Guppedantha Manasu: రిషికి ప్రవర్తనకు షాకైన మహేంద్ర.. వసుతో సరదా సరదాగా బయటకు?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. వసు రిషి ఇంటికి వెళ్ళడం, ఆ తరువాత రిషితో మహేంద్రను పిలిపించేలా ప్లాన్ చేయించమని ధరణిని అడగడం చూపించారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 డెవలప్ కావడానికి కారణం

డెవలప్ కావడానికి కారణం


వసును తన కారులో తీసుకువచ్చిన రిషి జగతి ఇంటి ముందు డ్రాప్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఆగుతాడు ఏమో అని ఇంకా కాసేపు చూసిన మహేంద్ర ఆగకుండా వెళ్లిపోవడంతో లోపలి వచ్చిన వసుతో మా పుత్రరత్నం ఏంటి ఈ రోజు కోపంగా ఉన్నాడు అని అంటాడు. అయితే దానికి వసు అసలు సార్ ఎప్పుడు కోపంగా ఉంటారో? ఎప్పుడు సరదాగా ఉంటారో ఎవరం చెప్పలేం ఆయనని అర్థం చేసుకోవడం కష్టం అని అంటుంది. అదేంటి వాడిని బాగా అర్ధం చేసుకున్న ఈమె ఇలా అంటుంది ఏమిటా అని జగతి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో కొంచెం దూరం ముందుకు వెళ్ళిన రిషి మళ్లీ వెనుకకు వచ్చి హాయ్ డాడ్ గుడ్ నైట్ అని కొంచెం వెటకారంగా చెబుతాడు. ఇది ఏ మాత్రం ఊహించని మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఇక అలా జగతి కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. ఇక మరోపక్క రిషి మన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇంతగా డెవలప్ కావడానికి కారణం మినిస్టర్ గారు అని ఫణీంద్ర భూపతికి చెబుతాడు.

 డెవలప్ కావడానికి కారణం

డెవలప్ కావడానికి కారణం

అంతేకాకుండా ఆ మినిస్టర్ గారికి సన్మానం చేయాలి. దీని గురించి మినిస్టర్ గారిని ఇన్వైట్ చేయడానికి మనం వెళ్ళాలి అని ఆయనతో కూడా అంటాడు. ఆ తర్వాత కాలేజీలో రిషి వసు దగ్గరకు వచ్చి నేను మినిస్టర్ దగ్గరకు వేలుతున్నన్నాను నువ్వు కూడా మినిస్టర్ గారి దగ్గరకు వస్తున్నావు అని అడుగుతాడు. దానికి సరేనేని బయలుదేరుతుంది వసు. అలా రిషి, వసులు ఇద్దరూ కారులో కలిసి మినిస్టర్ దగ్గరకు బయలుదేరుతారు. ఈ క్రమంలో అసలు తాను ఎవరికి అసిస్టెంట్ గా ఉన్నానో అర్ధం కావడం లేదని అంటుండు వసు. అదేంటి అని రిషి అడడగా నేను జగతి మేడంకి అసిస్టెంట్ గా ఉన్నానో, మీకు అసిస్టెంట్ గా ఉన్నానో తెలియడం లేదని అంటుంది.

 దాదాపు అదే అనుమానం

దాదాపు అదే అనుమానం

ఇంతలో రిషి ఏదో అనబోతూ ఉంటే సరే కారు దిగేయాలా? వెళ్ళిపోవాలా? అంటూ వెటకారంగా అనడంతో ఎందుకొచ్చిన గోలలే అనుకుని రిషి కారు పోనిస్తాడు. మరో వైపు నుంచి మహేంద్ర, జగతి కూడా అక్కడికి వస్తారు. అలా అందరు కలిసి మినిస్టర్ మీటింగ్ పూర్తి చేసుకుని వస్తారు. ఆ తర్వాత రిషి నేను మినిస్టర్ గారి దగ్గర ఫోన్ మర్చిపోయాను అని వెనక్కి తిరిగి వెళ్లి ఫోన్ తెచ్చుకుంటానని చెబుతాడు. అదేంటి అని వసు కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈయన మూడ్ బాలేదా? ఏంటి? అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కోసం లోపలి వెళ్ళడంతో మినిస్టర్ కూడా దాదాపు అదే అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే వసును బయటకి తీసుకు వెళతాడు రిషి. అలా బయటకు తీసుకుని వెళ్లి ఒక చోట ముంత కింద పప్పు అమ్ముతుంటే అక్కడికి ఆమెను కూడా తీసుకుని వెళతాడు.

ఎపిసోడ్ ముగించారు కానీ

ఎపిసోడ్ ముగించారు కానీ

ఆమెను అక్కడికి తీసుకు వెళ్లడం మాత్రామే కాదు బాగా ఘాటుగా దగ్గరికి వెళ్లి రెండు బాగా మసాలాలు వేసి కలుపు అని అంటాడు. ఇక వసు రిషి ప్రవర్తన చూసి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంది సార్ అని అంటుంది. దీంతో రిషి ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు అని ఊరికే లేదు అంటాడు. దీంతో వసు నిజమేనా సార్ అని కాస్త వెటకారంగా అంటుంది. ఆ తర్వాత వసు తాము తింటున ముంత కింద పప్పు గురించి అసలు స్టోరీ ఏంటంటే అంటూ మొదలు పెడుతుంది. దీంతో రిషి ఇప్పుడు దీని గురించి క్లాస్ ఇవ్వకు ప్లీజ్ అని దండం పెడతాడు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు కానీ రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో ఏం జరగుగుతుందని మాత్రం హింట్ ఇవ్వలేదు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్

ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగతా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.93 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X