Guppedantha Manasu: మిస్సింగ్ అనుకునేలోపే దిమ్మతిరిగే ట్విస్ట్.. ఇక దేవయానికి రోజూ చుక్కలే!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజు గ్రాండ్ గా మినిస్టర్ సహాయంతో అరేంజ్ చేస్తాడు రిషి అలా. పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వచ్చిన మహేంద్రను ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు. డానికి మహేంద్ర సహా అందరూ షాక్ అవుతారు. అయితే ఎవరికి వారు ఆలోచించుకుంటూ ఉండగానే గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిరూపించుకోండి

నిరూపించుకోండి

జగతి నన్ను ఏ హోదాలో మీ ఇంటికి రమ్మంటున్నావు అని రిషిని అడుగుతుంది. దీంతో రిషి డాడీ అంటే నాకు ఇష్టం డాడీకి మీరంటే ఇష్టం. మన ఇద్దరి మధ్యలో డాడీ నలిగిపోతున్నారు. అలా కావడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను అని రిషి అంటాడు. అలాగే మాట్లాడుతూ మేడమ్.. నేను మా డాడ్ కోసం అన్నీ చేయగలను ఒక్కటి తప్ప అంటే నన్ను అమ్మ అని పిలవడం తప్ప అని జగతి మనసులో అనుకుంటుంది. అది ఈ జన్మలో జరగదు. నేను మా డాడ్ కోసం ఒక మెట్టు దిగాను. మీరు డాడ్ మీద గౌరవంతో తగ్గుతారనే ఆశిస్తున్నాను.. రావాలి అనుకుంటే ఏ హోదాలో రావాలనే దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. డాడ్ మీద మీకు ఎంత గౌరవం ఉందో మీరు నిరూపించుకోండి..' అంటూ సమాధానం ఇస్తాడు రిషి.

రచ్చ మొదలు పెడుతుంది

రచ్చ మొదలు పెడుతుంది

అయితే ఇది అంతా మహేంద్ర పై నుంచి వింటూనే ఉంటాడు. అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ.. ఆగి జగతి వైపు చూసిన రిషి.. ‘నా దృష్టిలో ఎలాగో ఒక మంచి తల్లి కాలేకపోయారు.. ఒక మంచి భార్య అయినా అవుతారని ఆశిస్తున్నాను..' అనేసి వెళ్లిపోతాడు. జగతి అలా నిలబడిపోయి ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది.మహేంద్ర మీద నాకు ఎంత ప్రేమ ఉందో పరీక్ష పెడుతున్నావా? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి లోకి నెట్టేసావు అని మనసులో అనుకుంటూ ఆమె బాధలో మునిగిపోతుంది. ఇక జగతి తర్వాత రోజు ఉదయం ఇంట్లో కనిపించదు. మహేంద్రతో కలిసి ఫ్యామిలీ అంతా కంగారు పడతారు.అది కాస్తా దేవయాని చెవిన పడడంతో దేవయాని కావాలనే రచ్చ మొదలు పెడుతుంది.

లగేజ్‌తో సహా

లగేజ్‌తో సహా

‘రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. పాపం రిషి అంత చక్కగా చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిందంటే ఎవరికి గౌరవం ఇచ్చినట్లు?' అంటూ రచ్చ రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఎలా అయినా ఆమెను కుటుంబ సభ్యుల ముందు బాడ్ చేయడానికి ప్రయాణిస్తుంది. సరిగ్గా అప్పుడే గుమ్మం ముందు వసు, జగతి ఇద్దరూ లగేజ్‌తో సహా నిలబడి ఉంటారు. జగతిని చూసిన మహేంద్ర కంగారు పడుతూ.. ‘జగతి నాకైనా చెప్పి వెళ్లొచ్చు కదా అంటాడు. ఇక జగతి ఇంటికి వచ్చేసిందని అర్ధమైన దేవయాని ముఖం అయితే మాడిపోతుంది. రాత్రి వసును చూడాలనిపించి వెళ్లాను అని అంటుంది. ఇక జగతి లోపలకు వస్తుండగా.. ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు.

కళ్ల ముందే ఉంటారు

కళ్ల ముందే ఉంటారు

దేవయాని మాత్రం మొత్తానికి ఉండడానికే వచ్చేసింది అని బాధ పడుతుంది. ఇక వసు రిషి సార్ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక వసు రిషి సార్ మనసులో ఏమైనా అనుకుంటున్నారా అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. రిషి పైకి వెళ్లి మేడం వెళ్లిపోయిందని తెలియగానే డాడ్ కూడా వెళ్లిపోతారేమోనని చాలా భయపడ్డాను.... ఇక నుంచి అంతా బాగుంటుంది. రోజు డాడ్ నా కళ్ల ముందే ఉంటారు..' అని ఆనంద పడతాడు. మరోపక్క వసు అక్కడి నుంచి కాలేజ్‌కి వెళ్తుంది. కాసేపటికి రిషి కూడా కాలేజ్ కి వెళ్తాడు. అప్పుడే రిషికి రాత్రి వసు తనని హత్తుకున్న సీన్ గుర్తు చేసుకుని.. ‘ఒకప్పుడు థాంక్స్ ఒప్పుకోమని దూరంగా పైకి ఎక్కి అరిచి చెప్పింది..

Recommended Video

KGF Chapter 2 Inayath Khaleel ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే| Filmibeat Telugu
లంచ్ చేద్దాం పదా అని

లంచ్ చేద్దాం పదా అని


ఇప్పుడు దగ్గరకు వచ్చి హత్తుకుని చెప్పింది. వసుధారకు భయం తగ్గిందా? లేక మా మధ్య దూరం తగ్గిందా?' అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వసు కూడా కాస్త దూరంలో కూర్చుని రిషి గురించే ఆలోచిస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నారు రిషి సార్ అంటూ మనసులోనే సంబరపడుతోంది. ఇక రిషి అయితే వసుని దూరం నుంచి చూసి.. ‘ఈ పొగరు ఏం ఆలోచిస్తుంది. వాళ్ల మేడం గెలిచింది.. నేను ఓడిపోయాను అని ఏమైనా ఆలోచిస్తుందా?' అనుకుంటూ వసు దగ్గరకు వెళ్తాడు. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించగా తరువాయి భాగం లో రిషి వసు చేతిలో బుక్ లాక్కొని లంచ్ చేద్దాం పదా అని వసుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. కానీ వసుకు ఏమీ అర్ధం కాదు. ఇక తరువాతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X