Guppedantha Manasu: ఎవరూ ఊహించని టిస్ట్ ఇచ్చిన రిషి.. మాడిపోయిన దేవయాని ముఖం?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజును గ్రాండ్ గా ప్లాం చేయడానికి రిషి పడుతున్న తిప్పలును గత ఎపిసోడ్ లో చూపారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇష్టం ఉండదని
మహేంద్ర, ఫణీంద్ర, రిషి, జగతి కూర్చుని ఉండగా వసు నిలబడి ఉంటుంది. ఇక మినిస్టర్ గారికి కాలేజీలో చాలా గ్రాండ్ గా సన్మానం చేద్దాం అని కాలేజీలో మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ గా డెకరేషన్ చేయించి, ట్రెడిషనల్ లుక్ లో తయారు చేద్దాం అని ఫణీంద్ర అంటాడు. మినిస్టర్ గారిని సంప్రదాయ లుక్ లో ఆహ్వానిద్దాం ...మీరు ఆ ఏర్పాట్లు చేయండి జగతి మేడం అంటాడు.
ఏం చెబుతున్నా కానీ చూద్దాం పెదనాన్న అంటూ ఉండగా నువ్వేంటి అలా ఉన్నావ్ అని అడగడంతో మనం ఇలా అనుకుంటున్నాం కానీ మినిస్టర్ గారు ఇంకా ఓకే చెప్పలేదు కదా అంటాడు.ఇంతలో మినిస్టర్ నుంచి ఫణీంద్రకి కాల్ వస్తుంది... మీకు కాల్ చేయడం కాస్త ఆలస్యం అయిందని చెప్పిన మినిస్టర్ సన్మానం గురించి మాట్లాడుతూ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు కానీ, మీరేదో ప్లాన్ చేస్తున్నారు అయితే ప్రోటోకాల్ ప్రకారం కాలేజీలో అది కరెక్ట్ కాదు, నాక్కూడా ఇష్టం ఉండదని అంటాడు.

భలే కలిసేలా ప్లాన్ చేశాడే
కాలేజీలో కాకుండా మీ ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని ఇంట్లోనే టీ పార్టీ లాగా చేసుకుందామని అంటాడు. దానికి ఫణీంద్ర మా మహేంద్ర బర్త్ డే పార్టీ ఉంది ఏకంగా భోజనం చేసి వెళ్లుదురు అని అనడంతో సరే అలాగే వస్తానని అంతటి. ఇక ఫణీంద్ర కాలేజీకి వద్దన్నారు ఇంటికే వస్తామన్నారని చెప్పడంతో రిషి సంతోషిస్తాడు. ఎందుకో మరి మినిస్టర్ గారు రిషిని పొగుడుతున్నారు అని అంటాడు ఫణీంద్ర. అయితే అక్కడే అసలు ఏం జరిగిందో చూపిస్తారు.
క్యాబిన్లో ఫోన్ మర్చిపోయానంటూ లోపలికి వెళ్లిన రిషి, మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలని చెబితే మినిష్టర్ ఏం కావాలని అడుగుతాడు. కాలేజీ తరపున సన్మానం అని అనుకుంటున్నాం కదా...నేను చెప్పానని కాకుండా కాలేజీకి కాదు మా ఇంటికి వస్తానని చెప్పండని అంటాడు. ఎందుకు అని అడగబోతే అలా ఏమీ అడగొద్దు..మీ ద్వారా ఓ మంచి జరుగుతుందని అడుగుతున్నాను అనేసి వెళ్లిపోతాడు.తరువాత మినిష్టర్ ఆలోచింది భలే కలిసేలా ప్లాన్ చేశాడే అనుకుంటాడు.

