Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన రిషి.. సంభ్రమాశ్చర్యంలో మహేంద్ర-జగతి?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజు గ్రాండ్ గా మినిస్టర్ సహాయంతో అరేంజ్ చేస్తాడు రిషి. పుట్టినరోజు వేడుకలకు సర్వం సిద్ధం కాగా అతిధుల కోసం వెయిట్ చేస్తూ ఉండగా గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎలా చెప్పిస్తాను

ఎలా చెప్పిస్తాను

మిస్టర్ సన్మానానికి , మహేంద్ర బర్త్ డే కి ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉండగా హ్యాపీ బర్త్ డే డాడ్ అనే బోర్డ్ వసుధార సెట్ చేస్తుండగా... డాడ్ లో డి అనే లెటర్ కిందపడిపోతుంటే వచ్చి పట్టుకున్న రిషి డాడ్ అనే అక్షరాన్ని కిందపడనివ్వను, నా నుంచి దూరం కానివ్వను వసుధార అని తిరిగి అతికిస్తాడు. అయితే వసుధార ఈ బర్త్ డే ఇక్కడ చేయడం, మినిస్టర్ కాలేజీకి రాకుండా ఇంటికి రావడం ఏంటి..నాకేం అర్థం కావడం లేదని అంటే దానికి రిషి కొన్ని అర్థం కాకపోయినా మనకు బావుంటాయి కదా అంటాడు.

అయితే వసుధార కానీ మీరు ఏదో చేశారనిపిస్తోంది కానీ ఏం చేసి ఉంటారో నాకు అర్థం కావడం లేదని అంటుంది. అంటే రిషి ఏం జరిగి ఉండొచ్చని అడిగితె మీరేమైనా మినిస్టర్ గారితో కాలేజీకి రావద్దు, ఇంటికి వస్తానని చెప్పించారా అంటే ఆమె అంత సులభంగా పట్టేస్తుందని ఊహించక షాకయిన రిషి, అలా జరిగిందంటావా...అలా ఎలా చెప్పిస్తాను అని కౌంటర్ వేస్తాడు.

వెటకారంగా

వెటకారంగా

దానికి వసుధార మహేంద్ర సార్ ని బర్త్ డే పార్టీకి రమ్మని ఒప్పించాలంటే ఏం చేయాలని అడిగారు కదా అంటే అవును, దానికి నేను తప్ప ఎవరూ సమాధానం చెప్పుకోలేరన్నావ్ కదా చెప్పుకున్నాను సమాధానం అంటూ కౌంటర్ వేస్తాడు. ఇక మరోపక్క పార్టీకోసం కారులో బయలుదేరిన జగతి కారు డ్రైవ్ చేస్తూ ఉండగా మహేంద్ర పక్కన కూర్చుని ఉంటాడు. జగతి హ్యాపీ బర్త్ డే మహేంద్ర అంటే నువ్వు ఇప్పటి వరకూ 96 సార్లు హ్యాపీ బర్త్ డే చెప్పావ్... ఈ బర్త్ డే ఏంటో నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా అలా కుదిరిపోయిందని అంటాడు.

ఇక ఈవెంట్ వద్ద అందరూ మినిస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ముందు జగతి-మహేంద్ర కారు వచ్చి ఆగుతుంది. వాళ్లు ఇద్దరూ అలా కలిసి వస్తుంటే అందరూ సంతోష పడుతుంటే దేవయాని మాత్రం మొహం ముడుచుకుంటుంది. అందరూ మహేంద్రకు హ్యాపీ బర్త్ డే అని సంతోషంగా చెబుతుంటే...పుట్టిన రోజు శుభాకాంక్షలు అని వెటకారంగా చెబుతుంది దేవయాని.

ఒకేసారి కేక్ నోటిదగ్గర

ఒకేసారి కేక్ నోటిదగ్గర

మీ ఆశీస్సులు నాకెప్పుడూ కావాలని మహేంద్ర కూడా తేడాగానే అంటాడు. అందరూ చెబుతున్నా రిషి మాత్రం అలా చూస్తూ నిల్చుంటాడు. అందరూ చెప్పడం అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి హత్తుకుని హ్యాపీ బర్త్ డే చెప్పి ఒక గిఫ్ట్ ఉందని అంటాడు. ఈ పుట్టిన రోజుకి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానని అంటే వీడు నాకు తెలియకుండా ఏం గిఫ్ట్ కొన్నాడు అని ధరణి వెళ్లబోతుంటే దేవయాని కోపంగా చూడడంతో వసుధార ఆమెను తీసుకెళ్లిపోతుంది..ఇంతలో మినిస్టర్ రావడంతో అంతా వెళ్లి ఆహ్వానిస్తారు.

ఇక ఆ తరువాత కేక్ కట్ చేసిన మహేంద్ర కు రిషి-జగతి ఇద్దరూ ఒకేసారి కేక్ నోటిదగ్గర పెడతారు. ఏది ఫస్ట్ తింటాడో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తుండగా జగతి తన చేతిని కిందకు దించుతుండగా పట్టుకున్న మహేంద్ర.. భార్య-కొడుకు చేతిలో కేక్ ఒకేసారి తింటాడు.

బర్త్ డే గిఫ్ట్

బర్త్ డే గిఫ్ట్

జగతి మనసులో మీ నాన్న పుట్టిన రోజుని నువ్వు అనుకున్న విధంగా జరుపుకున్నావ్ అనుకుంటుంది. ఇక అక్కడ పుట్టిన రోజు సందడి నెలకొంటుంది. ఇక మహేంద్ర మనసులో ఎన్నో ఏళ్ల తర్వాత జగతితో మీతో కలసి పుట్టిన రోజు జరుపుకున్నాను...థ్యాంక్యూ రిషి... నువ్వేదో గిఫ్ట్ ఇస్తానన్నావు కానీ ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందని అనుకున్నాడు.

ఇక వెళ్లాల్సిన వాళ్లుకూడా వెళితే మనం లోపలకు వెళదాం అని దేవయాని అంటే అప్పుడేనా పెద్దమ్మా...డాడ్ కి నేను బర్త్ డే గిఫ్ట్ ఇంకా ఇవ్వలేదు కదా అంటూ రిషి ఆపుతాడు.

మీ భార్యతోనే ఇక్కడ ఉండండి

మీ భార్యతోనే ఇక్కడ ఉండండి

పెద్దమ్మ నా జీవితంలో ఓ దేవత...పెద్దమ్మ లేకపోతే నాకు జీవితమే లేదని అంటూ ఈ భూమ్మీద నాకున్న ఒకే ఒక ఆత్మ బంధువు, నా సర్వస్వం మా డాడ్...బాల్యంలో జరగకూడనిది జరిగింది. అందరిలా కాకుండా నా బాల్యం కొత్తగా మొదలైంది..అప్పుడు డాడ్ , పెద్దమ్మ ఇద్దరే నాకు రెండు కళ్లులా మారారని అంటాడు. అలా తండ్రి గురించి చెబుతూనే డాడ్ మీరిక్కడే ఉండాలి.

మీరిక్కడ ఉండాలంటే మీకు ఏం కావాలో నాకు తెలుసు... మీరు అనుకున్నట్టు, మీ మనసు కోరుకున్న విధంగానే మీరిక్కడ ఉండండి... మీ భార్యతోనే ఇక్కడ ఉండండి అని అంటాడు. అలా అనడంతో అందరూ ఆనందపడితే దేవయాని బిత్తర పోతుంది. అలా తాజా ఎపిసోడ్ ముగిసింది. గుప్పెడంత మనసు కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X