twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: రిషిని పటాయించేందుకు సాక్షి మాస్టర్ ప్లాన్.. దెబ్బకు షాకిచ్చిన వసు అండ్ కో!

    |

    ఆసక్తికరంగా సాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధార తన ప్రేమను రిషి ముందు వ్యక్తం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క సాక్షి కూడా వారిద్దరిని విడదీసి తాను రిషితో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ కూడా దాదాపు డ్రెస్సుల వ్యవహారంతోనే మొదలైంది. ముందుగా రిషి తీసుకొచ్చిన బట్టలు తీసుకోవడానికి తడపడ్డ వసుధార తరువాత సాక్షి ముందు ఆయన పరువు పోకూడదు అనే ఉద్దేశంతో ఆ బట్టలు తీసుకుంటుంది. థాంక్యూ రిషి సర్, థాంక్యూ సాక్షి గారు అని అనేసి ఆ డ్రస్సులు తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. వసుధార డ్రస్సులు ఇచ్చేటప్పుడు ఏమి ఆలోచించారో, తెలియదు కానీ నేను సాక్షి వల్లే వీటిని తీసుకోవాల్సి వచ్చింది అనుకుంటుంది.

    హర్ట్ అయ్యా

    హర్ట్ అయ్యా

    రిషి ఆలోచిస్తూ ఏంటో ఈ వసుధార ఇప్పటివరకు బట్టలు వద్దు అని చెబుతూ సాక్షి వచ్చిన తర్వాత బట్టలు తీసుకుని వెళ్ళింది అనుకుంటాడు. ఇక ఆ డ్రెస్సులు తీసుకువచ్చి జగతీ- మహేంద్ర ఇద్దరికీ చూపించిన వసుధార అసలు ఏంటి మేడం మీ అబ్బాయి నాకు డ్రస్సులు కొనివ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. దానికి జగతి చూశావా మహేంద్ర, మన అబ్బాయి అట, కాలేజీ ఎండి గారు కాదు మన అబ్బాయి అట అనడంతోనే వసుధార నేను చాలా హర్ట్ అయ్యానని అంటుంది. మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు అని అంటే నేను కూడా సీరియస్ గానే ఉన్నానని ఈ డ్రెస్సులు వాడు నీకు కొనిచ్చినందుకు కోపం వచ్చిందని నాకు కూడా అర్థమైంది అని అంటుంది. దానికి వసుధార ఒక అమ్మాయికి డ్రెస్సులు కొనిస్తే ఏమన్నట్టు అంటే నాకు డ్రస్సులు లేవు అనా, లేక ఉన్న డ్రెస్సులు బాలేదనా, నేను ఈ మాత్రం కొనుక్కోలేననా అంటూ అడుగుతూ ఉండడంతో ఎక్కడో వర్షం పడితే ఇక్కడికి వచ్చి గొడుగు పడితే ఎలా అని కౌంటర్ వేస్తుంది జగతి. దానికి వసుధార కూడా బంగాళా ఖాతంలో వాయుగుండం ఉంటే ఇక్కడ వర్షం పడటం లేదా అని ప్రశ్నిస్తుంది.

    గొప్పతనం గురించి

    గొప్పతనం గురించి


    అయితే వీరిమధ్య ఈ వ్యవహారం నడుస్తూ ఉన్న సమయంలో రిషి అలా నడుచుకుంటూ వస్తాడు. ఏంటి ఇప్పుడు డ్రెస్సులు వెనక్కి ఇచ్చేస్తుందా అనే ఆలోచనతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే రిషి ఏదీ కావాలని చేయడు దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది అని జగతి అనడంతో సాక్షి అన్న మాటలకే రిషి గారు ఇలా బట్టలు తీసుకొచ్చి ఇచ్చారేమో అనుకుంటుంది. ఇక తరువాతి రోజు వసుధార ఆ బట్టలు వేసుకుని కాలేజీకి రావడంతో రిషి ఎనలేని ఆనందంతో మునిగిపోతాడు. అంతేగాక ఆమెను కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటారు. మీటింగ్ హాల్లో కూర్చుని ఉన్న సమయంలో వసుధార చదువుల పండుగ గురించి, డిబీఎస్టీ కాలేజీ గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది.

