Guppedantha Manasu: వసు చూస్తుండగానే రిషి మీద ఎటాక్.. తీవ్రగాయాలు?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎక్కువగా వసుధారా, రిషి మధ్య ప్రేమ సన్నివేశాలు చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవయాని దెబ్బకు రాజీవ్ రంగంలోకి దిగుతాడు. రంగంలోకి దిగడమే కాక ఏకంగా వసుధార కాలేజ్ వద్దకు వెళ్లి మరీ ఆమెకు షాక్ ఇస్తాడు.

ఆమెను ఆమె తల్లితండ్రులే చూసి రమ్మని పంపించారని అబద్దం చెప్పి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో అతనిని వదిలించుకుని అఆమే ఎలాగొలా తన గదికి బయలుదేరుతుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూమ్లో రాజీవ్ ప్రత్యక్షం

రూమ్లో రాజీవ్ ప్రత్యక్షం

కాలీజ్ నుంచి ఇంటికి బయలుదేరిన రిషి కారు తోలుతూనే వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వసుధార గురించి గౌతమ్ మాట్లాడితే నాకెందుకు కోపం వస్తుందని రిషి ఆలోచనలో పడతాడు. అసలు నాకు వసుధార ఏమవుతుంది? ఎందుకు వసుధార నన్ను ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తుంది? అని కూడా రిషికి అనుమానం మొదలవుతుంది. అలా ఆలోచిస్తూనే వసుధారకు తలనొప్పి అన్నది కదా ఆమె తలనొప్పి ఎలా ఉందో? అని ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేసుకొని రెస్టారెంట్‌కు వెళతాడు.

ఇక అప్పటికే వసుధార తన రూమ్ కు చేరుకుంటుంది. వెళ్లి రూమ్ తలుపులు తెరిచి చూసే సరికి రాజివ్ అక్కడ వసు పడుకునే చాప మీద పడుకుని ఉంటాడు. ఆమె అతనిని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే రాజీవ్ ఆమెకు తెలియకుండానే ఆమె రూమ్ లో ఆమె చాప మీద ప్రత్యక్షమవుతాడు. నువ్విక్కడ ఉన్నావు ఏంటి? అని వసుధార అడుగుతుంది.

ఏదో తేడాగా ఉందని

ఏదో తేడాగా ఉందని

అయితే రాజీవ్‌ అక్కడ పడుకున్న తీరు, ఆమెతో మాట్లాడుతున్న తీరు చూసి రాజీవ్ మీద వసుధారకు అనుమానం వస్తుంది. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అతనిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. కానీ దానికి రాజీవ్‌ ఇంకేదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడే రిషి ఆమెకు ఫోన్ చేస్తాడు.

రాజివ్‌ ముందు మాట్లాడలేనని భావించి ఆ ఫోన్ కట్ చేస్తుంది. అయితే అది చూసిన రాజీవ్ ఏంటి నాకోసం కట్ చేస్తున్నావా? అని అడుగుతాడు. ఈ క్రమంలో రిషి మళ్ళీ ఫోన్ చేస్తాడు, అయితే ఈ సారి మాత్రం ఆమె ఫోన్ కట్ చేయకుండా లిఫ్ట్ చేసి మళ్లీ చేస్తానని చెప్పింది. ఇంతలో రాజీవ్‌ గొంతు విన్న రిషి ఇదేంటి ఆమె కాకుండా మరో గొంతు ఉంది, ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో మళ్లీ ఇక్కడకు రావద్దని రాజీవ్‌ కూడా వసుధార గట్టిగానే చెప్తుంది. రాజీవ్ బయట అడుగు పెట్టగానే తలుపు వేసేస్తుంది.

వసుధార అబద్దం

వసుధార అబద్దం

నిన్ను ఎలాగైనా వదలను అనుకొని రాజీవ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి ఏది ఏమైనా రూమ్ కు వెళ్ళడం కరెక్ట్ కాదని భావించి డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కు వస్తాడు. వసుధార ఇంకా రాలేదని అనుకుంటాడు. గదికి వెళ్దామంటే ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఎవరు వారు? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది.

