Guppedantha Manasu: ఎర్ర గులాబీలతో వసుధారకు రిషి సర్ప్రైజ్! సాక్షి మరో ప్లాన్?
ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. వసుధారను ఎగ్జామ్ రాయనివ్వకుండ చేసిన దేవయాని, సాక్షి ప్లాన్ బెడిసికొడుతుంది. ఇక ఎగ్జామ్ రాసిన ఆనందంలో మునిగితేలుతుంది వసుధార. పిల్లలతో కలిసి ఒప్పుల కుప్ప అని ఆట ఆడుతుంది. ఇక పరీక్షలకు ముందు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని ఉందని చెప్పిన వసుధార మాటలు గుర్తుకు వచ్చి వసుధార దగ్గరికి వస్తాడు రిషి. నువ్ స్టోర్ రూమ్‌లో ఎందుకు ఉన్నావు? వసుధార దానికి కారణం ఎవరు? అని అడగ్గానే దీనంతటికి కారణం సాక్షి అని తెలిస్తో ఏమైనా ఉందా అని దాచిపెడుతుందు వసుధార. ఇలా ఆసక్తికరంగా సాగిన సెప్టెంబర్ 5, 2022 సోమవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 547లో ఏం జరిగిందో చదివేసేయండి.

వసుధారతో రిషి లాంగ్‌డ్రైవ్..
వసుధార అలా స్పృహ తప్పిపోవడానికి కారణం ఎవరని రిషి అడగ్గా.. ఏం చెప్పకుండా ఉంటుంది వసుధార. తనకు ఏం గుర్తులేదని, దానిని గుర్తు చేయకండి సార్.. దానిని నేను మర్చిపోవాలనుకుంటున్నాను అని చెబుతుంది వసుధార. దీంతో సారీ వసుధార అని చెప్పి పదా వెళదాం అంటాడు. ఎక్కడికి అని వసుధార అడగడంతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని ఉందని ఎగ్జామ్స్‌కు ముందు అడిగావ్‌గా అని చెబుతాడు రిషి.

పెళ్లికి ప్లాన్..
మరోవైపు గౌతమ్, మహీంద్రాలు కలిసి రిషి, వసుధార ఫొటోలను చూస్తూ ఈ ఫొటో అయితే వెడ్డింగ్ కార్డులో బాగుంటుంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తొందరపడకండి అని జగతి అంటుంది. ఇలా కొద్దిసేపు డిస్కషన్ తర్వాత గౌతమ్, మహేంద్రా, ధరణి వీళ్లందరూ కలిసి రిషి, వసుధార పెళ్లి కోసం ప్లాన్స్ వేస్తుంటారు. ఈ పెళ్లి మ్యాటర్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలని అని ఆలోచిస్తూ ఉంటారు. అది చూసిన దేవయాని రగిలిపోతూ ఉంటుంది. సాక్షిని తిడుతూ ఉంటుంది. వాళ్లను నువ్వేం చేయలేకపోయావ్. ప్రతీసారీ నీ ప్లాన్ ఫెయిల్ అవుతూ వస్తుంది అని అంటుంది.

సాక్షి మరో ప్లాన్..
దీంతో సాక్షి.. ఈసారి నేను వేసిన ప్లాన్ మాములుగా ఉండదు. కచ్చితంగా రిషి, వసుధార విడిపోతారు. ప్లాన్ ఫెయిల్ అవ్వడం అనే మాటే ఉండదు. మీరే చూస్తారు కదా అని స్ట్రాంగ్‌గా చెబుతుంది సాక్షి. మరోవైపు వసుధారను లాంగ్ డ్రైవ్‌కు తీసుకు వెళ్తాడు రిషి. అలా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళుతూ ఒక చోట ఆపుతాడు రిషి. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. పచ్చన పొలాలతో, నదులతోనూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వసుధార కారు దిగి సంతోషపడుతుంది. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటుంది. ఇంతలో వెనుక నుంచి ఎర్ర గులాబీల బొకేతో సర్ప్రైజ్ ఇస్తాడు రిషి. ఆ గులాబీలు ఇస్తూ వసుధారకు ప్రపోజ్ చేస్తాడు రిషి.

మహీంద్రా మ్యారేజ్ యానివర్సరీ..
దీంతో సార్.. ఈ గులాబీలన్నీ నాకోసమేనా? అని అడగ్గానే నేను అడిగిన ప్రశ్నలన్నింటికి టకా టకామని సమాధానం చెప్పు అప్పుడు ఇవన్నీ నేకే అంటాడు రిషి. దీంతో వసుధార ఆలోచిస్తూ ఉంటుంది సార్ ఏం అడుగుతాడా అని. ఇదిలా సాగుతుంటే మరోవైపు అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ అంకుల్ అని మహీంద్రాకు చెబుతాడు గౌతమ్. అయితే తనకు మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవాలని అంతగా ఇంట్రెస్ట్ లేదని చెబుతాడు మహీంద్రా. దీంతో ఎపిసోడ్ పూర్తికాగా.. ఈసారి సాక్షి ఏం కుట్ర చేయబోతోంది? వసుధారను రిషి ఏ ప్రశ్నలు అడగబోతున్నాడు వంటి తదితర విషయాలు తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











