Guppedantha Manasu: నేనెందుకు స్పెషల్ అంటూ మొహం మీదే అడిగేసిన వసు.. ఓపెన్ అయిపోయిన రిషి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజు గ్రాండ్ గా మినిస్టర్ సహాయంతో అరేంజ్ చేస్తాడు రిషి అలా. పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వచ్చిన మహేంద్రను ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు.

ఇక జగతి ఇంట్లో ఉండిపోవడానికి డానికి రావడంతో మహేంద్ర సహా అందరూ షాక్ అవుతారు. అయితే ఎవరికి వారు ఆలోచించుకుంటూ ఉండగా గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 నోరు ఎత్తకుండా

నోరు ఎత్తకుండా

రిషి తీసుకున్న ఆలోచనకు రిషి ను పదే పదే పొగుడుతూ ఉంటుంది వసు. దీంతో రిషి ఇకపై ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇక వసు అలవాటైపోయింది లే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు జగతి అందరికీ లంచ్ బాక్స్ సర్దుతూ ఉంటుంది.

ధరణి ఆమెకు సహాయం చేస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని వచ్చి..అందరికీ తీసుకు వెళ్ళడం అవసరమా..? నువ్వు తీసుకుని వెళ్తే రిషి తినడు అంటూ రెచ్చ గొడుతుంది. డానికి జగతి అక్కయ్యా నేను వచ్చేశానుగా.. ఇక ఇంటి పనుల్లో కూడా నేను మీకు సహాయం చేస్తాను.. మీరు రెస్ట్ తీసుకోవడం మంచిది.. అవసరం అయితే రిటైర్ అయిపోండి.. నేను చూసుకుంటాను.. అయినా రిషి ఎక్కడ మాతో కలిసి తింటాడనేగా మీ భయం.. నేను లంచ్ తీసుకుని వెళ్తే.. ఈ రోజు తినడు, రేపు తినడు, ఎల్లుండి తినడు.. ఆ తర్వాతైనా తినొచ్చు.. అంటూ దేవయానికి నోరు ఎత్తకుండానే కౌంటర్ ఇస్తుంది.

జగతి పిలిస్తే

జగతి పిలిస్తే

ఇక ఈ మాటలు దేవయాని జీర్ణించుకోలేక ఇంటి పనుల విషయంలో నువ్వు కలుగ చేసుకోవద్దు అని అంటుంది. ధరణితో ఆమె వచ్చింది కదా అని రెచ్చిపోక అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరిపక్క వసు రిషి క్లాసులో తల పట్టుకుని కూర్చుంటుంది. గమనించిన రిషి.. తలనొప్పి వస్తుందా? ఈ క్లాసు మళ్లీ చెబుతాను.. క్యాటిన్‌కి వెళ్లి టీ తాగు.. వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ బలవంతంగా పంపించేస్తాడు.

ఇక వసు బయటికి వచ్చేస్తుంది. లంచ్ టైమ్‌లో.. జగతి, వసు ఎదురుపడతారు. వసు తిందాంరా అని జగతి పిలిస్తే ఫ్యామిలీ అంతా కలిసి తింటున్నప్పుడు మధ్యలో నేనెందుకు అని వసు మనసులో అనుకుని.. తింటానులే మేడమ్.. క్యాంటిన్‌లో తినేస్తాను అంటుంది. అయితే జగతి.. వసు నువ్వు ఉదయం కూడా టిఫిన్ చేయలేదు.. ఇప్పుడైనా టైమ్‌కి తిను అని చెబుతుంది.

కాసేపు ఉన్నాక

కాసేపు ఉన్నాక

ఆ మాటలు విన్న రిషి. ఈ పొగరు టిఫిన్ కూడా తినలేదా అనుకుంటాడు. ఇక రిషి క్యాబిన్‌లో ఉండగా.. సార్ మిమ్మల్ని ఫణీంద్ర గారు పిలుస్తున్నారు అంటూ ఓ వ్యక్తి చెబుతాడు. సరేనంటూ రిషి అక్కడికి వెళ్లేసరికి.. మహేంద్ర, ఫణీంద్రలకు జగతి వడ్డిస్తూ ఉంటుంది. ఫణీంద్ర అసలైన సంతోషం ఇదే కదా అంటూ ఉంటాడు .కానీ రిషి అది చూసి నేను మళ్లీ వస్తాను.. కాసేపు ఉన్నాక తింటాను అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో జగతి కాస్త బాధపడుతుంది. అమ్మా జగతి వాడి భోజనం వాడి క్యాబిన్‌కి పంపించేయ్ అంటాడు ఫణీంద్ర. సరే బావగారు అని అలానే చేస్తుంది.

వద్దు అన్నా ఆగవు

వద్దు అన్నా ఆగవు

ఇక బయట వసు ఓ చోట ఒంటరిగా కూర్చుని ఉంటే.. రిషి వెళ్లి.. తినకుండా ఇక్కడేం చేస్తున్నావ్ అంటాడు. క్యాంటిన్‌లో చాలా మంది ఉన్నారు.. కాసేపు ఆగి తింటాను అంటుంది. అయితే ఏదో అడిగితే తిండి గురించి లెక్చర్ ఇస్తుంది. ఇంతలో అటెండర్ వచ్చి.. సార్ భోజనం రెడీ సార్ అని పిలిస్తే రిషి ఆమె గురించి వెటకారం ఆడతాడు.

చివరికి పదా తిందాం అని వసుని కూడా తీసుకుని వెళతాడు. ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించగా కమింగ్ అప్‌లో వసు, రిషి ఇద్దరూ క్యాబిన్‌లో తింటూ ఉంటారు. అప్పుడే వసు రిషితో.. ఒక ప్రశ్న అడగొచ్చా సార్? అని అడుగుతుంది. సరే కానీ వద్దు అన్నా ఆగవు కదా అడుగు అని అంటాడు రిషి.

అందరి లాంటి అమ్మాయివి కాదు

అందరి లాంటి అమ్మాయివి కాదు

అప్పుడే జగతి, మహేంద్ర క్యాబిన్ దగ్గరకు రాబోయి గుమ్మం దగ్గరే పక్కన ఆగిపోయి ఏం మాట్లాడుకుంటూ ఉంటారా అని చూస్తూ ఉంటారు. అదే సమయంలో మీకు నా మీద ఎందుకు అంత శ్రద్ధ సార్ అని అగుగుతుంది. దీంతో మనవాడి బ్రహ్మాండం బద్దలయ్యే ప్రశ్న వేసింది కదా అని మహేంద్ర అంటాడు మల్లేఎ కాలేజ్‌లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు.. వాళ్లు ఎవరికీ లేని లక్షణాలు ఏమున్నాయి సార్ నాలో? అని అడుగుతుంది.

డానికి రిషి వసుధార నువ్వు అందరి లాంటి అమ్మాయివి కాదు.. ఇలాంటి అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు.. అందుకే అంటూ అంటూ ఏదో చెప్పబోతుండగా ముగించారు. దీంతో చాటుగా వింటున్న జగతి దంపతులు ఎంతో ఆనంద పడతారు. ఇక తర్వాత ఎపిసోడ్ ఎలా ఉండనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X