twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: రిషి ప్రేమలో తడిసి ముద్దవుతున్న వసుధార.. కాలేజ్ లో రిషికి అనుకోని షాక్!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. అయితే మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం మీద రిషి అందరికీ షాక్ న్యూస్ చెప్పాడు. అలా చెప్పడంతో అందరూ ఆనంద పడుతూ ఉండగా దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత వసుధార రిషిని ఒక చోటకు తీసుకు వెళ్లి హోలీ సంబరాల్లో మునిగి తేలేలా చేస్తుంది. అలా గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

     సెల్ఫీ తీసుకుందామా అని

    సెల్ఫీ తీసుకుందామా అని

    రిషిని హోలీ వేడుకల కోసం తీసుకువెళ్ళిన వసుధార అక్కడ అతనికి రంగులు అడ్డుతుంది. రిషి కూడా మొదట తటపటాయించి ఆ తర్వాత వెంట పడి ఆమె మీద రంగులు చల్లుతాడు. చాలా సేపు వారి మధ్య ఈ రంగుల యుద్ధం జరుగుతుంది. రంగులలో మునిగిన వసు - రిషి ఇద్దరూ కూడా తమ తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.

    రిషి ఎంజాయ్ చేస్తున్న విధానం చూసిన తర్వాత వసుధార అసలు ఈయన మా రిషి సర్ ఏనా? అని అనుమాన పడుతుంది కూడా. రిషి అక్కడ ఉన్న డోలు కూడా తీసుకుని వాయిస్తూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రిషి అలా ఎంజాయ్ చేయడం చూసి వసుధార కూడా చాలా ఆనంద పడుతుంది. హోలీ వేడుకలు ముగిసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరూ ఒక బల్ల మీద కూర్చుని ఉంటారు. బల్ల మీద కూర్చుని మాట్లాడుతూ ఉండగా నేను ఇప్పుడు చాలా బాగున్నాను ఒక సెల్ఫీ తీసుకుందామా అని వసు రిషిని అడుగుతుంది.

    సెల్ఫీ తీసుకుందామా అని

    సెల్ఫీ తీసుకుందామా అని

    దానికీ రిషి నేనిప్పుడు సెల్ఫీ తీసుకుందాం అంటే వద్దంటానా, తీసుకుందాం అంటానా అని అడిగితే నాకెందుకో తీసుకుందామని అంటారేమో అనిపిస్తుంది అని వసు అంటుంది. అవును నిజమే సెల్ఫీ తీసుకుందాం రమ్మని ఒక సెల్ఫీ తీసుకుంటాడు రిషి. మరోపక్క దేవయాని ఇంటికి వచ్చిన తర్వాత ఫణీంద్రతో కూర్చుని తన బాధ అంతా వ్యక్తం చేస్తూ ఉంటుంది.

    జగతికి మళ్లీ పదవి ఇవ్వడం ఏ మాత్రం ఊహించని దేవయాని ఆ విషయం మింగుడు పడక పోవడంతో ఎవరిని ఏమనాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది. ఫణీంద్ర జరిగిందేదో జరిగింది వదిలేయమని అంటే మన కాలేజీ పరువు పోయింది అని బాధపడుతూ ఉంటుంది. అలా అనుకుంటున్న వ్యక్తివి నువ్వు ఒక్కదానివే మన కాలేజీ కి ఎలాంటి ఢోకా లేదు అని చెబుతూ ఫణీంద్ర ఒకరికి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్లు మీ కాలేజీ గురించి న్యూస్ లో చూస్తున్నాము అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు చిన్నవయసులోనే రిషి ఒక చక్కటి నిర్ణయాన్ని అందరి మంచి కోసం చేశారు అంటూ ప్రశంసిస్తాడు. అయినా సరే దేవయాని గుండెల్లో మంట మాత్రం చల్లారదు.

    గౌతమ్ కు కూడా పూసి

    గౌతమ్ కు కూడా పూసి

    అదే సమయంలో రిషి రంగులలో మునిగి తేలి ఇంటికి వస్తాడు ఏం జరిగింది అని అడగకుండానే తాను బస్తీ నుంచి వస్తుంటే అక్కడి వాళ్ళు తనను అని చెబుతాడు. ఫణీంద్ర మరేం పర్వాలేదు నీ గదికి నువ్వు వెళ్లి రెడీ అవమని పంపిస్తే దేవయానికి మాత్రం అనుమానం వస్తుంది. మధ్యలో అడ్డం వచ్చిన గౌతమ్ మరి ఏంట్రా ఇది నేను కదా నీకు మంచి ఫ్రెండ్ ని. నేను కదా నీ ముఖం మీద ఇంత ధైర్యంగా రంగులు పూజ కలిగింది నేను కాకుండా ఇంకా ఎవరు నీకు రంగులు పూశారు అని అడుగుతాడు. అయితే గౌతమ్ ఎంత అడుగుతున్నా వసుధారను గుర్తు చేసుకుని సిగ్గుపడుతున్న రిషి ఆ విషయాలేవీ బయటపెట్టకుండా తన ఒంటి మీద ఉన్న కాస్త రంగు తీసి గౌతమ్ కు కూడా పూసి తన గదికి వెళ్లి పోతాడు.

    ముద్దు పెడుతూ

    ముద్దు పెడుతూ

    ఆ తర్వాత వసుధార నుంచి రిషి కి ఫోన్ వస్తుంది చాలా ప్రేమగా మాట్లాడుతూ తిన్నారా అని అడిగితే ఈరోజు ఆప్యాయతతో కడుపు నిండిపోయింది అని రిషి చెబుతాడు. ఆ తర్వాత రోజు కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మీటింగ్ జరుగుతుండటంతో అక్కడికి వసు కూడా వెళుతుంది. రిషి సార్ వస్తున్నారు అని వెళితే అక్కడ లెక్చరర్లు కాస్త తేడాగా మాట్లాడుతారు.

    ఈ వ్యవహారం అంతా జగతి మేడమ్ కి అప్పగించారు కదా ఆవిడ మహేంద్ర సార్ కలిసి చూసుకుంటారు ఇంకా దీని మీద పెత్తనం చెలాయించడం ఏమిటి అన్న విధంగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చి ఈ మాటలు విని రిషి బాధపడి వెళ్ళిపోతాడు. దారిలో వచ్చిన మహేంద్రతో వెళ్ళిపోతున్నాను అని చెబుతాడు. జగతి ఎదురు వస్తే మాత్రం సైలెంట్ గా నమస్కారం చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు తరువాయి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి వసును కిస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

    గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్

    గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్

    ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగితా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.98 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.

    English summary
    Guppedantha Manasu Episode 414: Vasudhara backs Rishi when his colleagues speak against him. Meanwhile, Jagathi suspects Rishi's grave decision of quitting the meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X