For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu August 2nd Episode: వసుధారను ఇబ్బంది పెట్టిన రిషి.. అసలు నిజం తెలిసే సరికి అలా!

  |

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మిషన్ ఎడ్యూకేషన్ అకౌంట్స్ ఇచ్చేందుకు రిషి దగ్గరకు వెళ్లిన జగతి.. బర్త్‌డే పార్టీ గురించి అతడికి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడతను ఆ స్థానంలో ఎవరున్నా వచ్చేవాడిని అంటూ షాకిస్తాడు. తర్వాత వసుధారకు శిరీష్, రిషి సలహాలు ఇస్తారు. దేవయానికి మహేంద్ర సరైన సమాధానాలు చెబుతాడు. అనంతరం రిషికి వసు గురించి ధరణి క్లాస్ ఇస్తుంది.

  Intinti Gruhalakshmi August 2nd Episode: నందూ విషయంలో తులసి యూటర్న్.. ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్

  ఫొటోలు చూసి మురిసిపోయిన జగతి

  ఫొటోలు చూసి మురిసిపోయిన జగతి

  శిరీష్‌తో కలిసి వసుధార సినిమాకు వెళ్లడంపై కోపంతో రగిలిపోతుంటాడు రిషి. ఆ తర్వాత జగతి, వసుధార పుట్టినరోజు పార్టీలో తీసుకున్న ఫొటోలను చూస్తుంటారు. అప్పుడు రిషి పిక్స్ కనిపించగానే జగతి మరోసారి ఎమోషనల్ అవుతుంది. వాటినే చూస్తూ ఎంతగానో మురిసిపోతుంది. అప్పుడు రిషిని జగతి ముందు సరదాగా విమర్శించి.. పాయసం చేస్తానని లోపలికి వెళ్తుంది.

  జగతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడుకు

  జగతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడుకు

  ఫొటోలు చూస్తుండగా జగతి ఇంటికి రిషి వస్తాడు. అతడిని లోపలికి ఆహ్వానించిన వెంటనే రిషి 'ఏంటి మేడమ్.. మీరు గొప్ప లెక్చలర్ కావొచ్చు. గోల్డ్ మెడల్ తీసుకుని ఉండొచ్చు. కానీ, ఇంట్లో ఒకరిని తెచ్చి పెట్టుకోగానే సరిపోదు. వాళ్లు ఎలా ఉంటున్నారు? ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవి చూసుకోవాలి కదా. బాధ్యతగా ఉండాలి కదా' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు.

  రిషిపై కోప్పడిన వసు.. ఊరుకోవాలా?

  రిషిపై కోప్పడిన వసు.. ఊరుకోవాలా?

  వసుధార గురించి జగతి దగ్గర రిషి చెప్తున్న సమయంలో ఆమె లోపలి నుంచి వస్తుంది. వచ్చీ రావడమే 'నా గురించి ఏం చెప్తున్నారు సార్. అసలు నేనేం చేశా అని కంప్లైంట్ చేస్తున్నారు?' అంటూ అడుగుతుంది. అప్పుడు రిషి 'మొత్తం మేడంకు చెప్పాను. తను నీకు చెప్తారు. చెప్పండి మేడం' అంటాడు. అంతలో 'మీరు ఏది పడితే అది అంటే ఊరుకోవాలా' అంటూ రిషిపై వసు కోప్పడుతుంది.

  నా పర్సనల్ విషయాలు మీకెందుకు?

  నా పర్సనల్ విషయాలు మీకెందుకు?


  ఆ సమయంలో వసుధార, రిషి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అప్పుడు 'అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకు సార్? ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు' అని అడుగుతుంది. అప్పుడు రిషి 'నా పర్సనల్ విషయాల్లో ఎందుకు తలదూర్చావ్' అనగా.. మీ మంచికే చెప్పాను సార్ అంటుంది. అప్పుడు రిషి కూడా ఇప్పుడు నీ మంచికే చెప్తున్నా అంటాడతను.

  రిషికి షాకింగ్ న్యూస్ చెప్పిన మహేంద్ర

  రిషికి షాకింగ్ న్యూస్ చెప్పిన మహేంద్ర

  వసుధారతో గొడవ పడిన తర్వాత ఇంటికి వెళ్లిన రిషి దగ్గరకు తండ్రి మహేంద్ర వస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య రాత్రి జరిగిన విషయంపై చర్చ జరుగుతుంది. ఆ సమయంలో మహేంద్ర 'వసు ఇప్పటి అమ్మాయి కాదు కదా.. అందుకే శిరీష్‌తో సినిమాకు వెళ్లనంది. దీంతో ఆ టికెట్ వేస్ట్ కాకుండా నేను వెళ్లాను' అని చెప్తాడు. అప్పుడు రిషికి వసు సినిమాకు వెళ్లలేదన్న న్యూస్ తెలుస్తుంది.

  తల్లైనా తగ్గని నిషా అగర్వాల్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న కాజల్ అగర్వాల్ సోదరి

  జగతి దగ్గరకు మహేంద్ర.. ఆ మాటతో

  జగతి దగ్గరకు మహేంద్ర.. ఆ మాటతో

  మహేంద్ర చెప్పిన మాటతో రిషి వెంటనే వసుధార దగ్గరకు వెళ్తాడు. ఆమెను కారులో తీసుకుని వెళ్లగా.. మహేంద్ర మాత్రం జగతి దగ్గరకు వస్తాడు. అప్పుడు 'ఏంటి మహేంద్ర రిషితో ఏదైనా డిస్కర్షన్ జరిగిందా' అని అడుగుతుందామె. దీంతో 'నీ కొడుకును భరించలేకపోతున్నా. వాడిని నీకు ఇచ్చేస్తా' అని అంటాడు. ఆ మాటతో జగతి ఎమోషనల్ అవడంతో మహేంద్ర ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

  Recommended Video

  FCUK Movie Song 4 Manasu Katha
  అది మీకెందుకు చెప్పాలి సార్ అంటూ

  అది మీకెందుకు చెప్పాలి సార్ అంటూ

  వసుధారతో మాట్లాడేందుకు ఆమెను కారులో తీసుకొచ్చిన రిషి.. 'నువ్వు సినిమాకు వెళ్లలేదన్న విషయం నాకెందుకు చెప్పలేదు. డాడ్ చెప్పే వరకూ ఆ విషయం తెలియదు' అని అంటాడు. దీంతో 'మీకెందుకు చెప్పాలి సార్. నేను వెళ్లేది వెళ్లనిది నా వ్యక్తిగతం' అంటుందామె. అప్పుడు రిషి 'నువ్వు వెళ్లావనుకుని మీ మేడం ఇంటికి వచ్చాను. నా తప్పుంటే సారీ చెబుతాను' అని అంటాడు.

  English summary
  Guppedantha manasu Serial Episode 205: Rishi Went Jagathi House and Fired on her. After That Vasudhara Angry on Rishi. That Time These Two Exchanged Their Words.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X