Guppedantha Manasu: రిషికి బర్త్ డే షాక్.. ఎక్కడా తగ్గని మహేంద్ర.. హ్యాపీ మూడ్ లో మహేంద్ర, జగతి
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే తిరిగింది. ఆ టెన్షన్ క్లియర్ అవడంతో ఇప్పుడు వసు-రిషి మధ్య లవ్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపిస్తున్నారు. వసు రిషి ఇంటికి వెళ్ళడం, ఆ తరువాత రిషితో మహేంద్రను పిలిపించేలా ప్లాన్ చేయించమని ధరణిని అడగడం చూపించారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాయి తగిలితేనే
రిషి ధరణిని లోపలి పిలవడంతో ఎందుకు పిలిచావు అంటూ ధరణి లోపలికి వస్తుంది.. మాట్లాడవేంటి రిషి అని అడిగితే క్యాలెండర్ తీసుకొచ్చి ధరణికి చూపిస్తాడు. ఏంటిది అంటే ఈ నెలకు ఓ ప్రత్యేకత ఉంది వదినా అంటాడు. నాకు అర్థం కాలేదని ఆమె అంటే ఇంతలో గౌతమ్ వచ్చి ఏదో ప్రత్యేకత అంటున్నారు ఏంటి అని అడగడంతో రిషి నేను కాలేజీకి వెళుతున్నాను అని వెళ్లబోతాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా అని గౌతమ్ అడిగితే అన్నీ తెలుసుకోవాలి అనుకోవడం అన్ని వేళలా కరెక్ట్ కాదేమోనని వెళ్ళిపోతాడు. ఇక ఏంటి వదినా వీడు..నేను ఫ్రెండ్ నే కదా..నాతో కూడా పంచుకోడని ధరణితో అంటే అద్దం కొండను కూడా చూపిస్తుంది కానీ చిన్న రాయి తగిలితేనే ముక్కలవుతుంది...రిషి మనసు కూడా అద్ధం లాంటిదే.. తను చెప్పాలనుకుంటేనే చెబుతాడని అంటుంది.

లోపలికి రాలేడా
ఇదిలా సాగుతూ ఉంటే జగతి ఇంట్లో జగతి-మహేంద్ర ఫొటోలు చూసుకుంటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటారు. ఆ ఇద్దర్నీ అలా చూసి వసుధార హ్యాపీగా భావించి వీళ్లద్దరూ ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా కలిసి ఉంటే బాగుండేదని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రిషి సార్ ఎందుకో జగతి మేడం విషయంలో అభిప్రాయం మార్చుకోవడం లేదని అంటూ ఉండగా వసుకి కాల్ చేసిన రిషి..డాడ్ ని బయటకు రమ్మని చెప్పమని కాల్ కట్ చేస్తాడు. రిషి సార్ వచ్చారు కార్లో ఉన్నారని రమ్మని అన్నారని అనగానే ఇంతదాకా వచ్చినవాడు లోపలికి రాలేడా...వాడికే అంత పంతం ఉంటే నాకెంత ఉండాలని మహేంద్ర అంటాడు. అయితే చివరికి బయటకు వెళతాడు మహేంద్ర.

గిల్టీ ఫీలింగ్
మహేంద్రను వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లిన రిషి మీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా..రిసార్ట్ బుక్ చేశాను అక్కడకు వెళదామని అంటాడు. మనం అంటే నువ్వు నేను మాత్రమే కాదు రిషి..ఇంకా ఉన్నారు కదా అంటే ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని పట్టించుకోను అని మీకు తెలుసని అంటాడు. ఇంతకుముందు జగతి అంటే ఎవ్వరికీ తెలియదు...కానీ ఇప్పుడు జగతి నా భార్య అని ప్రపంచానికి తెలిసింది..తనను కాదని నీతో సెలబ్రేషన్ కరెక్ట్ కాదు మనం అంటే నీ ఉద్దేశంలో నువ్వు నేను మాత్రమే, ఇది మారాలి రిషి అని హితబోధ చేస్తాడు. నా కోసం ఒక్కరోజు స్పెండ్ చేయలేరా అంటే ఆ ఒక్క రోజు తిరిగి రావాలంటే మళ్లీ 364 రోజులు పడుతుంది... తనని వదిలేసి వచ్చిన గిల్టీ ఫీలింగ్ నాకుండిపోతుందని అంటాడు.