సార్ మీరు ఎప్పుడు వచ్చారని అని అడిగితే ముందు నేను కాల్ చేస్తే ఆ కాల్ ఎందుకు కట్ చేశావని అడుగుతాడు. తర్వాత చెప్తాను అని ఆమె అంటున్న క్రమంలో అక్కడే తిష్ట వేసిన రాజీవ్‌ పిలిచి ఆర్డర్ తీసుకోమని అంటాడు. ఎవరా అని రిషి చూస్తూ ఉండగా రాజీవ్ రిషిని కూడా పలకరిస్తాడు.

అప్పుడు రిషికి అసలు విషయం అంతా అర్థమవుతుంది. రాజీవి ఎప్పుడూ మీ రిషీ సేవలోనే తరిస్తావా... నాకు సేవలు చేయవా అని అడుగుతాడు. ఇంతలో రూమ్‌కి వచ్చి ఏమైనా గొడవ చేశాడా అని రిషి అడుగుతాడు. అలా ఏమీ లేదని అబద్దం చెప్తుంది వసుధార.

రిషి ప్రాపర్టీ కాదు

రిషి ప్రాపర్టీ కాదు

నువ్వు రిషి ప్రాపర్టీ కాదు అంటూ కామెంట్ చేస్తాడు రాజీవ్. రిషి కోపంతో లేచి ఏంట్రా అని మీదికి వెళ్లబోతాడు. వసుధార సహా రెస్టారెంట్ మేనేజర్‌ వారిని అడ్డుకుంటారు. ఇక కరెక్ట్ కాదని భావించి రాజివ్‌ రెండు సెంటిమెంట్‌ డైలాగ్స్‌తో వసుధారను ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రిషి కూడా కోపంతో వెళ్లిపోతాడు. కారులో వెళ్తున్న రాజీవ్‌ వసుధార గురించి ఆలోచిస్తూ ఈ రిషి నాకు వసుకు అడ్డంకిలా మారడని అనుకుంటాడు.

సరిగ్గా రాజీవ్ రిషి వెనుకాలే ఫాలో అవుతూ ఉండడంతో కారును వేగంగా పోనిచ్చి తప్పించుకుంటాడు. ఇక రాజీవ్‌ వెళ్లిపోయాడని నిర్ధారించుకుని ఆ తరువాత కారు దిగి వసుధారకు ఫోన్ చేస్తాడు. నువ్వేమీ భయపడకు..వాడు వెళ్లిపోయాడు అని అభయం ఇస్తాడు. ఇక మరోపక్క రిషి రావడం లేట్ అయిందని మహేంద్ర, జగతి కంగారు పడతారు. రిషికి ఫోన్ చేయమని జగతి అంటే మహేంద్ర ఫోన్ చేస్తాడు. నేను వస్తున్నానని చెప్పి పడుకోమంటాడు రిషి.

రిషి మీద రాజీవ్ దాడి

రిషి మీద రాజీవ్ దాడి

అయితే వసుధారకు ఏదో భయంతో నిద్ర పట్టదు. లేచి నీళ్లు తాగుతుంది. ఇంతలో కిటికిలో ఏదో నీడ కనిపిస్తుంది. కంగారు పడి రిషికి ఫోన్ చేస్తుంది. అయితే అప్పటికి కూడా రెస్టారెంట్‌ వద్దే వసు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ రిషి ఫోన్‌ కారులోపల ఉంటుంది లిఫ్ట్ చేయడు.

అయితే రాజీవ్ ఆమె రూమ్ దగ్గరకు వచ్చేస్తాడు ఇక అలా నేటి ఎపిసోడ్‌ ముగించారు. తాజా ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రాజీవ్ బారి నుంచి రిషి వసుధారను రక్షిస్తాడు. అయితే కొంచెం అజాగ్రత్తగా ఉన్న సమయంలో రాజీవ్ రిషి మీద ఎటాక్ చేస్తాడు. ఈ క్రమంలోనే రిషికి గాయమవుతుంది. దీంతో రాబోతున్న ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X