Guppedantha Manasu: దేవయానికి షాకిచ్చిన జగతి.. పెద్ద స్కెచ్ తో రంగంలోకి వసుధార!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. క్లాస్ రూమ్లో చెప్పిన లెసన్ మళ్లీ చెబుతున్నారని పీకుతాడు. ఇక జగతి మహేంద్ర మందులు వేసుకోవడం లేదని చెప్పడంతో చెప్పా పెట్టకుండా హాస్పిటల్ కు తీసుకు వెళతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నువ్వున్నావ్ కదా
హాస్పిటల్ కి వెళ్ళాక డాక్టర్ మళ్లీ అన్ని టెస్టులు చేయాలని చెప్పడంతో నేను బాగానే ఉన్నానంటున్న మహేంద్రతో డాక్టర్ అలా అనుకోవద్దని చెప్పి టెస్టులు చేయిస్తాడు. ఆ తరువాత మహేంద్ర గారు టైమ్ కి భోజనం చేయండి మందులు సరిగ్గా వేసుకోండని డాక్టర్ చెప్పడంతో..ఆ రెండు విషయాలు తప్ప అన్నీ పాటిస్తారని రిషి కౌంటర్ వేస్తాడు. రిషికి నేనంటే ఎంత ప్రేమో చెప్పకుండా డాక్టర్ దగ్గరకు తీసుకు వచ్చాడు..ఇప్పుడు కూడా సీరియస్ గా ఉంటాడేంటో అనుకుంటాడు మహేంద్ర. నేను నిర్లక్ష్యంగా ఉన్నా నాకు నువ్వున్నావ్ కదా రిషి అది చాలు నాకు అంటాడు మహేంద్ర.

దూరం అయ్యేది దగ్గరవడానికి
ఇక ముగ్గురూ కారులో బయలుదేరారు. రిషి ఏంటి డాడ్ అలా చూస్తున్నారని అంటే దానికి మహేంద్ర: చూస్తాం భాయ్ నా కొడుకుని చూస్తా నీకేంటిని అడుగుతాడు. దూరం నుంచి చూడటం అవసరమా అని అంటే మహేంద్ర దూరం అయ్యేది దగ్గరవడానికి కదా అంటారు. ఇక మరోపక్క ఇంట్లో ఉన్న జగతి..మహేంద్ర ఎక్కడికి వెళ్లాడో అని ఆలోచనలో పడుతుంది. గౌతమ్ కి కాల్ చేయాలా అని అలోచించి వద్దులే అనుకుని మహేంద్రకి కాల్ చేస్తుంది. మహేంద్ర కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే, రిషి ఎవరు కాల్ చేస్తున్నారో నాకు తెలుసు, కాల్ లిఫ్ట్ చేయండి దగ్గర్లోనే ఉన్నాం వస్తున్నాం అని చెప్పండని అంటదు.

నేనూ అదే తినాలి
మహేంద్ర కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నాను దగ్గర్లోనే ఉన్నా అని సమాధానం చెబుతాడు. ఇంటి ముందు కారు ఆగడంతో కంగారుగా బయటకు వెళ్తుంది జగతి. వసు నువ్వెళ్ళు బయటకు అని చెప్పిన జగతి మహేంద్ర రాక కోసం గుమ్మం ముందు ఎదురుచూస్తుంది. రిషి లోపలికి రావొచ్చు కదా అని మహేంద్ర అంటే..నేను రావడం కాదు మీరు రావాలని ఆశిస్తున్నాను అంటాడు. పదండి అంకుల్ అని గౌతమ్ అంటే..నువ్వెక్కడికి అని అడుగుతాడు రిషి. ఇంకా అడగడం లేదేంటా అనుకుంటున్నా అని చెప్పి అంకుల్ ని లోపల దిగబెట్టి వస్తాను రా అని వెళతాడు గౌతమ్. ఇక జగతి తన కొడుక్కి ఏమైనా ఇమ్మని, కొంచెం సేపు ఆయనతో ఉండమని వసుతో అంటుంది. గౌతమ్ వసుధార వాడికి ఏం ఇస్తున్నావో అదే నాక్కూడా ఇవ్వు అంటాడు. వాడూ నేను ఒకటే కదా వాడేం తింటే నేనూ అదే తినాలి అంటాడు.

ఐస్ క్రీం ఫ్లేవర్ లా
ఇక వసు అలా ఓ కప్ తీసుకెళ్లి రిషికి ఇస్తుంది. రిషి ఏంటి పాయసమా ఇది అని అడిగితే వసుధార అది పాయసంలా కనిపిస్తోందా అని అడుగుతుంది. ఏదైనా కొత్త స్వీట్ ట్రై చేశావా ఏంటి అంటే అది ఐస్ క్రీం అని అంటుంది. రిషి సూప్ లా, పాయసంలా ఐస్ క్రీం అనే ఈ ద్రవ పదార్థాన్ని నేను అస్వాదిస్తానని అంటదు. ఇంతలో అక్కడకు వెళ్లిన గౌతమ్ ...వసుధార ఇది అన్యాయం నాకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వాడికి పాయసం ఇస్తావా అని కప్ లాక్కుని తాగేస్తాడు. తాగి పాయసం బాగుంది, కాకపోతే కొంచెం ఐస్ క్రీం ఫ్లేవర్ లా ఉంది, వసుధార..నువ్వే చేశావా( అని అడిగితే దానికి రిషి నవ్వుకుంటాడు.

ఇంతటితో వదిలేయండని
మరోపక్క దేవయాని ధరణిని ఆడుకునే పనిలో ఉంది. ఇంతలో గౌతమ్, రిషి ఎంట్రీ ఇస్తారు. ఏంటి లేటైంది అంటే రిషి దాటవేయడానికి ప్రయత్నిసాడు కానీ గౌతమ్మహేంద్ర అంకుల్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాం అని అంటాడు. దానికి ధరణి చిన్న మామయ్య గారికి ఏం జరిగిందని కంగారు పడితే దేవయాని ఎందుకంత కంగారు ఏదో జనరల్ చెకప్ కి తీసుకెళుతుంటాడని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఫణీంద్ర రిషి అందరి ఆరోగ్యంమీద శ్రద్ధ చూపిస్తుంటాడని అంటుంది. బయటకు వెళ్లిన మహేంద్ర మీద శ్రద్ధ ఏంటని దేవయాని అంటే రిషి ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండని వెళ్ళిపోతాడు.

పెద్ద పని
మరోపక్క దేవయాని ఇంటికి వెళ్తు వసుధార జగతి మేడం నాకు పెద్ద పని అప్పగించారు..ధరణి మేడంతో రిషి సార్ కి చెప్పించి..రిషి సార్ తో మహేంద్ర సార్ ని అడిగించి తిరిగి ఇంటికి పంపించాలని ఆలోచిస్తున్నారు. మీరు ఎంత గ్రేట్ మేడం అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అయితే ఎదురుగా దేవయాని కనిపిస్తుంది. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్ లాగా పొద్దున్నే మా ఇంట్లో ఊడిపడ్డావేంటో అని అడిగితే నీకిప్పుడు తెల్లారిందా అన్నట్టు కౌంటర్ వేస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ముగియగా రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో ఈ మనిషి ఎక్కడున్నాడో అనుకుంటూ రిషి రూమ్ లోకి వెళ్ళిన వసుధార అతని టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీక చూసి గత సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. ఏదేదో మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిషి రాగా కంగారు పడి చేతిలోని డబ్బా విసిరేయగా అది వెళ్లి చేతుల్లో పడుతుంది.

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్
ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగతా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.93 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











