Guppedantha Manasu: రిషి అసిస్టెంట్ పదవికి పోటీ.. వసుధారకు షాకిచ్చి ముందంజలో సాక్షి.. ఏం జరుగుతోంది?

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా రిషిని తన వశం చేసుకోవాలని సాక్షి, తన ప్రేమ బయట పెట్టాలని వసు ప్రయత్నిస్తున్నారు. ఇక వసు పుష్ప మాట్లాడకుంటూ ఉండగా క్లాసు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రిషిని చూడకుండా పుష్పతో ఏదో మాట్లాడేస్తూ ఉంటుంది వసు. ఆ తర్వాత పుష్పకు ఫోన్ రింగ్ అవడంతో అక్కడ నుంచి ఆమెను వెళ్ళమని సైగ చేసిన రిషి పుష్ప వెళ్ళగానే తన చేతిలో ఉన్న గులాబీ పువ్వు తీసి వసుధార ముందు పెట్టేసి వెళ్ళిపోతూ ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తాడు ఆ గులాబీ ఇచ్చి ఆల్ ధీ బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతాడు. దీంతో వసుధార తనలో తానే మురిసిపోతూ ఉంటుంది.

ఎలా ఉన్నాయో చూడమని

ఎలా ఉన్నాయో చూడమని

మరోపక్క జగతి మహేంద్ర కాలేజీలోని క్యాబిన్లో నుంచి బయటకు వస్తూ ఈ చదువులు పండుగ ముగిసే సరికి వసుధార రిషి కలిస్తే బావుండు కదా అని అనుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగానే వాళ్ళిద్దరూ కలవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని కూడా జగతి అంటుంది. ఇక వసుధారను అసిస్టెంట్ గా తీసుకోమని మహేంద్ర అంటే మన ప్రయత్నం మనం చేద్దామని అంటుంది. మరోపక్క దేవయానికి కాల్ చేసిన సాక్షి ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రిషికి నన్ను అసిస్టెంట్ గా తీసుకోమని మీరే రికమెండ్ చేయాలని కోరుతుంది. మరో పక్క కాలేజీలో మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటున్న వసుధార దగ్గరకు వచ్చిన గౌతమ్ కొన్ని బ్యాడ్జిలు తీసుకొచ్చి ఎలా ఉన్నాయో చూడమని అంటాడు.

రిషి ఎదురుగా పెట్టి

రిషి ఎదురుగా పెట్టి


అప్పుడే అక్కడికి వస్తాడు రిషి. గౌతమ్ వసుధార మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే చదువుల పండుగకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నామని అంటారు. అయితే చదువులు పండగ కోసం మనకు కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఇలా మెట్ల మీద కూర్చుని ఎందుకు మాట్లాడుతున్నారు లోపలికి వెళ్ళమని అంటాడు. అలా వెళ్లిన క్రమంలో రిషి క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంటాడు. క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తున్న రిషి ని చూసి వసుధార లోపలికి ఎంట్రీ ఇస్తుంది. లోపలికి రావడమే కాక బ్యాడ్జెస్ అన్ని రిషి ఎదురుగా పెట్టి ఎలా ఉన్నాయో, చుడండి మీకు ఓకే కదా అని అడుగుతుంది. ఇప్పుడు ఒక కారు కొనాలంటే ఏం చేస్తారంటే వెళ్లి కొనుక్కుంటామని అంటుంది అంత సింపుల్గా చెప్పేస్తావు ఏంటి అంటే టెస్ట్ డ్రైవ్ చేయాలంటారా? అంటే అర్థం అయిందా అంటాడ. దీంతో సరే పెట్టి చూపించాలా ఆగండి పుష్పను పిలుస్తానంటే, పుష్పను, షీలా ఎవరిని పిలవద్దులే అంటూ ఉండగానే సరే మీరు కోటు వేసుకోండి అంటుంది.

