twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఒకే కప్పులో రిషి, వసుధార కాఫీ.. పాపం సాక్షి కళ్ళ ముందే ప్రేమ పక్షుల రచ్చ!

    |

    గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వసుధార తన ప్రేమ విషయాన్ని రిషికి వెల్లడించడం కోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు గత కొన్ని ఎపిసోడ్లుగా చూపిస్తున్నారు. ఇక గత ఎపిసోడ్లో సాక్షికి దెయ్యం కథ చెప్పిన వసుధార ఆమెను వణికి పోయేలా చేస్తుంది. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు మనం చూద్దాం..

    అడుగు ముందుకు వేయాలా

    అడుగు ముందుకు వేయాలా

    వసుధారకి కాఫీ ఇచ్చిన తర్వాత తన రూమ్ కి వచ్చేసిన రిషి మళ్లీ వసుధార ఆలోచనలోనే మునిగితేలుతూ ఉంటాడు. అభినందన సభ జరిగిన సమయంలో వసుధార తన మెడలో వేసిన దండని తీసి మళ్లీ తన మెడలో వేసుకుని అద్దంలో చూసుకుని ఆనందపడుతూ ఉంటాడు. నన్ను కాదంటోంది, కానీ నా మెడలో దండ వేస్తుంది. నేను వద్దు అంటుంది అంతలోనే నాకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. నేనేమిటి ఆమె మనసు చదవలేక పోతున్నానా లేక ఆమె వింతగా ప్రవర్తిస్తుందా అంటూ వసుధార తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను ఒక అడుగు ముందుకు వేయాలా అయినా సరే నేను వద్దు అన్న తర్వాత కూడా నేను ఎందుకు ఆమె గురించి ఇంత ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాడు.

    నిద్రపోతారని

    నిద్రపోతారని

    మరోపక్క వసుధార కూడా ఏదో ఆలోచించుకుంటూ రిషి రూమ్ వైపు వెళుతుంది. డోర్ బయట వరకు వెళ్లిన తర్వాత అయ్యో నేనేంటి రిషి సార్ రూమ్ కి వచ్చాను అనుకుని తనకు అలర్ట్ చేసిన రూమ్ దగ్గరకు వెళ్తుంది. మరోపక్క వసుధార ఫోన్లో రిషి ఫోటో చూసిన సాక్షి షాక్ అయ్యి ఏమిటిది వసుధార అని అడిగితే వెంటనే ఆ ఫోన్ లాక్కోవడమే కాక అసలు నువ్వు నా ఫోన్ తీసుకోవడం తప్పు నేను ఎవరి ఫోటోలు పెట్టుకోవాలనేది నా ఇష్టం అని వార్నింగ్ ఇస్తుంది. సాక్షి కోపంగా చూస్తూ ఉండడంతో ఏంటి కోపంగా చూస్తున్నావు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లి వస్తున్నానో తెలుసా, చెప్పనా పోనీ ఆప్షన్లు ఇవ్వనా అంటూ ఏడిపించే ప్రయత్నం చేస్తుంది. సాక్షి కూడా చెప్తే చెప్పు లేకపోతే మానేయి ఏంటిది అంటే నేను రిషి సర్ గదిలో నుంచి వస్తున్నానని అంటుంది. అదేంటి నువ్వు రిషి గదిలోకి వెళ్ళావా ఎందుకు అంటే ఆయనని చూడాలనిపించి వెళ్లాను ఆయన నిద్రపోతారని వచ్చేసాను అని అంటుంది.

