Guppedantha Manasu: ఆ వంకతో మళ్ళీ వసును ఇంటికి తెచ్చిన రిషి.. దేవయాని మాస్టర్ స్కెచ్

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎక్కువగా వసుధారా, రిషి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక రాత్రి పూట రిషి వసుధారకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ బిజీ వస్తుంది. అయితే అది జగతి ఫోన్ అని తెలుసుకుని ఇంకా వసుకు ట్యూషన్ చెప్పాలని రిషి కోరతాడు. దానికి జగతి కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయిపోతుందని

అయిపోతుందని

జగతి, మహేంద్రలతో దేవయాని మాట్లాడుతూ అమాయకుడిని చేసి రిషిని ఆడిస్తున్నారని అంటుంది. ధరణితో మాట్లాడిన జగతి.. అక్కయ్య బీపీ లెవల్స్‌ డిస్టర్బ్‌ అయ్యాయని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. దానికి మహేంద్ర కూడా వంత పాడుతున్న క్రమంలో దేవయానికి మరింత కోపం వస్తుంది. అలా ఇద్దరూ వెళ్లడాన్నిఆమె జీర్ణించుకోలేకపోతుంది.

ఏంటీ ధరణీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. దేవయానికి గుర్తు వచ్చి వసుధార బావకు ఫోన్ చేస్తుంది. అప్పటికే అతను మందు తాగుతూ ఉంటాడు. ఈక్రమంలో నీకేమైనా డబ్బులు అసరమా అని అడుగడంతో డబ్బెవరికి చేదు అన్నట్టు అతను నవ్వుతాడు. గతంలో నీకో పని చెప్తే సగం సగం చేసి వెళ్లిపోయావు, అందుకే ఈసారి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు అంటుంది దేవయానికి. అప్పుడు నా టైం బ్యాడ్ అని... ఇప్పుడు రాజీవ్ టైం నడుస్తుందని ఏ పని అయినా అయిపోతుందని బిల్డప్ ఇస్తాడు.

హడావుడిగా ట్యూషన్‌కు

హడావుడిగా ట్యూషన్‌కు

ఏం చేయాలో చెప్పమంటే, నాకు అవసరం లేనిదీ... నీకు అవసరమైంది అని... ఆ మనిషి నా కంటికి కనిపించకూడదని చెబుతుంది. నాకు కావాల్సిందెవరో నాకు తెలుసు అని, నేను మళ్లీ తిరిగి వచ్చిందే అందుకు, అడ్వాన్స్‌ కొడితే పని స్టార్ట్ చేస్తానంటాడు. ఇక ఈ క్రమంలో వసుధార ఆలస్యంగా నిద్రలేచి, రిషి మెసేజ్‌లు చూసి టెన్షన్ పడుతుంది.

ట్యూషన్‌కు వెళ్లాలి కదా రెడీ అయ్యావా అంటాడు. రెడీ అవుతున్నాను అంటుంది. రిషిని ఉదయాన్నే ఎక్కడికో వెళ్లడాన్ని చూసి దేవయాని అనుమాన పడుతుంది. ఎప్పుడూ కోపంగా ఉండే రిషిలో మార్పు వచ్చిందని అనుకుంటూ రిషిని అడిగితే చిన్న పని ఉందని బయటకు వెళ్తున్నాను అంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర దేవయానికి గుడ్‌మార్నింగ్ చెప్తాడు.