అసిస్టెంట్ గా తీసుకుంటా

అసిస్టెంట్ గా తీసుకుంటా

కోటు వేసుకున్న తర్వాత రిషికి ఆ బ్యాడ్జ్ లు పెట్టే సమయంలో పొరపాటున పిన్నిసుతో గుచ్చుతుంది. అది చూసిన తర్వాత రిషి గట్టిగా అరుస్తూ ఎందుకు జాగ్రత్తగా పెట్టొచ్చు కదా నాకు గుచ్చుకుంటుంది అంటూ ఉంటాడు. ఇంతలో వీళ్లిద్దరూ వాళ్ళ సన్నిహితంగా ఉన్న సమయంలోనే సాక్షి అక్కడికొస్తుంది. ఈ వసు ఉన్నంత వరకు నేను రిషిని చేరుకోలేను అంటూ బాధపడుతుంది. నేను దూరం చేద్దామనుకుంటున్న సమయంలో వీళ్ళు మళ్ళీ దగ్గర అవుతున్నారు అనుకుంటూ ఉంటుంది. అంతా సెట్ అయిన తరువాత హాల్లో కూర్చుని మాట్లాడుతుంటారు. నేను లీడ్ చేయబోయే టీం కి అసిస్టెంట్గా సాక్షి, వసుధార ఇద్దరూ పోటీ పడుతున్నారని చెప్పిన ఋషి ఇద్దరికీ నేను పోటీ పెడతాను ఇద్దరికీ మూడు లెవెల్స్ లో ప్రశ్నలు అడుగుతాను అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని నా అసిస్టెంట్ గా తీసుకుంటానని అంటాడు.

సాక్షికి ఆరు ఓట్లు

సాక్షికి ఆరు ఓట్లు

దానికి గౌతం మాట్లాడుతూ దీనికి ఎంత ప్రాసెస్ ఎందుకు? నీకు నచ్చిన వారిని ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటాడు. అయితే ఈ ఇద్దరు దీనికి అర్హులైన వారే కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని గౌరవ పరచడం నాకు ఇష్టం లేదని అంటాడు. రిషి అలా అనడంతో వసుధారకు నేను చదువుకున్నంత చదువులేదు నాకున్న ప్రపంచ జ్ఞానం కూడా లేదు తప్పకుండా నేనే గెలుస్తాను అని సాక్షి భావిస్తూ ఉంటుంది. అలా రిషి మొదటి ప్రశ్న జీవితం ఏమిటి అని అడుగుతాడు జీవితం అంటే ప్రయాణం అని ఒక నది ప్రవహించినట్టు గెలుపు ఓటమి చూస్తూ ప్రయాణించడమే అని చెబుతుంది. ఈ క్రమంలో ఏడు ఓట్లలో సాక్షికి ఆరు ఓట్లు వస్తాయి.

చూడాలి మ

చూడాలి మ

వసుధార ఇదే ప్రశ్నకు సమాధానం జీవితం అంటే నిర్వచనం లేదని జీవితమంటే ఒక పోరాటం, జ్ఞాపకాల పూల గుచ్చం, కష్టసుఖాలను సమానంగా స్వీకరించడం అంటూ తనకు తోచింది చెబుతుంది. అయితే వసుధారకు మాత్రం కేవలం 5 వోట్లే లభిస్తాయి. రిషి రెండో ప్రశ్నగా ప్రపంచంలో స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ ఎవరిది, అంటే సాక్షి తల్లి ప్రేమే నిజమైనది అదే నిస్వార్ధమైనది అంటుంది. మరోపక్క వసుధార చెప్పడానికి సిద్ధమవుతున్న సమయంలోనే తాజా ఎపిసోడ్ ముగించారు. అయితే ముగ్గురి ఫోటోలను ఫ్రీజ్ చేసి చూపిస్తున్న నేపథ్యంలో ఆమె ఏదో చెప్పకూడని ప్రశ్నే చెప్పింది అంటూ భావిస్తున్నారు. చూడాలి మరి మీ జరుగుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X