Guppedantha Manasu: వసును ఇంటికి తీసుకోచ్చేసిన రిషి.. దేవయానికి భారీ ఎదురుదెబ్బ

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎక్కువగా వసుధారా, రిషి మధ్య ప్రేమ సన్నివేశాలు చూపిస్తున్నారు. దేవయాని దెబ్బకు రాజీవ్ రంగంలోకి దిగి ఏకంగా వసుధార కాలేజ్ వద్దకు వెళ్లి మరీ ఆమెకు షాక్ ఇస్తాడు. ఆమెను ఆమె తల్లితండ్రులే చూసి రమ్మని పంపించారని అబద్దం చెప్పి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు.

అయితే అతనిని వదిలించుకోవాలని చూసినా ఏకంగా గదికి రావడమే కాక రిషి కంట కూడా పడతాడు. అతను వచ్చాడు కాబట్టి ఆమెను ఒంటరిగా వదలకూడదని ఫిక్స్ అయ్యి ఆమె గది బయటే ఎదురు చూస్తూ ఉంటాడు రిషి. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పెనుగులాట జరుగుతూ ఉండగా

పెనుగులాట జరుగుతూ ఉండగా

రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న క్రమంలో వసుధార తన గది బయట ఎవరో ఉన్నారని అనుమాన పడుతుంది. తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో రిషికి ఫోన్ చేస్తుండు కానీ అతను బయటే ఉన్నా ఫోన్ కారులో ఉండడంతో దానిని రిషి చూడడు. ఇక సడెన్‌గా అర్థరాత్రి ఇంట్లోకి వచ్చిన రాజీవ్‌ను చూసి వసుధార షాక్ అవుతుంది.

నువ్వేమిటి బావా అని అడిగితే ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటూ చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే వసుధార వద్దని ఎంత వారించినా రాజీవ్ వినిపించుకోడు. లేదు మనం ఇక్కడ వద్దు, ఇక్కడి నుంచి ఇద్దరం వెళ్లిపోదామంటాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరుగుతూ ఉండగానే ఆమెను లాక్కుని కిందకు తీసుకు వెళతాడు రాజీవ్.

చేతినుంచి రక్తం కారడంతో

చేతినుంచి రక్తం కారడంతో

ఇక ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పోతుంటే అక్కడే ఉన్న రిషి రాజీవ్ కు అడ్డం పడతాడు. కోపం నషాళానికి అంటడంతో రాజీవ్‌పై చేయి చేసుకొని వసుధార చేయి పట్టుకుంటాడు రిషి. ఇక రాజీవ్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా రిషి మీద దాడి చేస్తాడు. అలా ఇద్దరి మధ్య భారీ కొట్లాట జరుగుతుంది. అయితే రిషికి ఏమైనా అవుతుంది ఏమో అనే భయంతో వసుధార చాలా భయపడుతుంది.

అందుకే రిషిని వసుధార ఆపే ప్రయత్నం చేస్తుంది. అయినా రాజీవ్ అతనితో కొట్లాడడం అపడు. ఇక తప్పేలా లేదని భావించి తనతో తెచ్చుకున్న హ్యాండ్ నైఫ్ తో రిషిని గాయపరిచి పారిపోతాడు. రిషికి గాయమై చేతినుంచి రక్తం కారడంతో వెంటనే వసుధార రిషి చేతికి కట్టు కుడుతుంది.

అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే

అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే

మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేక నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం తప్పైంది అని పేర్కొన్న రిషి వెళ్లి లగేజ్‌ సర్దుకొని రమ్మని చెప్తాడు. అయితే ముందు తటపటాయించిన వసుధార ఎట్టకేలకు బయలుదేరి వస్తుంది. ఇక మరోపక్క రిషి ఇంట్లో టెన్షన్ పడుతుంటారు. చాలా రాత్రి అయినా ఇంకా రాకపోవడంతో అందరూ హాల్ లోనే ఎదురు చూస్తూ ఉంటారు.

దేవయాని రచ్చ మొదలు పెట్టి నా కొడుకు రాకపోతే ఎవరూ టెన్షన్ పడడం లేదని చెబుతూ ఫోన్‌లో ట్రై చేయడం కాదని... అది ఇక్కడ ఎవరికీ ప్రేమ లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంది. కొడుకు రాలేదని బాధ, బాధ్యత మహేంద్రకు లేదని అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఫణీంద్ర తప్పు పడతాడు.

ఈసారి కూడా మిస్‌ చేశాడా

ఈసారి కూడా మిస్‌ చేశాడా

ఇక మరోపక్క రిషితో కారులో వస్తున్న వసుధార ఏడుస్తుంటుంది. అది చూసి రిషి కారు పక్కన ఆపి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. దానికి రిషి చేతులు పట్టుకొని మళ్లీ ఏడుస్తుంది. ఇవాళ సమయానికి మీరు రాక పోతే ఏమయ్యేది అని భయపడింది. నిన్ను రక్షించుకునే బాధ్యత నాకు ఉంది, వాడు ఎప్పుడైనా వస్తాడని రాత్రంతా కాపాలా ఉన్నానని అంటాడు.

ఎక్కడకు వెళ్లాలి, ఎలా ఉండాలి ఏం చేయాలి ఇలా అన్ని సమాధానాలు లేని ప్రశ్నలే నా లైఫ్‌లో ఉన్నాయి కదా అంటూ వసుధార అంటే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం నేనే అని అంటాడు. రిషి ఇంటికి తీసుకు వెళ్ళడంతో అసలు మీ ఇంటికి తీసుకొచ్చారు ఎందుకు అని కంగారు పడుతుంది. నేను చెప్పింది చేయమని ఏమీ అడక్కు అని చెబుతాడు. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్తగా రిషి, వసుధారను చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దేవయానికి పెద్ద షాక్ అనిపించి రాజీవ్‌ ఈసారి కూడా మిస్‌ చేశాడా అని మనసులో అనుకుంటుంది.

కష్టం వచ్చింది అని

కష్టం వచ్చింది అని

ఈ టైంలో వసుధార మన ఇంటికి రావడం ఏంటి ప్రశ్నిస్తుంది. తనకో కష్టం వచ్చింది అని రిషి చెప్పడంతో కష్టాలు అందరికీ వస్తాయి రిషి... కష్టాల్లో ఉన్న వారందరూ మన ఇంటికి రారు కదా అని అంటుంది. అయితే మహేంద్ర కల్పించుకుని ఆమెను తీసుకురావడానికి ఉన్న అర్హత ఏంటి అని మీ పెద్ద ప్రశ్నిస్తోంది అని అంటాడు. ఇక అలా తాజా ఎపిసోడ్ ముగించారు.

కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వంటగదిలో వసుధారకు రిషి కాఫీ కలిపి ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు అంటే నీకు కావాలిలే అని అంటూ ఆమెకు కాఫీ చేసి ఇస్తాడు. ఇంతలో అది చూసిన దేవయాని... వసుధార పిలిచింది అంటూ జగతికి కాల్ చేస్తుంది. వసుధార, జగతి ఇద్దరు ఒక రూమ్ లోకి చేరేసరికి దేవయానికి కూడా వచ్చి నేనే కావాలనే రమ్మని చెప్పనంటోంది, అల అంటూ వారున్న గదిలోకి వెళ్లి గడియ పెడుతుంది...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X