమాధానం ఇస్తాడు గౌతమ్. మీరు ముగ్గురు ఏవో మంతనాలు చేస్తున్నారు కదా అని దేవయాని అడుగుతుంది. మీరు కూపీ లాగేందుకు వచ్చారని అర్థమైంది పెద్దమ్మా.. అనుకుంటూ వంటల గురించి, రిషి గురించి మాట్లాడుకుంటున్నాం అని చెబుతాడు గౌతమ్.

    వసుధార అంటే మీకు నచ్చదు..

    వసుధార అంటే మీకు నచ్చదు..

    రిషి, వసుధార గురించి ఏమైనా మాట్లాడారా అని అడుగుతున్నాను అని దేవయాని అంటే.. మనసులో వసుధార అంటే మీకు నచ్చదని అందుకే మీరు వాళ్లకు అడ్డుపడుతున్నారని నాకు తెలుసు. మీకేతే ఈ విషయాలు అస్సలు చెప్పను అనుకుంటూ రిషికి కోపం ఎక్కువ చెప్పినా వినడని మాట్లాడుకుంటున్నారు అని అంటాడు గౌతమ్. అంతే అంటావ్.. గౌతమ్ నీకు తెలిసి కూడా కావాలనే చెప్పడం లేదు కదా. ఇది కూడా ఎన్నిరోజులో చూస్తానని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది దేవయాని. ఇక కాలేజ్ నుంచి రిషి.. ఆ వెనుకే వసుధార బయటకు వస్తుంటారు. మహేంద్ర, జగతి అది చూసి సంతోషిస్తారు.

    నాకు కారెందుకు ఇస్తారు..

    నాకు కారెందుకు ఇస్తారు..

    వెంటనే మినిస్టర్ కు కాల్ చేసిన మహేంద్ర.. మీటింగ్ అయిపోయిందని చెబుతాడు. నేను అడగ్గానే వసుధారకు ఉద్యోగం ఇచ్చారు. సంతోషంగా ఉందని మహేంద్ర అంటే.. వసుధార లాంటి తెలివైన అమ్మాయికి జాబ్ ఇవ్వడం నాక్కూడా సంతోషమే అని సమాధానం ఇస్తాడు మంత్రి. తన కారు దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు రిషి. వసుధార అక్కడికి వస్తుంది. ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు అని వసుధార అడిగితే.. ఎలా వచ్చావ్.. కారేది అని రిషి అంటాడు. నాకు కారెందుకు ఇస్తారు.. క్యాబ్ లో వచ్చాను అని వసుధార అంటే నువ్ మినిస్టర్ గారి దగ్గర జాబ్ లో చేరడం ఏంటీ.. నాకు చెప్పాలి కదా అని అంటాడు రిషి.

    జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్..

    జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్..

    పరీక్షలు అయిపోయాయి.. ఖాళీగా ఉండటం ఎందుకు అని రిషి అంటే.. నాకు ఓ మాట కూడా చెప్పలేదు.. నా దగ్గర అసిస్టెంట్ గా చేసేదానివి గుర్తుందా అని రిషి అంటాడు. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది.. మొన్నటి వరకు జీతం తీసుకున్న అసిస్టెంట్ ను.. ఇప్పుడు జీతం తీసుకోని జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్ ను అని వసుధార సమాధానం ఇస్తుంది. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

    English summary
    Guppedantha Manasu Serial September 30 2022 Today Full Episode 569
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X