Guppedantha Manasu: రిషిని కౌలిగించుకున్న వసుధార.. పాపం గౌతం.. అసలు ఏమైందంటే?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం అయితే ఈ సీరియల్ మొత్తం మీద ఎక్కువగా వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ చూపిస్తున్నారు. మహేంద్ర పుట్టినరోజున మహేంద్రను ఇక్కడే ఉండిపో అని రిషి అడగడంతో జగతి-మహేంద్ర రిషి ఇంటికి షిఫ్ట్ అవుతారు. వసు కొత్త రూమ్ చూసుకుంటుంది. వసు కొత్త రూమ్ కి వెళ్లి వచ్చిన రిషిని తన తండ్రి మహేంద్ర ఏడిపిస్తాడు. అలా గత ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రిషిని కౌలిగించుకుని

రిషిని కౌలిగించుకుని

వసుధార కోసం తపించి పోయి ఎలా గొలా ఆమె సమాచారం అందుకుని ఆమె రూమ్‌కి వెళ్లిన రిషి... ఆమె మాటలకు చాలా ఇన్‌స్పైర్ అవుతాడు. రూమ్ గురించి ఆమె సంతోషంగానే ఉన్నా ఆమె బాధ పడుతుందనే ఉద్దేశంతో ఆమెకు ధుర్యం చెబుతూ అదే టైంలో స్టడీస్‌పై కాన్సెంట్రెట్ చేయాలని కొంచెం క్లాస్ కూడా పీకుతాడు. ఇంతలో తనకు ధైర్యం గురించి చెప్పొద్దని వసూ అంటే ధైర్యం అని... ధైర్యం అంటేనే వసూ అని ఆమె కూడా తన గురించి బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో కావాలని రిషి బొద్దింక అని అరవడంతో ఆమె ఇక టెన్షన్ తో భయపడి ఎగిరి గంతేసి రిషిని కౌలిగించుకుంటుంది.

రిషినే అడ్డం

రిషినే అడ్డం

ఇక ఏకాంతంలో కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోతారు. ఇక అక్కడితో ముగించి రిషి ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే రిషి లేచి ఎక్స్‌ర్‌సైజ్ చేస్తుంటాడు. అక్కడకు వచ్చిన గౌతమ్‌ తన కల గురించి చెబుతుంటే విసుక్కుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్రకు తన కల గురించి చెబుతాడు గౌతమ్. ఇలా జరిగింది అని ఊహించుకోమని చెప్పి గౌతమ్‌, రిషి, వసుధార మధ్య లవ్‌ ట్రాక్‌ గురించి చెప్తాడు.

గౌతమ్‌ కాలేజీలో వసుధారకు లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంటే ఇంతలో రిషి వచ్చి అతను ఇవ్వాల్సిన పువ్వు కట్ చేస్తాడు. ఆ కట్ అయిన పువ్వుతో లవ్ ప్రొపోజ్ చేయడంతో వసుధార గట్టిగా నవ్వుతుంది. ఎవర్రా నువ్వు అంటే అక్కడ రిషి ఉన్నట్టు చెబుతాడు.

కాఫీ బాగుందని

కాఫీ బాగుందని

ఇలా తన లవ్ కు అద్దం వస్తున్నాడని చెబితే అతనికి కూడా లవ్ ఉందేమో అని మహేంద్ర అంటే అబ్బే అలాంటిది ఏమీ లేదని అంటాడు. ఈ క్రమంలో గౌతమ్‌కు మహేంద్ర లవ్ విషయంలో హితబోధ చేస్తాడు. నువ్వు పాజిటివ్‌గా పని చేస్తే విలన్ పారిపోతాడాని ఎనర్జీ ఇవ్వడంతో రిషి కలుగుజేసుకొని డాడ్‌ వాడేదో చెప్తుంటాడు.. దానికి మీరు కూడా మూడ్‌ పాడుచేసుకుంటారెందుకని అంటాడు.

