Guppedantha Manasu: రిషి కళ్ళు తెరిపించిన జగతి.. హుటాహుటిన హాస్పిటల్ కు మహేంద్ర?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. క్లాస్ రూమ్లో చెప్పిన లెసన్ మళ్లీ చెబుతున్నారని వపీకుతాడు. సాధన, బోధన, శోధన అంటూ కాస్త క్లాస్ పీకుతూ ఉండగా ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది.

పెత్తనం అవసరమా
ఇక రిషి క్యాబిన్ కి వెళ్ళేసరికి అక్కడ కూర్చుని ఉన్న వసుధార ఆడుకుంటూ ఉంటుంది. దీంతో సరదాగా ఎక్సూజ్ మీ మేడం లోపలకు రావొచ్చా అని అడిగితే ఇది మీ క్యాబినే కదా నన్ను అడుగుతారేంటి అని వసుధార అంటే మీరు నా క్యాబిన్లో కూర్చుని ఆట్లాడుకుంటుంటే ఇది నా క్యాబినో కాదో అని డౌట్ వచ్చింది అని అంటాడు. వసుని కూర్చోమంటే కూర్చోవడం లేదని రిషి కూడా నిల్చుంటాడు. అప్పుడు వసుధార కూర్చోగా వసుధార: రెండు డౌట్స్ ఉన్నాయి సర్ అంటే డౌట్స్ క్లాస్ రూమ్ లో అడగాలి కదా అంటాడు. అవి ఆ డౌట్స్ కాదులే అని చెప్పి మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ కి ఎందుకు రాలేదని అంటే ఏమీ మాట్లాడడు, రెండో ప్రశ్నకు మొదటి ప్రశ్న సమాధానం విన్నాకే అడుగుతాను అనడంతో ఇద్దరు డైరెక్టర్స్ ని అపాయింట్ చేశాను..ఇక నా పెత్తనం అవసరమా అంటాడు.

జీతం క్రమం తప్పకుండా
దీంతో వసుధార రిషి సార్ మేడం అన్న మాటలు విన్నారా లేదా క్యాజువల్ గా అంటున్నారా అని ఆలోచిస్తూ ఉండగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ స్వతంత్ర సంస్థగా మారింది..ఆ పని జగతి మేడం, డాడ్ చూసుకుంటారు..నాపై ఎక్కువ ఆధారపడొద్దని అంటాడు. దీంతో వసుధార నేను మీకు ఈ ప్రాజెక్ట్ కి అసిస్టెంట్ గా ఉన్నానా లేదా అంటే ప్రాజెక్టులో నేను పనిచేయనని చెప్పను కానీ నా పాత్ర తగ్గిపోతుంది...అసిస్టెంట్ ఉద్యోగంలో ఉండాలో వద్దో నిర్ణయం నీకే వదిలేస్తున్నా... ప్రాజెక్టు పనులే కాకుండా ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేయొచ్చు కానీ మీ మేడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లమని, ప్రాజెక్ట్ పనే కాదు నీ చదువుమీద కూడా దృష్టిపెట్టమని నీ జీతం క్రమం తప్పకుండా పడుతుందని అంటాడు.

భరించలేకపోతున్నారని
ఇంతలో కవర్ పట్టుకుని రిషి క్యాబిన్ కి వెళ్లిన జగతి ఆ కవర్ టేబుల్ పై పెడుతుంది. ఏంటి మేడం అవి అంటే మహేంద్ర ట్యాబ్లెట్స్ సార్..తను ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని అంటుంది. ఒక్కోసారి నా మాట వింటున్నారు, ఒక్కోసారి వినరు..ఇవన్నీ శరీరానికి ఇచ్చే మందులు..మహేంద్ర మనసుకి మందులు కావాలి... మహేంద్ర తను నా ఇంటికి మా ఆయనగా వచ్చారు కానీ మా ఆయన అక్కడ సంతోషంగా లేరని అంటుంది. మా అబ్బాయిని మిస్సవుతున్నారు...మా ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం...నాకు దూరంగా 20ఏళ్ల పైగా ఉన్నారు కానీ ఇప్పుడింత బాధపడలేదు.. మా అబ్బాయికి దూరమై ఇప్పుడు భరించలేకపోతున్నారని అంటుంది.

ఇద్దరూ బాగానే
అలా కాస్త బాధ పడిన తరువాత జగతి వెళ్లిపోయిన వెంటనే తర్వాత గౌతమ్ కి కాల్ చేసిన రిషి ఏదో చెబుతాడు. ఈ రిషి గాడు ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నాడు, నాకు పనులు చెబుతున్నాడు లేనిపోని డ్యూటీలు వేస్తున్నాడని గౌతమ్ బాధ పడతాడు. జగతి-వసుధార వెళ్లిపోతుంటే నా కార్ అంటూ మహేంద్ర పరిగెత్తుతాడు. అయినా ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటిది గౌతమ్ నాకు చెప్పకుండా వెళ్లిపోతున్నారని అడిగితే అంకుల్ మీ ప్రోగ్రాం మారింది...రిషి ఓ చోటుకి తీసుకుని రమ్మన్నాడని చెబుతాడు గౌతమ్. రిషి సార్ మహేందర్ సార్ ని ఎక్కడికి తీసుకువెళుతున్నారు అని వసు జగతిని అడిగితే అది చెప్పకుండా నాకన్నా-మహేంద్ర కన్నా రిషిని నువ్వే బాగా అర్థం చేసుకున్నావ్...మరి నువ్వేంటి ఇలా మాట్లాడతున్నావని ఉంటుంది జగతి. రిషి సార్ గారి లాంటివారు.. అప్పుడే చల్లగా ఉంటారు, అప్పుడే వేడెక్కుతారని అంటే మీ ఇద్దరూ తోడు దొంగలే...ఇద్దరూ బాగానే అర్థం చేసుకుంటారు.

చిలిపి తగాదాలు
.బయటకు చిలిపి తగాదాలు పెట్టుకుంటారు...ఏం జరిగిందో నువ్వే చెబుతావ్ లే వసు అనుకుంటుంది జగతి. ఇక హాస్పిటల్ కి మహేంద్ర, గౌతమ్, రిషి చేరుకోగా ఇక్కడకు ఎందుకు వచ్చాం అని మహేంద్ర అడిగితే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నా అయ్యాక మాట్లాడుదాం అంటాడు. నాకేమైందని హాస్పిటల్ కి తీసుకొచ్చావ్ అంటే జస్ట్ జనరల్ చెకప్ అంతే అంటాడు. ఇక అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి ఎపిసోడ్ కమింగ్ అప్ లో ఇంటి బయట కార్లో ఉన్న రిషికి ఓ కప్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది వసుధార. అది కరిగిపోవడంతో ఏంటిది పాయసమా అంటాడు రిషి..కాదు సార్ ఐస్ క్రీం అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్... పాయసం వాడొక్కడికే ఇస్తావా అంటూ లాక్కుని తాగేస్తాడు. అరేయ్ పాయసం నాక్కూడా ఉంచు అని వసుని ఉడికించి ప్రయత్నం చేస్తుంటాడు రిషి.


Click it and Unblock the Notifications











