Guppedantha Manasu: వసుధార మీద రిషికి కొత్త అనుమానం.. అతన్ని రంగంలోకి దించిన దేవయాని

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎక్కువగా వసుధారా, రిషి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక రాత్రి పూట రిషి వసుధారకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ బిజీ వస్తుంది. అదే సమయంలో గౌతమ్ కూడా ఎవరితోనో రొమాంటిక్ గా మాట్లాడుతున్నట్లు కనిపించడంతో రిషిలో అనుమానం మరింత బలపడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గౌతమ్ కాల్ చేశాడా

గౌతమ్ కాల్ చేశాడా


కాలేజీకి వసుధార లేట్‌గా రావడంతో ఆమెకు రిషి పనిష్‌మెంట్‌ ఇస్తాడు. ఇప్పటి వరకు చెప్పని ఓ లెక్క బోర్డు మీ రాసిన వసుధారకు చేయమంటాడు. వసుధార భయపడుతూ వెళ్లి దాన్ని కరెక్ట్ గానే చేసేస్తుంది. అయితే అసలు ఆమె చేయకపోవచ్చు ఆమెను అడుకుందామని అనుకున్న రిషి ఆశ్చర్యపోతాడు. అందర్నీ పంపించి వసుధారను మాత్రమే అక్కడ ఉండమంటాడు. ఇప్పుడు ఏమంటారో అని భయపడుతుంది. కానీ రాత్రంతా ఫోన్ ఫుల్ బిజీ వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావో అని ఆరా తీస్తాడు. దానికి ఆమె మీ ఇంటి నుంచే కాల్ వచ్చిందని చెబుతుంది. అదేంటి గౌతమ్ గాడే కాల్ చేశాడా అని మళ్ళీ అనుమానం వస్తుంది. మా ఇంటి నుంచా? ఎవరు చేస్తారు? అని అడుగుతాడు. దానికి ఆమె మీ అమ్మ అంటుంది.

రిషిని ఏడిపించాలని

రిషిని ఏడిపించాలని

రిషికి కోపం రావడం చూసి అదే సార్ మన జగతి మేడం అని చెబుతుంది. ఆమె ఎందుకు చేసింది అంటే డానికి ఆమె లెక్కలు చెప్పడానికి చేశారని చెబుతుంది. ఇక మహేంద్ర-జగతి కారు దగ్గర రిషితో కలిసి ఎదురు చూస్తుండగా వసు వస్తుంది. రమ్మన్నప్పుడే రావాలి కదా అని రిషి అంటే అక్కడ కాంటీన్ లో అంటూ మరేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఏమీ చెప్పవ్వద్దు పదమని అంటాడు. దీంతో వసుధార, జగతి, మహేంద్ర కారులో వెనుక సీటులో ఎక్కుతారు. ఎక్కడకు అని అడిగితే సమాధానం చెప్పడు. మహేంద్ర కావాలనే రిషిని ఏడిపించాలని చెప్పి వెనుక సీట్లో ఇరుగ్గా కూర్చునేలా చేస్తాడు. దాన్ని చూసి రిషికి ఇంకా కోపం నషాళానికి చేరుతుంది.

వసుధార రూమ్ కు

వసుధార రూమ్ కు


ఈ క్రమంలో అతనిని మరింత ఉడికించాలని మహేంద్ర వసుధారతో పిచ్చాపాటి మాట్లాడడం మొదులు పెతతడు. అయితే తన కొడుకుకు కోపం వస్తున్న అర్ధం చేసుకున్న జగతి మాత్రం ఆ ఇద్దర్నీ వారిస్తుంది. రిషి కోపంగా ఉన్నాడని సైలెంట్‌గా ఉండాలని సూచిస్తుంది కానీ వాళ్లిద్దరు మాత్రం ఆమె మాటలు పట్టించుకోరు. అలా ఒక సారి సడెన్ బ్రేక్‌ వేయడంతో వసు వెళ్లి రిషిని వెనుక నుంచి హత్తుకునేలా పడుతుంది. ఇక అయినా వినకపోవడంతో మ్యూజిక్‌ సిస్టమ్‌ లో డీజే టిల్లు పాట పెడతాడు. అయినా వాళ్లు ఆగకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో వాళ్ళని వసుధార రూమ్ కు తీసుకు వెళతాడు రిషి.