అలా రిషి వెళ్లిపోవడంతో మహేంద్ర కూడా నవ్వుకుంటాడు. ఈ క్రమంలోనే గౌతమ్‌ కూడా అక్కడి నుంచి జారుకుంటాడు. తర్వాత వంట గదిలో జగతో కాఫీ కలుపుకుని తాగాబోతుంటే ఇంతలో ధరణి వస్తుంది. జగతితో ధరణి కబుర్లు చెప్పుకుంటున్న తరుణంలోనే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య చిన్న మాటల యుద్ధం నడుస్తుంది. ఏం మాట్లాడుకున్నారు అంటే మీ గురించే అని అంటుంది. ఆ తరువాత దేవయానికి ధరణి కాఫీ ఇస్తుంది. అయితే ధరణి కాఫీ బాగుందని దేవయాని మెచ్చుకుంటుంది.

సెలవు అనుకుంటే

సెలవు అనుకుంటే

అయితే ఆ కాఫీ నేను చేశానని చెప్పి జగతి షాక్ ఇస్తోంది. అంతే కోపంతో ఊగిపోయిన దేవయాని... కొంచెం తగ్గి ఉండమని హెచ్చరిస్తుంది. దానికి జగతి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. రాత్రి ఎందుకు లేట్‌గా వచ్చారని దేవయాని అడిగితే దానికి బయట షికారుకు వెళ్లామని చెబుతుంది జగతి. మీరు కూడా బావగారితో అలా తిరిగి రావచ్చు కదా అని సలహా కూడా ఇస్తుంది జగతి. ఇంతలో రిషి ఎంట్రీ ఇచ్చి తన వదిన ధరణికి కాఫీ అడుగుతాడు.

దేవయానికి కలుగజేసుకొని నేనునా బిడ్డకు కాఫీ ఇస్తాని చెబుతుంది. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నందుకు దేవయానికి థాంక్స్‌ చెబుతుంది జగతి. రా ధరణి మనకు చాలా పనులు ఉన్నాయంటూ జగతి అక్కడి నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రిషి క్లాస్‌ తీసుకుంటూ ఉండగా ఏదో నోటీస్ వస్తుంది. దీంతో రేపు సెలవు ఉంటుంది అని పక్కనామెకు చెప్పి సంబరపడిపోతుంది వసుధార. కానీ రిషి ఆమెను సైలెంట్ గా ఉండమని చూస్తూ.. నోటీసు చదువుతాడు.

Recommended Video

KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
సందేశం

సందేశం

రేపు సెలవు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ.. ఓ పేరున్న సంస్థ స్కాలర్‌షిప్‌ టెస్టు నిర్వహిస్తుందని రిషి చెబుతాడు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్లు పేర్లు ఇమ్మని అంటే ఎవరూ పేరు ఇవ్వరు. అంతా వసుధార పేరు ఇస్తుందని అమె వైపు చూస్తారు. కానీ భయంతో వసుధార పేరు ఇవ్వడానికి ఎందుకో కానీ వెనుకాడుతుంది. కాసేపు సీరియస్‌గా చూసిన రిషి ఈ క్లాస్ నుంచి వసుధార పేరు ఇస్తున్నానని చెప్పి అటెండర్‌కు ఇచ్చి పంపించేస్తాడు.

తర్వాత వసుధార పిలిచి ఇదేం బాలేదని ఎందుకు పేరు ఇవ్వలేదని క్లాస్ పీకుతాడు. దానికి ఆమె ఏదో కవర్ చేసుకుంటుంది. ఇక ఇక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్‌ కమింగ్ లో రెస్టారెంట్‌లో కూర్చొని ఉన్న రిషికి కాఫీ తీసుకొస్తుంది వసుధార. నీకో మెసేజ్ పంపించాను చూశావా అని అడుగుతాడు. లేదు అని, ఎదురుగా ఉన్నా కదా చెప్పమంటే, వెటకారం ఆడి ఇంటికెళ్లాక తీరికగా చదువుకో అంటాడు. అయితే అందులో ఏముందో అన్న టెన్షన్‌ ఇంటికి వెళ్ళీ దాకా భరించాలా? అని అడుగుతుంది. ఇక రిషి వెళ్లిపోగా మెసేజ్‌లో ఏముందబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంది వసుధార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X