    క్లారిటీ ఉంది అని

    క్లారిటీ ఉంది అని

    అయినా నేను రిషి సర్ గదిలోకి వెళ్ళగలను, రాగలను అయినా నువ్వు వెళ్లగలవా, వెళ్ళినా నీ మనసులో ఏదో ఒక కుట్ర పెట్టుకుని వెళతావు కానీ నాకు క్లారిటీ ఉంది అని అంటుంది. మరోపక్క రిషి తన రూమ్ బాల్కనీ వైపు నుంచుని వసుధార రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. లేటుగా పడుకుంది కదా నిద్ర లేచిందో లేదో అనుకుంటూనే అసలు ఎందుకు నేను ఆమె గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఉంటే ఇంత లోపే వసుధార గదిలో ఏదో వెతుక్కుంటూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్లి కాసేపైనా నిద్రపోయేవా అంటే అవును సార్ నిద్రపోయాను అని అంటుంది. పని అయిపోయిందా అంటే మెయిన్ పాయింట్స్ రాసుకుని చెక్ చేసుకోవాలి మిగతా అంతా పూర్తయినట్లే అంటుంది. ఏంటి వెతుకుతున్నావు అంటే పెన్సిల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని అంటుంది. ఏంటి ఈరోజు వసూ కొత్తగా కనిపిస్తోంది అని ఆలోచిస్తూ ఉండగానే వసూ దగ్గరికి వెళతాడు రిషి. ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే చేస్తూ ఉండగానే వసు జుట్టు ముడి వేసుకుని అక్కడ పెట్టుకున్న పెన్సిల్ తీసేస్తాడు. పెన్సిల్ ఎలా కూడా వాడుతారా అని అడిగితే ఏదో ధ్యాసలో ఉండే అలా పెట్టుకున్నాను అని అంటుంది.

    మాట మీద ఉండటం

    మాట మీద ఉండటం

    అవునులే మర్చిపోవడం కొంతమందికి వరం మర్చిపోలేక పోవడం మరికొంతమందికి శాపం అని అంటాడు. పని ధ్యాసలో పడి టిఫిన్ చేయడం కూడా మర్చిపోయావా అంటే మిగిలిన కొంచెం పని కూడా పూర్తి చేసిన తర్వాత తింటానని అంటుంది. మనసులో మీకు ఎదురుగా ఉన్న చెప్పలేకపోతున్నాను అని అనుకుంటుంది. అయితే రిషి మాత్రం కొన్ని రోజులు ముందు నుంచి నీలో మార్పు కనిపిస్తోందని అంటాడు. నాలో మార్పు వచ్చింది అంటూన్నాడు కదా నేను ఇప్పుడే చెప్పేస్తాను ఇంత మంచి అవకాశం మళ్ళీ రాలదనుకుంటా చెప్పబోతుంటే కొందరిని చూస్తుంటే నాకు అర్థం కాదు. అప్పటికప్పుడు మనసు మార్చుకుంటారు. అప్పుడే అభిప్రాయం చెబుతారు, ఆ వెంటనే ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నామని అంటారు. మనుషులు ఎలా మాట ఎందుకు మారుస్తారు. కష్టమైనా నష్టమైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకే మాట మీద ఉండటం మంచి లక్షణం కదా అంటూ రిషి సాక్షిని ఉద్దేశించి మాట్లాడుతాడు.

    క్లారిటీ మిస్ అయింది

    క్లారిటీ మిస్ అయింది


    కానీ అది తన గురించే చెబుతున్నాడేమో అని భావించిన వసుధార ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని భావించి కొంచెం క్లారిటీ మిస్ అయింది వర్క్ విషయంలో అందుకే ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటుంది. మరోపక్క సాక్షి రెండు కప్పులు తీసుకువచ్చి రిషికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో గౌతం కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇవ్వమని తాగడానికి ప్రయత్నిస్తాడు. ఛ గౌతం తీసుకున్నాడు ఏంటి నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని సాక్షి భావిస్తున్న సమయంలో ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఆ గదిలోకి వచ్చిన వసుధార కావాలని కాఫీ కావాలి సార్ తల పగిలిపోతోంది అంటుంటే సరే ఇదే షేర్ చేసుకుందాం రా అని రిషి తాను సాసర్లో పోసుకుని వసుధారకు కప్పులో ఇవ్వడం వాళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడి కాఫీ తాగడం చూసి సాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి చూడాలి రాబోతున్న ఎపిసోడ్లో ఎలా ప్లాన్ చేశారనేది.

    English summary
    Guppedantha Manasu Episode 503: Vasudhara asks Sakshi to stay away from her matters. Later, Sakshi gets coffee for Rishi to impress him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X