ఈ వయసులో ఆరోగ్యం సరిగా చూసుకోవాలి కదా అంటూ కౌంటర్ ఇస్తాడు. వసుధార ఏమో హడావుడిగా ట్యూషన్‌కు బయల్దేరుతుంది. లేట్ అయింది ఇక ఆయన ఏదో ఒకటి అంటాడు అని అనుకుంటూ ఉండగా రిషి వస్తాడు,

తొందర్లోనే పని పూర్తి అవుతుందని

తొందర్లోనే పని పూర్తి అవుతుందని

రిషిని చూసి షాక్‌ అయ్యి ఉండగా వెళ్దామా అని రిషి అడుగుతాడు. కారులో ఎక్కుతూ మీరు ఇక్కడికి వస్తారని అసలు అనుకోలేదు అంటుంది వసుధార. ఆ టెన్షన్‌లో గుడ్‌మార్నింగ్‌ చెప్పలేదని అంటుంది. అయితే ఇవే తగ్గించుకుని టెస్టుపై దృష్టి పెట్టమంటాడు. వసుధార, రిషిని వెనుకాలే ఉన్న వసుధార బావ రాజీవ్‌ చూస్తాడు.

వసుధారను రక్షించుకోవాలంటే జాగ్రత్త పడాలి, ఒకప్పుడు అమాయకంగా ఉన్న వసుధార ఇప్పుడు తెలివైన వసుధారగా మారిందని అనుకుంటూ, నాకు నీపై ఉన్న ఆశ, ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళని చూశాక దేవయానికి ఫోన్ చేస్తాడు. తొందర్లోనే పని పూర్తి అవుతుందని చెప్తాడు. తొందరగా పని పూర్తి కావాలని ఆమె కూడా చెబుతుంది. ఇంతలో రిషి, వసుధార రావడం చూసి దేవయాని షాక్ అవుతుంది.

ఏకాగ్రతతో

ఏకాగ్రతతో

రిషి పొద్దుపొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళింది అందుకా అని అంటుంది. ధరణీ జగతికి పుస్తకాలు ఇస్తుంది, ఏంటివి అంటే రిషి ఈ బుక్స్ ఇవ్వమన్నాడు అంటూ చెప్తుంది ధరణి. ఏం జరుగుతుందని అడుగుతుంది. ఏమైందో ఏమో కానీ హడావుడి చేస్తున్నాడని చెబుతుంది. ఇక వసుధార గురించి రిషి చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు జగతి అర్ధం చేసుకుంటుంది. బాల్కనీలో బోర్డు పుస్తకాలు అన్నీ నీటి గా సర్దిపెట్టి ఉంచుతుంది ధరణి. ఇక అక్కడకు వచ్చిన వసుధారతో రిషి మాట్లాడుతూ ఎలాగైనా హార్డ్‌ వర్క్‌ చేసి టెస్టులో మంచి ర్యాంక్‌ తెచ్చుకోవాలి అంటాడు రిషి. జగతితో ఆమెకు ఎలా అయినా మంచి మార్కులు వచ్చేలా చూడమని చెబుతాడు. ఇక్కడ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏకాగ్రతతో ఉండాలని చెప్తాడు.

తప్పు తప్పుగా

తప్పు తప్పుగా

వసుధార ఏమో ఈయన నామీద ఇంత పెట్టుకుంటున్నాడు అని అనుకుంటుంది. అయితే ఇది మన ఇద్దరి టెస్ట్ అని జగతి ధైర్యం చెబుతుంది. మరోపక్క వసుధారకు జ్యూస్ తీసుకెళ్తున్న ధరణిని ఆపుతుంది దేవయాని. ఎవరికీ అంటే వసుధారకు అంటుంది. ఆమె ఎందుకు వచ్చిందని అడుగుతుంది. అప్పుడే వచ్చిన రిషి.. వసుధారను జాగ్రత్తగా చూసుకోమని దేవయానికి చెప్తాడు. అప్పుడు ఏమనాలో అర్థం కాక సరేనని అంటుంది. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. కమింగ్ అప్ లో కాలేజ్ స్టూడెంట్స్‌ వసుధార, రిషి ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అది వసుధార విని, బాధపడుతుంది. నేనేం తప్పు చేశాను, ఎందుకు వీళ్లందరూ ఇలా మాట్లాడుతున్నారేంటని అనుకుంటుంది. ఇంతలో రిషి ఫోన్ చేసి వస్తానంటే వద్దని చెబుతుంది. అప్పుడే రాజీవ్‌ కూడా కనిపించి హలో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X