కాఫీ ఇచ్చి
మీరు రానంటారని అనుకోలేదని రిషి అంటే నన్ను ఒక్కడినే పిలుస్తావ్ అనుకోలేదని మహేంద్ర అంటాడు. నా సంతోషం కోసం రావొచ్చు కదా అంటే బాధ ఒక్కరే అనుభవించొచ్చు కానీ సంతోషంగా ఉన్నప్పుడు చుట్టూ పదిమంది ఉండాలి... నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావని అంటాడు. దీంతో మళ్లీ మహేంద్రను తీసుకెళ్లి జగతి ఇంట్లో దింపేసి వస్తాడు రిషి. వసుధారతో మాట్లాడాలని రెస్టారెంట్ కి వెళ్లి లోపల కూర్చున్న రిషి...తండ్రి తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో రిషిని చూసిన వసుధార సార్ వచ్చి ఎంతసేపైందో నేను చూసుకోలేదు అనుకుని నేను చూసుకోలేదు ఎంతసేపైంది సార్ వచ్చి అంటే, ఎవరిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనడంతో కాఫీ కావాలా సార్ అని అడిగి కాఫీ ఇచ్చి కూర్చుంటుంది. వర్క్ డిస్టర్బ్ అవుతుందేమో అంటే పర్వాలేదు సార్ అంటుంది.

మౌనమే గొప్ప సమాధానం
మా డాడ్ పుట్టిన రోజుని సంతోషంగా సెలబ్రేట్ చేసేవాడిని, ప్రతిసారీ ఇద్దరం దూంగా వెళ్లిపోయేవారం...కానీ మా డాడ్ ఇప్పుడు నాకు దూరంగా వెళ్లిపోయారని చెబుతూ తన బాధ వ్యక్తం చేస్తాడు. రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిపోయిన రిషి ఓ దగ్గర కూర్చుని తండ్రి మాటలు గుర్తు చేసుకుంటాడు... అక్కడకు వెళ్లిన వసుధార...ఇక్కడ కూర్చున్నా రేంటి సార్ అంటుంది. దీంతో ఒంటరి తనం ఒక్కోసారి భయంకరంగా ఉంటుంది కదా, అంటూనే రిషి: ఎవరి భారం వాళ్లు మోయాలి, ఎవరి కష్టం వాళ్లు పడాలి... వసుధారా...మా డాడ్ నాతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతాడు. దీనికి ఒకే ఒక్కరు సమాధానం చెప్పాలని అంటే వాళ్ల మేడం పేరు చెబుతుందా అని రిషి అనుకుంటాడు కానీ ఆమె మీరే సార్ ...మీరు తప్ప ఇంకెవరూ సమాధానం చెప్పుకోలేరు అని మనసులో అనుకుంటుంది. చెప్పమంటే ఒక్కోసారి మౌనమే గొప్పగా సమాధానం చెబుతుంది సార్... మీ సమస్యకి మీరే గొప్పగా పరిష్కారం ఆలోచించుకోగలరు సార్ అంటుంది. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తోంది. ఇక కమింగ్ అప్ లో రిషి గలగలా మాట్లాడుతూనే ఉండగా ఆశ్చర్యపోయిన వసుధార ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుందని అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఊరికే అంటారా ఏంటని అడుగుతాడు రిషి.

గుప్పెడంత మనసు లేటెస్ట్ వీక్ రేటింగ్
ఇక గుప్పెడంత మనసు సీరియల్ దాదాపు సంవత్సరానికి పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ తోడు అవడంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ సాధిస్తోంది. తాజా వారంలో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగతా సీరియల్స్ తో పోటీ పడి టాప్ 3లో ఒకటిగా నిలిచింది. ఈ వారం 9.93 రేటింగ్‌తో టాప్ 3 స్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











