Guppedantha Manasu: వసు ప్రేమను ఫీలైన రిషి.. దేవయాని దెబ్బకు బయటకి?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎక్కువగా వసుధారా, రిషి మధ్య ప్రేమ సన్నివేశాలు చూపిస్తున్నారు. దేవయాని దెబ్బకు రాజీవ్ రంగంలోకి దిగి ఏకంగా గదికి రావడమే కాక రిషి కంట కూడా పడతాడు. అదే సమయంలో రాజీవ్ రిషి మీద దాడి కూడా చేస్తాడు.
ఇక ఆమెను ఆమెను ఒంటరిగా వదలకూడదని ఫిక్స్ అయ్యి రిషి ఆమెను రూమ్ ఖాళీ చేయించి మరీ తన ఇంటికి తీసుకు వెళతాడు. అలా రిషి చేస్తాడని ఏమాత్రం ఊహించని దేవయాని సహా కుటుంబ సభ్యులు ఆమెను ఎలా తీసుకు వచ్చావు అన్నట్టు గుమ్మంలోనే నిలబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏ అర్హతతో తీసుకువచ్చావు?
వసుధారను ఎందుకు తీసుకొచ్చావని దేవయాని అనుమానంగా అడిగితే అదే విషయాన్ని రిషిని మహేంద్ర అడుగుతాడు. జగతి అలా అడగవద్దు అని వారిస్తున్నా ఆగకుండా ఏ అర్హతతో ఆమెను ఇక్కడికి తీసుకు వచ్చావు అని అడుగుతాడు. అయితే ఇది ఏమాత్రం ఇష్టం లేని దేవయాని కూడా మహేంద్రకు సపోర్ట్ చేస్తుంటుంది. మహేంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీస్తుంది.
ఈ పరిస్థితి చూసి వసుధార వెనక్కి వెళ్లి పోబోతుంది. దీంతో వెంటనే ఆమెను చేయి పట్టుకొని ఆపుతాడు రిషి. నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని చెబుతూనే ఆమె చేతిలో బ్యాగ్ తీసుకొని.. చేయి పట్టుకొని పెద్దమ్మ దగ్గరకు తీసుకొచ్చి వసుధార ఇక్కడే ఉంటుందని చెబుతాడు. ఆమె ఇంకా ఏదో అంటూ ఉండగా ఫణీంద్ర కలుగు జేసుకొని ఏయ్ దేవయాని నువ్వు ఏమీ మాట్లాడవద్దని అంటాడు.

మాట్లాడడం కరెక్ట్ కాదని
అసలు ఏమీ మాట్లాడవద్దని ఏదైనా పొద్దున్న మాట్లాడుకుందామని చెబుతూ అక్కడి నుంచి రిషిని పంపించేస్తాడు. అసలు ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరుగుతుంది అని అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఏమైందో వసుధారను అడిగి ధరణికి జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు ఫణీంద్ర.
ఇక వసుధార వద్దకు వచ్చిన జగతి ఆమె అన్ని విషయాలు తెలుసుకుంటుంది. అంతేకాక ఆమెకు జాగ్రత్తగా ఉండమని కూడా అభయం ఇస్తుంది. అయితే అసలు నువ్వు ఉంటున్న చోటు అతనికి ఎలా తెలిసింది? అంటే అతను నన్ను ఫాలో చేసి వచ్చాడని అంటుంది వసు. అయితే అది నమ్మే విధంగానే లేదని ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారని ఇద్దరిలో అనుమానం మొదలైంది.
ఈలోపు అక్కడికి మహేంద్ర, ధరణి కూడా వస్తారు. జగతి ద్వారా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుని ధైర్యం చెప్పారు. వసుధార, ధరణి వెళ్లిపోయాక హాల్‌లో జరిగిన వాగ్వాదం గురించి మహేంద్రతో జగతి మాట్లాడుతూ ఇలా మన కొడుకుని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని అంటుంది.

క్లారిటీ ఉండాలి కదా
అయితే మహేంద్ర మాత్రం తాను అడిగిన ప్రశ్నలు సమాధానాలు దాట వేసే ప్రశ్నలు కాదని, కచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు అని చెబుతూనే ఇంకా ఎవరైనా అడగకుండా ముందు జాగ్రత్తగా అడిగానని అంటాడు. అవి రిషి బయటకు చెప్పక పోయినా తనకు తాను ఆలోచించుకోవలసిన ప్రశ్నలు అని అంటాడు.
అయితే వసుధార విషయంలో రిషి చేసిందాన్ని గౌతమ్ కూడా రిషి దగ్గర తప్పుపడతాడు. కానీ గౌతమ్‌పై రిషి కోప్పడతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర రిషి నువ్వు ఎంత మంది నోళ్లు మూయిస్తావని నిలదీస్తాడు. వదిన అలా అడిగితే నాక్కూడా డౌట్స్ వచ్చాయనే విషయాన్ని బయట పెడతాడు.
సాయం చేస్తే ఇన్ని అనుమానాలా అని రిషి అడిగితె ఇది అందరి అనుమానం అన్న మహేంద్ర, ఈ విషయంలో నీకు అసలు క్లారిటీ ఉండాలి కదా అని అంటాడు. నీకు నీవే ప్రశ్నించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కాఫీ అవసరం ఉందని
అందరూ వెళ్లిపోయాక రిషి ఆలోచనలో పడి వసుధార మంచి చెడులు ఆలోచించడానికి ఆమెపై ఉన్నది ప్రేమా బంధమా, స్నేహమా? అంటూ ఆలోచనల్లో మనిగిపోతాడు. ఆమె ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే ఇలాగే తీసుకు వస్తావా అని అడిగిన ప్రశ్నకు నిజమే కదా అలా చేయను కదా అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఏదో రోజు నాకు నేను చెప్పుకోవాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో నేను ప్రేమిస్తున్నాను అని తల్లి ప్రేమలేని జగతి మేడంకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తాడు. మరో పక్క కిచన్‌లో ఉన్న వసుధార వద్దకు వెళ్ళిన రిషి నీకు ఇప్పుడు కాఫీ అవసరం ఉందని అంటాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే అప్పుడప్పుడు చెప్పింది కూడా అర్థం చేసుకో వసుధార అంటాడు.

మాటలతో హింసించి
ఇంతలో కాఫీ కలుపుతూనే ఒకప్పటి కాఫీలా కాదు ఇప్పుడు బాగానే ఉంటుంది అంటాడు. ఇక ఇదంతా దేవయాని చూసి మరో స్కెచ్ వేస్తుంది. అప్పుడు జగతిని ఇంటికి తీసుకొచ్చాడు... ఇప్పుడు జగతి శిష్యురాలిని ఇంటికి తీసుకొచ్చాడు అంటూ రగిలి పోతుంది. వెంటనే జగతికి ఫోన్ చేస్తుంది, నీ శిష్య పరమాణువు వచ్చిందని సంతోష పడుతున్నావా అని అడుగుతుంది. వెంటనే వసుధార రమ్మంటుందని ఆమెకు చెబుతుంది.
వసుధార రూమ్‌కి వెళ్లి, రమ్మన్నావంటా అని జగతి అడుగుతుంది. లేదని సమాధానం చెప్పే లోపు దేవయానికి గదిలోకి వచ్చి గడియ పెడుతుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార రూమ్‌లో సూటిపోటి మాటలతో బాధ పడుతుంది. ఆమె అనే మాటలు తట్టుకోలేక ఇంటి నుంచి బయలుదేరిన వసుధారను రిషి వెనక్కి పిలుస్తాడు.


Click it and Unblock the Notifications











