Guppedantha Manasu: దేవయాని దెబ్బకు వసు ఔట్.. ఎవరూ ఊహించని వ్యక్తి ఎంట్రీ!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసు రిషి దగ్గరవుతున్న నేపథ్యంలో దేవయాని ఎలా అయిన వారిని దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. వసుధార ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆమె బావ రాజీవ్ ఆమె మీద ఎటాక్ చేసి అర్ధరాత్రి సమయంలో వేరే చోటికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి విషయం ఊహించిన రిషి ముందే అక్కడ ఉండి ఆమెను రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్తాడు. అలా ఆమెను ఇంటికి తీసుకు వెళ్ళగా ఇంట్లో దేవయాని మొదలు మహేంద్ర సహా అందరూ ఏ అర్హతతో ఆమెను ఇంటికి తీసుకు వచ్చావు అన్నట్లు అడుగుతారు.. అయితే అవేవీ పట్టించుకోకుండా ఆమె కష్టాల్లో ఉంది కాబట్టి తీసుకు వచ్చాను అని చెప్పిన రిషి ఆమెను ఇంటి లోపలికి తీసుకువెళతాడు. మరోవైపు జగతికి కాల్ చేసిన దేవయాని.. 'వసుధార పిలుస్తోంది' అని అబద్ధం చెప్పి.. జగతి రాగానే వసు, జగతిలతో మాట్లాడటానికి ఆ గది తలుపు మూస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏం జరగడానికి లేదని

ఏం జరగడానికి లేదని

వసుధార రూమ్‌కి వెళ్లిన జగతి ఏమైంది ఎందుకు రమ్మన్నావు అని వసుధార అని అడిగితే లేదు నేనేమి రమ్మన లేదు అని ఆమె అంటుంది.. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన దేవయాని నేను మాట్లాడడానికి రమ్మన్నాను అని అంటుంది. ఏదో పూర్వజన్మ ఫలం వల్ల జగతి ఇక్కడికి వచ్చింది మరి వసుధార ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఏ అర్హతతో వచ్చావని వసుధారను నిలదీస్తుంది. మధ్యలో జగతి ఏదో అనబోతుంటే గా నువ్వు మాట్లాడవద్దని హెచ్చరిస్తుంది. వసుధారను మధ్యలో పెట్టుకొని రిషిని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నవని జగతి మీద కూడా పెద్ద ఎత్తున విరుచుకు పడుతుంది దేవయాని. ఇల్లు నాది పెత్తనం నాది అంటూ ఇక్కడ తనకు తెలియకుండా ఏం జరగడానికి లేదని ఆమె తన ఆక్రోశాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

నీకున్న అర్హత ఏంటి?

నీకున్న అర్హత ఏంటి?

చాప కింద నీరులా రిషికి ఉచ్చు వేసి వలపు వలతో బంధించాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇద్దరినీ నిందిస్తూ ఉంటుంది. నేను బతికి ఉండగా మీ ఆటలు సాగవని అంటుంది దేవయాని. ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్లతో వెళ్లిపోతారా అని వసుధారను దేవయాని బాధ పెట్టేలా మాట్లాడుతుంది. అసలు బావా బావా.. సరిగ్గా రిషి సార్ వచ్చినప్పుడు నువ్వు నా గదికి రా.. నన్ను తీసుకుని వెళ్తున్నట్లు బిల్డప్ కొట్టు.. అప్పుడు నన్ను రిషి సార్ తన ఇంటికి తీసుకుని వెళ్తారు' అంటూ ఈ వసుధార ప్లాన్ చేసి ఉంటుంది అంటూ ఆమె వసుధార బాధ పడే విధంగా మరిన్ని ఆరోపణలు చేస్తుంది. అవును వసుధార అసలు ఈ ఇంట్లో ఉండటానికి నీకున్న అర్హత ఏంటి? రిషి స్టూడెంట్‌ని అంటావా వాళ్లంతా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నానికి వెళ్లిపోతారు.

వెళ్ళిపోతాను అని

వెళ్ళిపోతాను అని

కదా కానీ నువ్వు ఉండిపోవడానికి వచ్చావ్ అదెలా సాధ్యం? అంటూ ఆమె మనసు విరిగిపోయే విధంగా మాటలు మాట్లాడడం మొదలు పెడుతుంది. అయినా మీరు ఇద్దరూ కావాలనే ఇదంతా ప్లాన్ చేస్తున్నారు కదా.. అంటూ దేవయాని జగతి వసుధారా ఇద్దరిని కలిపి తప్పుగా మాట్లాడుతుంది. అప్పటికే దుఃఖంలో ఉన్న వసుధార దేవయాని వేస్తున్నారు పనులు విని తట్టుకోలేక పోతుంది ఆమె విపరీతంగా ఏడవడం మొదలు పెడుతుంది. అయితే నిద్ర లేచిన మహేంద్ర తన పక్కన జగతి లేదన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆమె ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ బయటకు వస్తాడు. అదే సమయంలో మహేంద్రను చూసిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పి దేవయాని అక్కడినుంచి జారుకుంటుంది.

జగతి కూడా

జగతి కూడా

మహేంద్ర కంగారు పడుతూ జగతి ఏం జరిగింది మిమ్మల్ని వదినగ ఏమైనా అన్నారా' అని అడుగుతాడు. అప్పుడే వసుధార ఏడుస్తూ.. 'నా కారణం మీ కుటుంబానికి, జగతి మేడమ్‌కి, రిషి సార్‌కి చెడ్డ పేరు వస్తోందనీ నేను ఇక్కడ ఉండటానికి ఏ అర్హత ఉంది నాకు' అంటూ చాలా దీనంగా అడుగుతుంది. ఈ నేపథ్యంలో మహేంద్ర నువ్వు ఆలోచించవద్దు నిన్ను తీసుకొని వచ్చింది కాబట్టి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది వాడే నువ్వు మాత్రం ఏ మాత్రం బాధ పడదు అని ధైర్యం చెబుతాడు. నిన్ను రిషి తీసుకొచ్చాడు.. వెళ్లమని హక్కు రిషికే ఉందని చెప్పి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆమెకు కొంత ధైర్యం చెప్పిన తర్వాత జగతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

వసుకు పోటీగా మాజీ లవర్

వసుకు పోటీగా మాజీ లవర్

తెల్లారేసరికి హాల్‌లో కూర్చొని ఉన్న దేవయాని ఇల్లు సత్రంలా మారిపోయిందని ఎవరెవరో వస్తున్నారని దెప్పి పొడవడం మొదలుపెడుతుంది. ఇంతలో బ్యాగ్ పట్టుకొని వసుధార బయటకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆమెను బయటకు వెళ్ళే సమయంలోనే రిషీ ఎంట్రీ ఇచ్చి వసుధార ఎందుకు వెళ్లిపోతున్నావో చెప్పమని అడిగితే తాను ఎందుకు ఉండాలో ఒక్క కారణం చెప్పమని అడుగుతుంది వసుధార. అక్కడి తో ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి సరైన సమాధానం చెప్పకపోవడంతో బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతుంది. రిషి బాధగా చూస్తూ ఉండగా ఆమె అలా వెళ్ళగానే రిషి మాజీ లవర్ సాక్షి దిగుతుంది. రిషి ఎందుకు వచ్చావు అని అడిగితే 'నాకు ఆ అర్హత ఉందనే వచ్చాను' అంటుంది. రాబోతున్న ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X