Guppedantha Manasu: మహేంద్ర దెబ్బకు షాక్ లో రిషి .. జగతి, వసుధారల ప్లాన్ ఫలిస్తోందిగా?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. మహేంద్ర మందులు వేసుకోవడం లేదని చెప్పడంతో చెప్పా పెట్టకుండా హాస్పిటల్ కు తీసుకు వెళతాడు రిషి. ఎలా అయినా మహేంద్రను వెనక్కు పంపాలని జగతి ప్లాన్ వేయగా వసు రిషి ఇంటికి వెళుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మీతో మాట్లాడాలి అని
ఇంటికి వచ్చిన వసును గుమ్మంలోనే అడ్డుకున్న క్రమంలో ఆమెకు వసు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. రిషి ఇంట్లో లేనప్పుడు నీకు ఇంట్లో ఏం పని అని వసును దేవయాని అడగడంతో వసు మహేంద్ర సార్ పంపారు అని ఆమెకు అబద్దం చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణితో మహేంద్ర సార్ బుక్స్, వస్తువులేవో మీ గదిలో ఉన్నాయట కదా వాటి కోసం వచ్చాను అని ధరణి తో చెబుతుంది. ఇంతలో జగతి మేడం పంపారు మీతో మాట్లాడాలి అని మెసేజ్ పెడుతుంది. సరే రమ్మని ధరణి అనడంతో మీరు కూడా వస్తారా? నా మీద అనుమానం ఎక్కువ కదా అని అంటే నేను వచ్చి చూసే అంత రేంజ్ నీది కాదులే అనుకుని వెళ్ళిపోతుంది.

ఏదో ఒకటి చేయాలని
దీంతో నీ లాంటి కోడలు పిల్ల ఈ ఇంటికి వస్తే అప్పుడు ఉంటుంది అత్తయ్య గారికి అని ధరణి మనసులో అనుకుంటుంది. ఇక గదిలోకి వచ్చాక వసు తాను వచ్చిన పని మొదలు పెడుతుంది. రిషి సార్ తో ఎలాగైనా మహేంద్ర గారిని ఈ ఇంటికి తీసుకు రమ్మని చెప్పండి అని అంటుంది. నేనెలా చెబుతాను చెబితే వింటాడా అని అడుగుతుంది. అంతేకాక చినమావయ్యగారు ఇంట్లోంచి వెళ్లడం ఇప్పటికీ రిషికి అర్థంకావడం లేదని అంటే, మహేంద్ర సార్ సహనం, జగతి మేడం ప్రేమ, రిషి సార్ అపనమ్మకం అంటూ మాట్లాడి మీరే ఏదో ఒకటి చేయాలని అంటుంది.

సీరియస్ సింహం గారూ
మరోపక్క అటు రిషి రూమ్ లో టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీకలు చూస్తూ...అవి ఏ సందర్భంలో వసుధార తనకి ఇచ్చిందో గుర్తుచేసుకున్నాడు. స్నానికి వెళ్లగా ధరణితో మాట్లాడి వెళ్లిపోతూ రిషి రూమ్ లోకి వెళ్ళింది వసుధార...టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీక, తాను ఎంగిలి చేసిన కర్చీఫ్ అక్కడ ఉండడం చూస్తుంది.
ఆ వస్తువులను చూసి మురిసి పోతుంది. రిషి సార్ నన్ను అంటారు దాచుకుంటావని... ఇదే మాట నేను రిషి సార్ ని అడిగితే ఏమంటారో తెలుసా...అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బయటకు వచ్చిన రిషి ఈ పొగరేంటి ఇక్కడుంది...నిజమా...నా భ్రమనా అనుకుంటూ ఉండగా వసుధార ఇవన్నీ ఎందుకు దాచావు సీరియస్ సింహం గారూ అంటే ఏయ్ వసుధార ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటారు అనుకుంటుంది..

చేయి కడుక్కుని
ఇక ఈలోపు అక్కడకు రిషి వచ్చి వసును చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వసును రిషి వెక్కిరించినట్లు మాట్లాడతాడు. ఇక వస్తువులన్నీ చూసిందా.. ఇవన్నీ ఎక్కడ దాచాలి అని ఆలోచిస్తూ దాచేపనిలో పడతాడు. దీంతో ..జ్ఞాపకాలు గుండెల్లో, వస్తువులు ఇంట్లో, కోపాన్ని మనసులో దాచుకోవాలని చెబుతుంది. మరోవైపు ఏరా ఈ మధ్య మరీ నల్లపూసై పోయావ్ అని గౌతమ్ అంటే.. నల్లపూస అంటే రిషి అడగడంతో బిజీగా ఉండి అప్పుడప్పుడు కనిపించకపోతే అలాగే అంటారని ధరణి చెబుతుంది.
ఆ మాత్రం రిషికి తెలియదా అని ఫైర్ అయిన దేవయాని, మహేంద్ర టూమచ్ చేస్తున్నారు...నన్నేమన్నా నేను పట్టించుకోను రిషి, కానీ తనకు పుస్తకాలు కావాలని వసుధారని పంపించారని అంటుంది. దానికి ఫణీంద్ర అందులో తప్పేముందని అడిగితే మీరు ప్రతి దానికీ తప్పులన్నీ నావైపు ఉన్నట్టు మాట్లాడతారని అంటాడు. దీంతో ఫణీంద్ర తినే ప్లేట్ దగ్గర చేయి కడుక్కుని వెళ్లిపోతాడు...

ఒక్కరే సమాధానం చెప్పగలరని
వెంటనే దేవయాని అలాగే కడుక్కుని వెళ్లిపోతుంది. గౌతమ్ కూడా చేయి కడిగేసుకుని ఈ టాపిక్ నేనే తీశానురా సారీ అనేసి వెళ్లిపోతాడు... ఏంటి వదినా ఇది అని రిషి అంటే.. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలం అని ధరణి అంటుంది. ఇక డాడ్ లేని ఇల్లు ఏదోలా ఉందని రిషి అనడంతో ఏదో ఒకటి చేసి చినమావయ్యగారిని తీసుకురా రిషి అంటుంది ధరణి.
అలా రూమ్ లో కూర్చుని తండ్రితో కలసి దిగిన ఫొటోలు చూస్తూ బాధపడతాడు. అయితే డాడ్ మీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దామనుకుంటున్నాను అని రిషి అనడంతో జగతి నా భార్య అని ప్రపంచానికి తెలిసింది, తనని వదిలేసి సెలబ్రెట్ చేసుకున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాకొద్దని మహేంద్ర చెబుతారు.
దీంతో ఒక చోట కూర్చుంటాడు ఇక్కడ కూర్చున్నారేంటని వసుధార అడిగితే.. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చున్నా అంటారు. మా డాడీ నాతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతారు. దీనికి ఒక్కరే సమాధానం చెప్పగలరని అంటుంది వసుధార.

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్
ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగతా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.93 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