     ఆల్ ది బెస్ట్ అని

    ఆల్ ది బెస్ట్ అని

    దానికి జగతి మన గొప్పతనాలు మనం చెప్పకూడదు దయచేసి అసలు విషయం చెప్పమంటే ప్రాజెక్టు గురించి పూర్తిస్థాయిలో ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత అందరూ అభినందిస్తారు. ఆ తర్వాత సాక్షి రిషి దగ్గర అసిస్టెంట్ గా ఉండడానికి అనుమతి కోరిన సమయంలో రిషి అనుమతి ఇచ్చినట్లుగా వసుధార పొరబడుతుంది. కానీ రిషి ఆమెకు అలాంటి సమాధానం ఇవ్వలేదు. సాక్షి పదే పదే అడుగుతుంటే నా సమాధానం ఇందాకే చెప్పాను కదూ అందరూ వెళ్లిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. నీకు సర్వీస్ చేయడానికి ఇష్టం అన్నావు కదా నాకు అది నచ్చింది. నీకు ఏ ప్లేస్ కరెక్తో నాకు తెలుసు కదా ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. తర్వాత వసు తీసుకువచ్చిన బొకే చూసిన రిషి దానిమీద చదువులు పండగ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని రాసి ఉండడాన్ని కూడా గమనిస్తాడు.

    కరెక్ట్ కాదని

    కరెక్ట్ కాదని

    ఆ తర్వాత బయటకు రాగానే వసుధార ఎదురవుతుంది. అలా వారు ఒకరిని ఒకరు చూసుకుంటూ థాంక్స్ చెప్పుకుంటారు. తర్వాత డ్రస్సులు కొనిచ్చినందుకు థాంక్స్ అని వసుధార చెబితే యాక్సెప్ట్ చేసినందుకు కూడా థాంక్స్ అని అనుకుంటాడు. నువ్వు ఏది యాక్సెప్ట్ చేయవు కదా, ఎందుకు ఈ డ్రెస్ ఆక్సెప్ట్ చేసావ్ అంటే ఈ డ్రెస్సులు ఎందుకు ఇవ్వాలనిపించింది అని వసుధార అడుగుతుంది. నేనొకటి అనుకున్నాను అవునా కాదా అని అడిగితే నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదని విషయం అంటాడు. ఏమనుకున్నావో తెలియక ముందే తప్పు అని ఎలా అనుకుంటారు అంటే ఎదుటివారిని అంచనా వేయడంలో నీ ఆలోచన తప్పు అని అంటాడు.

    రిషితో పాటు

    రిషితో పాటు

    ఈ డ్రెస్సులు వద్దనుకున్నావు కదా నేను దూరం నుంచి చూసాను అంటాడు. దూరం నుంచి చూసినవి నిజం కాదు దగ్గర నుంచి చూస్తేనే మనసు తెలుస్తుందని అంటున్న సమయంలోనే దూరం నుంచి మహేంద్ర -జగతి వస్తు కనిపిస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి టాపిక్ మారుస్తారు. ఈ సమయంలోనే ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి భోజనానికి మా ఇంటికి రావాలి అని సాక్షి ఆహ్వానిస్తుంది. అయితే రిషితో పాటు జగతి, మహీంద్ర, గౌతం, వసుధార కూడా సకటుంబ సపరివార సమేతంగా రావడంతో ఆమె షాక్ అవుతుంది.

    English summary
    Guppedantha Manasu Episode 506: Rishi feels elated as Vasudhara accepts his gift. Meanwhile, Mahindra and Jagathi get curious to see Rishi and Vasudhara share a talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X