Guppedantha Manasu: అర్ధరాత్రి ముసుగేసుకుని కూడా రిషితో చాటింగ్.. జగతికి అడ్డంగా దొరికేసిన వసు

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. వసుధార రిషిని ఒక చోటకు తీసుకు వెళ్లి హోలీ సంబరాల్లో మునిగి తేలేలా చేస్తుంది. ఆ తరువాత కూడా ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓడిపోతే

ఓడిపోతే

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీటింగ్ ఎగ్గొట్టిన రిషి...తన క్యాబిన్ లో కూర్చుని చెస్ ఆడుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్లిన వసు ఏంటో రెండు వైపులా రిషి సార్ ఆడుకుంటున్నారు..ఆయన మూడ్ బాగున్నట్టా లేనట్టా అనుకుంటూ లోపలికి వెళుతుంది. నువ్వేంటి నువ్వు కూడా ఏదైనా రాజీనామా చేస్తావా ఏంటి? అంటే నాకేం పోస్ట్ ఉందని రాజీనామా చేస్తానని అంటుంది. అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా అంటే అసలు నేను మీకు అసిస్టెంట్ నా, జగతిమేడంకి అసిస్టెంట్ నో అర్థం కావడం లేదని అంటుంది. దానికి కొన్ని క్లారిటీ లేకపోతే బాగుంటుంది కానీ చెస్ ఆడుదాం రమ్మని అంటాడు. ఊరికే ఆడితే కిక్కేముంది మీరు ఓడిపోతే నేను చెప్పిన ఓ మాట వినాలని కండిషన్ పెడుతుంది. ఈ ఆటలో వసుధారని ఓడించడం ఈజీ కానీ కావాలని ఓడిపోయి చూద్దాం ఏం అడుగుతుందనేది అనుకుంటాడు

దే పదే ఎంట్రన్స్ వైపు

దే పదే ఎంట్రన్స్ వైపు


అలా ఆట అడి గెలిచిన వసుధార ఈ పేపర్స్ మేడం మిమ్మల్ని చూడమన్నారు...ఇవి చూడండి చాలని అంటుంది. మీరు కావాలనే ఓడిపోయారని నాకు తెలుసు..ఈ ప్రొపోజల్ పై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా నియమించారు...బాధ్యత వారికి అప్పగించాక నేను జోక్యం చేసుకోవద్దు అనుకున్నానని అంటదు. మీకు చూపించాకే ఏదైనా ఫైనల్ అని మేడం అనుకుంటున్నారు...ఇది మేడంకి మీ పై ఉన్న గౌరవం అంటుంది. దీంతో రిషి మీ మేడం గొప్పతనం చెప్పే తీరక నీకుంది కానీ వినే ఓపిక నాకు లేదు, జీవితం కూడా చెస్ లాంటిదే..ఎవరి ఎత్తుగడలు వారివి, గెలుపా-ఓటమా అనే కానీ మంచి చెడులు ఎవ్వరూ చూడరని క్లాస్ పీకుతాడు. ఇక రెస్టారెంట్లో డ్యూటీ చేస్తున్నా వసుధార పదే పదే ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉంటుంది..

ధరణికి కాల్ చేసి

ధరణికి కాల్ చేసి

రిషి సార్ వస్తారనుకున్నాను రాలేదేంటి అనుకుంటుంది. ఓసారి ధరణి గారికి కాల్ చేద్దాం అనుకుని కాల్ చేస్తే ఆ కాల్ దేవయాని రిసీవ్ చేసుకుంటుంది. ధరణి మేడం బిజీగా ఉన్నారు చెప్పండి వసుధార మేడం అని అంటే ఓసారి ఫోన్ ధరణి మేడంకి ఫోన్ ఇవ్వండి..మాట్లాడాలని అంటుంది. ధరణి మేడంకి నేను అసిస్టెంట్ ని కాదు అంటే అందుకే వెళ్లి ఆవిడకు ఫోన్ ఇవ్వండని అంటుంది. ఏం పనిలేదా అని దేవయాని అడిగితే పని ఉండే కాల్ చేశాను.. రిషి సార్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది అందుకే ధరణి మేడంకి కాల్ చేశాను అని అంటుంది. పొద్దున్న నుంచి కాలేజీ లోనే ఉంటారు కదా... మళ్లీ రిషికి కాల్ చేయడం అవసరమా అంటే మహా అవసరం...అత్యవసరం అని కౌంటర్ ఇస్తుంది. ఏంటో అది అంటే అవన్నీ మీకెందుకులెండి... ఆయన మా బాస్, నేను ఆయన స్టూడెంట్ ని అంటుంది.

సరదాగా రిషి

సరదాగా రిషి

ఇక దూరం నుంచి ఇదంతా విన్న రిషి సైలెంట్ గా అక్కడి నుంచి రెస్టారెంట్ కి వెళతాడు. అప్పుడే బయటకు వస్తున్న వసుతో రిషి ఏదో మాట్లాడాలి అన్నావ్ అంటే రెస్టారెంట్ క్లోజ్ అయ్యాక వచ్చారు..ఇప్పుడేం మాట్లాడతాను ఎక్కడ మాట్లాడాలి అంటుంది, దానికి రిషి మనసుంటే మార్గాలుంటాయ్...ఎక్కడైనా మాట్లాడుకోవచ్చని అంటాడు. నీకు నాతో మాట్లాడాలని ఉంటే నాకు కాల్ చేయాలి...వరుస పెట్టి ఇంట్లో వాళ్లకి కాల్ చేయడం ఎందుకు అని అడిగితే ఫస్ట్ మీకే కాల్ చేశాను...ఆ తర్వాతే ధరణి గారికి కాల్ చేశానని అంటుంది. ఎంత సేపటికి ఏమీ చెప్పకపోవడంతో రిషి ఆటోని పిలిచి ఎక్కమని చెబితే... తిరిగి పంపించేస్తుంది వసుధార. ఇప్పుడెలా వెళతావ్ వసుధార అంటే మా ఎండీగారి కారుంది..లిఫ్ట్ ఇస్తారని అంటుంది.

జగతికి దొరికేసి

జగతికి దొరికేసి

మీ ఎండీగారు కోపంగా ఉన్నారు కదా? అంటే వసుధార నేను భరిస్తానని అంటుంది. ఇక అలా వారి మధ్య మాటలు నడుస్తూ ఉండగా గౌతమ్ ఇంటికి వచ్చి రిషి ఎక్కడికి వెళ్లాడు అని ధరణిని అడుగుతాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వచ్చి ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఖచ్చితంగా దాని దగ్గరకే వెళతాడు. అనుకుంటుంది. ఇక అలా నేటి ఎపిసోడ్ ముగిసింది. తదుపరి ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం ముసుగేసుకుని రిషితో చాటింగ్ చేస్తుంటుంది వసుధార. గమనించిన జగతి..ముసుగేసుకుని ఎందుకు మామూలుగానే చాటింగ్ చేయొచ్చుకదా... అవునులే మా రోజుల్లో ఇవన్నీ లేవు అంటుంది. వసుధార ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఏంటి సైలెంట్ గా ఉన్నావని రిషి మెసేజ్ చేయడంతో... తొందరగా రిప్లై ఇవ్వు అంతూ ఆట పట్టిస్తుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X