Guppedantha Manasu: వసుధారకు ఐలవ్‌యూ చెప్పిన గౌతమ్, ఇంతలోనే రిషీ ఎంట్రీతో అంతా షాక్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజున మహేంద్రను ఇక్కడే ఉండిపో అని రిషి అడుగుతాడు. ఇక దీంతో జగతి-మహేంద్ర రిషి ఇంటికి షిఫ్ట్ అవుతారు. వసు కొత్త రూమ్ చూసుకుంటుంది. అలా గత ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వసు కోసం పరితపించి
రిషి తన బెడ్‌రూంలోనే కూర్చొని వసుధార గురించి ఆలోచిస్తున్న క్రమంలో మహేంద్ర, జగతిల కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఏమైనా వచ్చిందా ? వస్తే కనపడుతుంది కదా అని భావించి పరుగు పరుగున వెళ్లి చూస్తాడు.. కానీ మహేంద్ర, జగతి మాత్రమే కనిపిస్తారు. మహేంద్ర అది కనిపెట్టి జగతీ... మన పుత్ర రత్నం వస్తున్నాడు... వసుధార గురించి అడుగుతాడేమో నువ్వేమీ చెప్పకని అంటే ఎందుకలా అని ప్రశ్నిస్తుంది.
నా ఊహ కరెక్ట్ అయితే మన కారు సౌండ్ విని వచ్చుంటాడు.. వసుధార గురించి ఆరా తీయడానికి ఏదేదో అడుగుతాడు. చూడు అనడంతో రిషి వచ్చి నిద్ర పట్టడం లేదని అంటాడు. మీరు ఎక్కడికి వెళ్లారని అంటే ఎక్కడికో బయటకు వెళ్లి తిని వచ్చామని అబద్దం చెబుతాడు. వసుధార వీళ్లతో రాలేదంటీ? అని ఆలోచిస్తూనే ఉంటాడు కానీ అడగాలని అనుకోడు. నిద్రొచ్చేస్తుంది పొద్దునే మాట్లాడుకుందాం అని చెప్పి లోపలి వెళ్ళిపోతారు మహేంద్ర దంపతులు.

సీరియస్‌గా
జగతి ఏంటి మహేంద్ర నువ్వు.. రిషిని అలా ఆట పట్టిస్తున్నావ్ తప్పు కదా అంటే మహేంద్ర గట్టిగా నవ్వి జగతి మన ఇద్దరం వసు దగ్గరకు వెళ్లొచ్చాం.. వసు ఎక్కడ ఉందో ఏంటో అని ఆరాటపడుతున్నాడు అంటే అలాంటప్పుడు వసుధారకే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా అని ఆమె అంటుంది. ఐతే మహేంద్ర బాధపడతారని మనం సహాయం చేస్తే పిల్లలు నేర్చుకోలేరుని అంటాడు.
దానికి మహేంద్ర రిషి ఇక్కడికి వస్తాడు కానీ మన డోర్ కొట్టలేడు, తట్టలేడు... అలాని.. వసుధార గురించి తెలుసుకోకుండా ఉండనూ లేడని అంటాడు. మరి వసూ ఫోన్ తీయడం లేదో.. పంతానికి పోయి వీడు ఫోన్ చేయడం లేదో కానీ ఇలా చేస్తున్నాడని అంటుంది. తలుపు తెరిచి చూసే సరికి రిషి నిజంగానే అక్కడ ఉంటాడు. ఏదో ఆలోచిస్తున్న క్రమంలో వాళ్ళని చూసి ఏం చెప్పాలో రిషికి అర్థం కాదు. అక్కడ ఏం చేస్తున్నారో జగతి, మహేంద్ర చెప్పలేరు. ఈ పరిస్థితిలో సీరియస్‌గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోతుంటాడు రిషి.

ఫోన్ తీసుకుని చూస్తే
మహేంద్ర పిలవగా వసుధార ఎక్కడ ఉందని అడిగావా? అంటే మీరు చెప్పరా అని అడుగుతాడు. మహేంద్ర చెప్పను, నీకు లొకేషన్ పంపిస్తా. నువ్వే వెళ్లి వెతుక్కో అని అంటాడు. పొద్దున్నే వెళతాడని అనుకుంటే కాదు.. ఇప్పుడే వెళ్తాడని అంటాడు. అలా తన ఫోన్ నుంచి వసుధార ఉన్న లొకేషన్ పంపిస్తాడు. ఇక రిషి అక్కడికి బయలుదేరతాడు.
ఈలోపు వసు తన రూం నుంచి హైదరాబాద్‌ను చూసి ఇదే నా సామ్రాజ్యం. ఇదే నా ఇల్లు. అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. వెంటనే ఫోన్ గుర్తుకు వచ్చి, అసలు నా ఫోన్ ఏమైంది అసలు మోగనే లేదు. అనుకుని ఛార్జింగ్‌లో పెట్టి మర్చిపోయాను కదా అని గుర్తుకు తెచ్చుకుని వెళ్లి ఫోన్ తీసుకుని చూస్తే రిషి సార్ ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏంటి అని కంగారు పడుతుంది.

వసు రూమ్ కి రిషి
ఇక ఇంతలో రిషి కారు.. వసుధార రూం వద్దకు వచ్చి ఆగుతుంది. కానీ వసుధార తన ఫోన్ నుంచి రిషికి ఫోన్ చేస్తుంది. అవును అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కాల్ కట్ చేస్తుంది. చివరికి కాల్ లిఫ్ర్ చేసి మాట్లాడుతూ ఉండగా నా వెనుక ఉన్నారనిపిస్తోంది అంటూ వెనక్కు చూడడంతో వెనుక కనపడతాడు.
ఇక వసుధార తన రూమ్ లోపలోకి తీసుకు వెళ్లి చూపిస్తుంది. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత వెనుతిరుగుతాడు రిషి. ఇంతలో మహేంద్ర ఏంటీ రిషి? ఎక్కడికి వెళ్లావు? నీ స్పెషల్ స్టూడెంట్‌కి స్పెష్ క్లాస్ ఏమైనా తీసుకుంటున్నావా? అని అడగడంతో ఏమంటున్నారు మీరు? అని అంటాడు.

ఐలవ్‌యూ
దీంతో మహేంద్ర లొకేషన్ ఈజీగానే దొరికిందా... ఆ.. దొరుకుతుందిలే... కానీ మనలో ఉన్న మనసు మాత్రం మనకు అంత ఈజీగా దొరకదని అంటాడు. ఇక ఈ మాటలు విన్న జగతీ అస్తమానం మనం వాళ్లిద్దరి గురించి మాట్లాడుకోవడం అంత బాలేదు అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే తాజా ఎపిసోడ్ పూర్తయింది.
ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార దగ్గరకు గౌతమ్ వచ్చి మాటామాట కలిపి సడన్ గా రోజా పవ్వు ఇచ్చి ఐలవ్‌యూ చెప్తాడు. ఇంతలో రిషి వచ్చి పువ్వును కట్ చేస్తాడు, ఎవడురా అని అనేంతలోపు రిషి అని తెలియడంతో షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











