Guppedantha Manasu: రిషికి హగ్ ఇచ్చిన వసుధార.. ఇంతలో జగతి మిస్సింగ్.. అసలు ఏం జరిగింది?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజు గ్రాండ్ గా మినిస్టర్ సహాయంతో అరేంజ్ చేస్తాడు రిషి అలా. పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వచ్చిన మహేంద్రను ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు. డానికి మహేంద్ర సహా అందరూ షాక్ అవుతారు. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆలోచిస్తూ

ఆలోచిస్తూ

అయితే అసలు వద్దు చేసుకోను అని చెప్పిన తన తండ్రి మహేంద్ర పుట్టినరోజుని తను అనుకున్న విధంగా సెలబ్రేట్ చేసిన రిషి...గిఫ్ట్ ఇస్తానని చెప్పి మీ భార్యతో మీరిక్కడ ఉండండి అని కోరగా ఆ సమయంలో అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతుండగా...దేవయాని మాత్రం కోపంతో రగిలి పోతుంటుంది.

అయితే దేవయాని వచ్చి ఏంటి నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అనడంతో... నా ఆనందమే మీకు ముఖ్యం కదా పెద్దమ్మా మీరు కాదనరు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా అని అంటాడు రిషి. రేపటి వరకు టైమ్ ఇస్తున్న డాడ్ మీరే నిర్ణయించుకోండి అని చెబుతాడు. ఇక అలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినా తరువాత రిషి లాన్ లో కూర్చుని, జగతి మేడపై నిల్చుని పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటారు.

పెద్ద పార్టీ చేయాలని

పెద్ద పార్టీ చేయాలని

ఈ క్రమంలో జగతి దగ్గరకు వచ్చిన దేవయాని రిషి ఉండమంటే ఉండిపోతావా...ఉండేందుకు ఏ అర్హత ఉంది నీకు అని అడిగితే జగతి ఇంట్లో ఉండాలంటే అర్హతలు కావాలి...మనసులో ఉండాలంటే ఎవ్వరూ ఏ అర్హతలు అడగరు కదా అని మనసులో అనుకుంటుంది, మరోపక్క మహేంద్ర-ఫణీంద్ర రూమ్ లో కూర్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉంటారు.. ఈలోపు గౌతమ్ పెద్దమ్మా..రిషి గొప్ప పని చేశాడు కదా అంటే అది విని ధరణి నవ్వుకుంటుంది.

వీడి ఆలోచనలు, మైండ్ అద్భుతం...ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద పార్టీ చేయాలని గౌతం అంటే ఏం మాట్లాడుతున్నావ్, రిషి మారడం వెనుక కొన్ని అదృశ్య శక్తులున్నాయని అంటుంది.

ఆగమని

ఆగమని

కొన్ని శక్తులు-వ్యక్తులు కళ్లముందు కనిపిస్తున్నా ఏమి చేయలేం...ఎందుకు గౌతమ్ పరాయివాళ్ళు పక్కదారి పట్టించే కిరాయి వాళ్ళు చాలామంది ఉన్నారు...నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్ వి గౌతమ్..మధ్యలో వచ్చిన వాళ్లు మన రిషికి బాగా ఫ్రెండ్స్ అయ్యారని నూరి పోసే ప్రయత్నం చేస్తుంది.

దానికి గౌతమ్ మన రిషికి ఫ్రెండ్సా...ఛాన్సే లేదని అంటూ వసు రాకని చూసి నువ్వెప్పుడు వచ్చావ్...ఏం కావాలి..నేను ఇచ్చేవాడిని కదా అంటాడు. దానికి వసుధార చాలామంది పక్కవాళ్లని డిస్టబ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కానీ నేను అలా కాదంటూ వాటర్ తీసుకుని వెళ్లిపోతుంది బయటకు వెళ్లేందుకు బయలుదేరిన వసుధారని చూసిన రిషి ఆగమని అంటాడు.

రిషిని హగ్ చేసుకుని

రిషిని హగ్ చేసుకుని

దీంతో వసుధార ఎవరికీ చెప్పకుండా వెళదాం అనుకున్నాను రిషి సార్ ఇక్కడే ఉన్నారా అనుకుంటుంది. రిషి ఎక్కడికి వసుధార అని అడిగితే వెళుతున్నాను సార్ అంటుంది. దానికి రిషి ఉండొచ్చు కదా అంటే వసుధార ఎప్పటికైనా వెళ్లాలి కదా అంటుంది. రేపటి వరకు ఉండాలి అని నాకు ఉంది సార్..మీరు మహేంద్ర సార్ కి కాదు మేడంకి గిఫ్ట్ ఇచ్చారు... మేడం ఈ ఇంటికి రావాలని ఎన్నాళ్లనుంచో నేను ఎదురుచూశానని అంటుంది.

ఇక రిషి దింపడానికి వస్తే అలా కార్లో వెళుతూ రిషిని చూస్తూ...అవే మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తరువాత గుడ్ నైట్ చెప్పి లోపలకు వెళ్లిపోతూ...సడెన్ గా వెనక్కి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది...రిషి షాక్ లో అలాగే నిల్చుని ఉండిపోతాడు.

జగతి మిస్సింగ్

జగతి మిస్సింగ్

ఏంటిది అని అడిగితే...గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతుంది. మరోపక్క ఇంటి దగ్గర జగతి నిద్రపోకుండా ఆలోచిస్తుంది. ఇంతలో కారు దిగిన రిషి...వసు హగ్ ని గుర్తుచేసుకుంటూ జగతిని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతుంటాడు. జగతి మాట్లాడాలి అని అంటూ మిమ్మల్ని సార్ అని పిలవడానికి ఇది కాలేజీ కాదు..రిషి అని పిలిచే చనువు లేదు... ఇది ఇల్లే అయినా నా ఇల్లు కాదని చాలామంది అనుకుంటున్నారని చెబుతూనే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తానని అంటుంది.

మహేంద్రతో కలసి నన్ను ఇంటికి రమ్మన్నావు, నువ్వు అని పిలిచే చనువు నాకుందని నేను అనుకుంటున్నాను..అందుకే నువ్వు అని పిలుస్తున్నానని అంటుంది. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు.. నన్ను ఏ హోదాలో ఈ ఇంటికి రమ్మంటున్నావు అని అడుగుతుంది. ఇక అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం మహేంద్ర పొద్దున్నే జగతి కోసం వెతుకుతుంటాడు... ఆ విషయం తెలుసుకున్న దేవయాని... జగతి ఇంట్లో కనిపించడం లేదని-రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందని ఇలా చేస్తే ఎవరిని గౌరవించినట్లు అంటూ రచ్చ మొదలుపెట్టగా ఈలోపు వసుధార ఇంటికి రావడం కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X