Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Guppedantha Manasu: వసుధారకు రిషి ప్రశ్నలు.. రిషిధారపై మహేంద్రా కామెడీ సెటైర్లు..
వసుధారను రిషి లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లి ఎర్రగులాబీలతో సర్ప్రైజ్ చేస్తాడు. తర్వాత గులాబీలను చేతిలో పట్టుకుని ఒక్కో ప్రశ్నకు సమాధానాలు అడుగుతాడు. నాకు ప్రేమించడం రాదు.. నాకు సరదాలు, సినిమాలు, షికార్లు తెలియవు. నీకు ఓకేనా అని వసుధారను అడుగుతాడు రిషి. అలాగే తనతో సాక్షి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడాన్ని గుర్తు చేసుకుంటూ తనపైన వసుధారకు ఎలాంటి ఉద్దేశం ఉందో ఒక్కో ప్రశ్న రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఆసక్తికరంగా సాగిన సెప్టెంబర్ 6, 2022 మంగళవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 548లో ఏం జరిగిందో చదివేసేయండి.
సాక్షికి మీరు అక్కర్లేదు..
నేనెందుకు ఎవ్వరికీ అర్థం కాను వసుధార? నన్నెందుకు వదిలి వెళతారు? అని అడుగుతాడు రిషి. దీనికి మీ విలువ తెలిసిన వారు ఎవరూ మిమ్మల్ని వదిలి పెట్టరు సార్. వర్షం పొలాల్లో పడితే అందరూ సంతోషపడతారు. అదే మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు పడితే ఇప్పుడెందుకు పడుతుంది? అని అనుకుంటాం కాదా సార్.. ఇది కూడా అలానే. సాక్షికి మీరు అక్కర్లేదు. కానీ మీరు నాకు కావాలి సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది.
సరదాగా కామెంట్ చేస్తూ..
ఇలా ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధారకు రిషి పాప్‌కార్న్ కొనిస్తాడు. దాన్ని తింటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వసుధార ఇంటికి వెళ్లిపోతుంది. వసుధారను డ్రాప్ చేసిన రిషి ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఇంటి బయట వసుధార కోసం మహేంద్ర, జగతి, గౌతమ్ ఎదురుచూస్తు ఉంటారు. అయితే వీళ్లకు తెలుసు వసుధార, రిషి ఒక్కచోటే ఉన్నారని. అలా సరదాగా కామెంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వారు. ఇంతలో వసుధార వస్తుంది.
బ్యాగ్ ఇచ్చేందుకు..
వసుధార రావడంతోనే గౌతమ్, మహీంద్రా ఇద్దరు కలిసి ఆటపట్టిస్తుంటారు. తన చేతుల్లోని పాప్ కార్న్ తీసుకుని తింటూ ఇది చాలా రుచిగా ఉంది అని ఇండైరెక్ట్‌గా రిషిని కామెంట్స్ చేస్తారు. ఇలా మాట్లాడుతుండగానే రిషి, వసుధార తన కారులో బ్యాగ్‌ను మర్చిపోవడంతో అది ఇవ్వడానికి అక్కడికి రిషి వస్తాడు. ఇది కారులోనే మర్చిపోయావ్ అంటూ బ్యాగ్‌ను వసుధారకు అందిస్తాడు రిషి. దీంతో మహేంద్ర, గౌతమ్ ఇద్దరు ముఖాలు చూసుకుంటారు. రిషి.. అని మహీంద్రా మాట పూర్తి కాకుండా బై డాడ్ అంటాడు రిషి. హేయ్ రిషి ఈ పాప్ కార్న్ ఎక్కడ కొన్నావో చెబితే? అంటాడు మహీంద్రా.. దీంతో డాడ్ ఈ పాప్‌కార్న్ గోలేంటీ? బై అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి.
మెసేజ్‌పై డిస్కషన్..
ఇంతలో వసుధారకు ఓ మెసేజ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే మహేంద్రకు అర్థమైపోతుంది. వసుధార నీకు ఏదో మెసేజ్ వచ్చినట్టుందమ్మా అంటాడు. వెంటనే వసుధార ఫోన్ తీసుకుని బై వసుధార అని ఉన్న మెసేజ్ చదువుకుంటూ ఉంటుంది. ఆ మెసేజ్.. అని మహీంద్రా అనడంతో ఆ.. అది అంటూ నసుగుతుంది వసుధార. వెంటనే కంపెనీ వాళ్ల దగ్గర నుంచే కాదా అని మహీంద్రా అంటాడు. ఇలా కామెడీ డైలాగ్‌లతో సంతోషంగా సాగుతుంది.