రొమాంటిక్ గా

రొమాంటిక్ గా


దీంతో షాకయిన ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారని వసుధార రిషిని అడుగుతుంది. మహేంద్ర కూడా మాకు ఏమైనా కాఫీ ఇప్పిస్తున్నావా? అని అడుగుతాడు. ఇవాళ నా బర్త్‌డే అని పార్టీ ఇద్దామని తీసుకొచ్చానంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అలా నలుగురూ కలిసి వసుధార రూమ్‌కు వెళ్తుంటారు. మెట్లు ఎక్కుతుంటే వసుధార స్లిప్‌ అయి పడిపోబోతే రిషి ఆమెను పడిపోకుండా వెనుక పట్టుకుంటాడు. అక్కడో రొమాంటిక్ మ్యూజిక్‌తో కాసేపు ఆకట్టుకుంటారు. ఇది చూసిన మహేంద్ర, జగతికి కాస్త ఆనందంగానే ఉన్నా ఎక్కడో అసౌకర్యంగా ఫీల్ అయి మహేంద్ర గట్టిగా దగ్గడంతో వాళ్లు తేరుకొని ముందుకు వెళ్లారు. ఇక అంతా వసుధార రూమ్‌ వద్దకు చేరుకుని ఉండగా వసుధార వెళ్లి చాప తీసుకు వెళ్లి కూర్చొమని చెబుతుంది. తాను కూర్చోవడానికి రాలేదన్న రిషి మర్యాదలు ఏమీ అక్కరలేదని అంటాడు. మళ్ళీ మంచి నీళ్ళు కావాలా? అని అడిగితే కోపంగా చూస్తాడు.

ట్యూషన్ చెప్పాలని

ట్యూషన్ చెప్పాలని

తరువాత జగతితో మాట్లాడుతూ వసుధారకు ట్యూషన్ చెప్పాలని రిక్వస్ట్ చేస్తాడు. స్కాలర్‌ షిప్ టెస్టు కోసం వసుధారను రెడీ చేయాలని సూచిస్తాడు. జగతి కూడా డానికి ఓకే చెబుతుంది. నిన్న మీరు చెప్పిన లెక్కలకు నేను ఇంప్రెస్‌ అయ్యానని అందుకే ఈ బాధ్యత అప్పగిస్తున్నానని చెప్పుకొస్తాడు. ఆమె అంగీకరించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క వసుధార, జగతి, మహేంద్ర మాట్లాడుతూ ఉండగా రిషి కింద ఏదో మెసేజ్ టైప్ చేస్తుంటే వసుధార చూస్తుంది. పరుగెత్తుకొని వెళ్లి తన ఫోన్ చేక్‌ చేసుకుంటే అందులో ట్యూషన్‌కు రెడీ అవ్వు అని ఉఁటుంది. ఓకే సర్ అని రిప్లై ఇస్తుంది.

రంగంలోకి వసు బావ

రంగంలోకి వసు బావ

అప్పుడే జగతి, మహేంద్ర కూడా వీళ్లద్దరి గురించి మాట్లాడుకుంటారు. మరోపక్క ముగ్గురి కోసం ఇంట్లో ఎదురు చూస్తుంది దేవయాని. ఇంత వరకు ఎక్కడ తిరుగుతున్నారో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు రావడంతో వాళ్లతో కోపంగానే మాట్లాడుతుంది. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి, వసుధారను కట్‌ చేయడానికి ఆమె బావను రంగంలోకి దించుతుంది దేవయానికి, వసుధార కనిపించకూడదని అతడితో ఫోన్‌లో చెబుతుంది. దీంతో అతను వసుధారను ఫాలో అవతుంటాడు. తొందరపడక తప్పదని వసుధారను వెనుక నుంచి చూస్తూ అనుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X