Guppedantha Manasu: హోలీ ఈవెంట్లో ప్రేమ రంగులు.. తడిసిముద్దైన రిషి-వసుధార..పాపం దేవయాని!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. అయితే మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం మీద రిషి అందరికీ షాక్ న్యూస్ చెప్పాడు. అలా చెప్పడంతో అందరూ ఆనంద పడుతూ ఉండగా దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. అలా గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రిలాక్స్ అవ్వమని
కాలేజీలో జగతి మళ్లీ అడుగుపెట్టడం చూసి దేవయాని తన బాధ అంతా రిషి, ఫణీంద్రను లోపలికి తీసుకువెళ్లి మరీ వాళ్ళ ముందు వెళ్లగక్కుతూ ఉంటుంది. నా పెంపకంలోనే లోపం ఉందేమో, నాదే తప్పేమో అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉండగా రిషి మీరు అలా మాట్లాడకండి, మీ పెంపకంలో లోపం లేదు..కానీ నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది..డీబీఎస్టీ కాలేజీ పరువు కోసం ఆమెను మళ్ళీ పనిలోకి తీసుకున్నాను, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ కోసమే తనని తీసుకున్నాను, నా దృష్టిలో తను కేవలం జగతి మేడం మాత్రమే...మీరు అనుకున్నట్టు నేను మారలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా వినకపోవడంతో ఫణీంద్ర నేను చూసుకుంటాను నువ్వు రిలాక్స్ అవ్వమని చెబుతాడు.

తప్పదులే అని
ఇక బయట ఉన్న గౌతమ్, వసుధార మాట్లాడుకుంటూ ఉండగా రిషి సార్ మంచి నిర్ణయం తీసుకున్నారని వసుధార అంటే అవునని అందరం అపార్ధం చేసుకున్నా వాడు మంచే చేశాడని గౌతమ్ అంటాడు. ఇదే మంచి టైం అని భావించి ఓ చిన్న పార్టీ చేసుకుందాం అంటాడు గౌతమ్. ఏ పార్టీ అంటే స్వీట్ పార్టీ అయితే బెస్ట్ అని వసుధార అంటుంది. మురిసిపోయిన గౌతమ్ మొత్తానికి వసుని పార్టీకి ఒప్పించాను, ఎక్కడికో చోటకు వెళ్దాం అంటూ ఉండగా బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసి చేతిలో పెట్టి ఇదే స్వీట్ పార్టీ అని అంటుంది. పోనీలే పార్టీ పోతే పోయింది వసుధారని బైక్ పై ఇంట్లో డ్రాప్ చేస్తా అనుకుంటూ ఉండగా రిషి పెద్దమ్మ, పెదనాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అతనికి మెసేజ్ పంపిస్తాడు... అది చూసి గౌతమ్ ఇక తప్పదులే అని వదిలేసి వెళతాడు. ఇక ఇదే సమయంలో రిషి, వసుధార కలుసుకుంటారు.

మీతో మాట్లాడేందుకు
నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ వసుధార అంటే మీతో మాట్లాడేందుకు ఇక్కడ ఆగానని అంటుంది. మాట్లాడేందుకు ఇంకేముంది...అంతా హ్యాపీ కదా అంటే వసుధార మీరు గ్రేట్, మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు జెంటిల్మెన్ సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు అలాగే అంటావ్ కానీ ప్రాజెక్టు రద్దు చేసిన విషయం తెలియగానే ఎన్ని మాటలన్నావో అని దెప్పి పొడుస్తాడు. ఇక అదేమీ లేదని మీ గొప్పతనం ఏంటో ఇప్పుడు తెలిసిందని అంటుంది. ఇక రిషి వెళ్ళిపోతూ ఉండగా రిషి చేయిపట్టుకున్న వసుధార ఈ రోజు మీరు నాతో పాటు రావాల్సిందే అని చేయిపట్టి తీసుకెళుతుంటుంది. వద్దంటూనే ఆమె అలా తీసుకు వెళుతూ ఉండగా రిషి అనుసరిస్తారు. అలా ఆమె మీరు కారెక్కండి సార్ చెబుతాను అంటుంది.

పెద్ద తుఫాను వెలిసింది
ఇక మరోపక్క మహేంద్ర, జగతి కార్లో వెళుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, పెద్ద తుఫాను వెలిసింది అంటూ మహేంద్ర చెబుతాడు. నువ్వు ఏం మాట్లాడటం లేదేంటి.. నీకు సంతోషంగా లేదా..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంటే నీకు ఇష్టం లేదా అని అడిగితే జగతి కార్ ఆపమని కిందకు దిగి...మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం కానీ రిషి అంటే ప్రాణం.... తుఫాను వెలిసింది అని నువ్వంటున్నావు కానీ రిషి మనసులో ఎంత తుఫాను ఉందో అని అంటుంది. దానికి మహేంద్ర రిషి వ్యక్తిగత కోపంతోనో, మరో కారణంతోనో అప్పుడప్పుడు కొత్తగా ఆలోచిస్తాడు..అంతమాత్రాన ప్రతిదానికీ నువ్వు ఇలా బాధపడితే ఎలా...ఎప్పుడూ తల్లిలా కాదు అప్పుడప్పుడు లెక్చరర్ గా ఆలోచించమని అంటాడు. అంతేకాక రిషి నీ కొడుకు కాదు, స్టూడెంట్ అనుకో కొన్ని పరీక్షలు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే కానీ అర్థం కాదని అంటాడు.

వసు వెంట పడి మరీ
అంతేకాక రిషి బాధపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు, తనను తాను తెలుసుకుంటున్నాడని నేను అనుకుంటున్నానని అంటాడు. ఇక మరోపక్క రిషి కారుని ఓ గ్రౌండ్ లో ఆపించి వసుధార కిందకు దిగి గట్టిగా ఓ విజిల్ వేస్తుంది. ఆ దెబ్బకు చాలా మంది అక్కడికి వచ్చేస్తాడు. అలా హోలీ సందడి మొదలైనట్టు కనిపిస్తోంది. చేతుల్లోకి రంగులు తీసుకున్న వసుధార హ్యాపీ హోలీ అంటూ రిషి ముఖానికి రాస్తుంది. ముందు షాకైన రిషి వసు వెంట పడి మరీ రంగులు చల్లుతాడు. అలా వారిద్దరి మధ్య కొన్ని డ్యూయెట్స్ కూడా నడుస్తున్నాయి. అలా ఎపిసోడ్ ముగించారు.

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్
ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగితా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.98 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