తీసుకురావాల్సిన బాధ్యత నీదే
ఇక మహేంద్ర రిషి రిసార్టులో తన బర్త్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా అన్న మాటలు.... కాలేజీలో కాకుండా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని మినిస్టర్ మాటలు విని, ఎంత తెలివిగా ఆలోచించావ్ మొండివాడివి అని అనుకుంటాడు. ఇక జగతితో మహేంద్ర నేను రాను అన్నానని రిషి ప్లాన్ చేసి మరీ రప్పించుకుంటున్నాడు, మినిస్టర్ గారి సన్మానం కాబట్టి నువ్వు రాక తప్పదు..నువ్వు నా పక్కనే ఉంటావని అంటాడు.
ఇక వాళ్ళు మాట్లాడకుంటూ ఉండగా హడావుడిగా వెళుతున్న వసుధారని జగతి ఆపి...ఎక్కడికి అని అడిగి నాకు తెలుసులే అంటుంది. అంతేకాక రిషి అర్థంకాడు అనుకుంటాం కానీ అప్పుడప్పుడు వసు కూడా అర్థంకాదని అంటుంది. వాళ్ళు ఇద్దరూ ఓ గూటి పక్షులే... ఇద్దరూ ఒకర్నొకరు బాగానే అర్థం చేసుకుంటారని అంటాడు మహేంద్ర. ఇక వసుధార రోడ్డు పక్కన కూర్చుని వెయిట్ చేస్తుండగా రిషి అక్కడకు వస్తాడు. రేపు మినిస్టర్ గారి సన్మానం...డాడ్ బర్త్ డే కూడా... రేపు మా డాడ్ ని-మీ మేడంని దగ్గరుండి తీసుకురావాలని చెబుతాడు. తీసుకురావాలి అంటావేమో... వాళ్లు సమయానికి ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే...నీ శాలరీ అకౌంట్లో పడింది చూసుకున్నావా అని అడుగుతాడు.

వసుధార ఎంట్రీ
నీ శాలరీ ఇచ్చాను..నువ్వు నా అసిస్టెంట్, నేను చెప్పింది వినాలి అని చెప్పినట్టు ఉంది అనుకుంటుంది. నిన్ను డ్రాప్ చేయమంటావా అని అడిగితే చేయండి సార్... నాకొచ్చే జీతం మొత్తం ఆటోలు, క్యాబ్ లకే అయిపోతోందని అంటుంది. శాలరీ పెంచాలా అంటే పెంచమంటుంది. కానీ ఓ మెయిల్ పెట్టు..ఆలోచిస్తానని అంటదు. అంటే పెడితే పెంచుతారా? అంటే ఆలోచిస్తానన్నాయి అంటాడు.
ఇక ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లు చూసి దేవయాని రచ్చ చేస్తుంది. మహేంద్ర బర్త్ డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం ఏంటో అంటూ రుసరుసలాడుతోంది. ఆ మినిస్టర్ వస్తే ఆ జగతి, శిష్యురాలు కూడా వస్తుంది కదా అనుకుంటూ ఉండగానే వసుధార ఎంట్రీ ఇస్తుంది. గౌతమ్-ధరణి వసుని ఆహ్వానించడం చూసి..హారతి పళ్లెం తీసుకుని వెళ్లలేకపోయావా అని ధరణి మీద ఫైర్ అవుతుంది.

బర్త్ డే గిఫ్ట్
ఇంతలో ఫణీంద్ర, రిషి మేడపై నుంచి కిందకు దిగగా దిగుతారు. నేను నీకు ఏం చెప్పాను వసుధార అని రిషి అడగడంతో వస్తున్నారు సార్ అంటుంది వసుధార. మినిస్టర్ గారికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని చెప్పడమే కాక వసు చేతికింద ఉండమని గౌతమ్ కు చెబుతాడు. ఇక కమింగ్ అప్ లో ఫంక్షన్ జరిగిన తర్వాత మంత్రిగారు వెళ్లిపోతారు.
ఇక వెళ్లాల్సిన వాళ్లు కూడా వెళ్లిపోతే లోపలికి వెళతాం అని జగతి-మహేంద్రలని ఉద్దేశించి దేవయాని అంటే దానికి రిషి అప్పుడేనా పెద్దమ్మా డాడ్ కి గిఫ్ట్ ఇవ్వలేదంటూ ఏదో చెబుతాడు. అక్కడున్నవారంతా షాక్ అవుతారు. ధరణి, వసుధార ముఖాలు సంతోషంతో వెలిగిపోగా దేవయాని ముఖం మాత్రం మాడిపోతుంది. అసలు అక్కడ ఏం చెప్పాడో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











