For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సాక్షికి షాకిచ్చిన దేవయాని.. దెబ్బకు అందరి ఫ్యూజులు అవుట్!

  |

  గుప్పెడంత మనసు సీరియల్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చివరిగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఎలా అయినా వసుధారను దూరం చేసి సాక్షిని రిషికి కట్టబెట్టాలని దేవయాని కుట్రలో భాగంగా కాలేజీలో స్టేజ్ పై అందరి ముందూ తాను రిషి పెళ్లి చేసుకోబోతున్నాయి అని సాక్షి అనౌన్స్ చేస్తుంది. రిషి అడిగితే బ్లాక్ మెయిల్ చేయడంతో అప్పుడేమీ మాట్లాడకుండా ఉండిపోతాడు రిషి. ఇక పెళ్లే తరువాయి అని దేవయాని ఫిక్సైపోయిన దేవయాని ఇంటికి రాగానే రిషిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దీంతో రిషి కూడా ఓపెన్ అవుతాడు. రిషి లైబ్రరీలో జరిగిన సంఘటన మొదలు కాలేజీలో వసు-రిషి ఫొటోస్ తీసి బెదిరించిన విషయాలన్నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరినీ బయటపెడతాడు.

  సాక్షికి అర్థమయ్యేలా

  సాక్షికి అర్థమయ్యేలా

  ఇక ఒక మనిషికి ఏం ఉన్నా లేకపోయినా సహించగలం కానీ సంస్కారం లేకపోవడం భరించలేమని పేర్కొన్న రిషి వసుధారని అడ్డం పెట్టుకుని బెదిరించి నా జీవితంలోకి రావాలనుకోవడం ఎంత నీచం అనేది మీరే అర్థం చేసుకోండని అంటారు. నా మీద ఉన్న ప్రేమతో మీరే ఆ సాక్షికి చెప్పండి, ఇప్పటివరకూ తను చేసింది తప్పు..ఇకపై కూడా ఇలాగే చేస్తే నేనేంటో నా ఆవేశం ఏంటో చూపించాల్సి వస్తుందని అంటే మహేంద్ర వదిన గారికి ఈ బాధ్యత అప్పగించి చాలా మంచిపని చేశావ్..వెరీ గుడ్ రిషి అని అంటాడు. దానికి ఫణీంద్ర మీ పెద్దమ్మ చెబితే సాక్షి వింటుందని, .సాక్షిని ఎంకరేజ్ చేసింది మీ పెద్దమ్మే కాబట్టి ఆమె చెబితే వింటుందని అంటాడు. రిషి కూడా నాపై ఉన్న ప్రేమతో అయినా మీరు ఈ విషయం సాక్షికి అర్థమయ్యేలా చెబుతారనుకుంటానని అంటాడు.

  మళ్లీ మాట్లాడతా

  మళ్లీ మాట్లాడతా


  ధరణి కూడా అత్తయ్యగారికి ఓపని అప్పగిస్తే అది అయిపోయినట్టే భావించాలని అంటుండగా హాలులో నుంచి ఎవరికి వారు వెళ్లపోతారు. జగతి దేవయాని అక్కడే నిలడగా జగతి: అక్కయ్యా..ఇంట్లో స్వీట్ చేసి చాలా రోజులైంది కదా మీరు వద్దంటే వద్దులెండి..ఎంతకాదన్నా మీరు ఈ ఇంటికి పెద్ద కదా స్వీట్ క్యాన్సిల్ అంటూ రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత కాలేజీలో ఓ చెట్టుకింద కూర్చుని వసుధార ఆలోచిస్తుంటుంది. రిషి పరిచయం అయినప్పటి నుంచీ జరిగిన సంఘనటలన్నీ తలుచుకుంటున్న క్రమంలో కాల్ చేసిన రిషి వెంటనే కట్ చేస్తాడు. ఇంతలో రానే వచ్చిన రిషి వసు చేయి అందుకుని, ఏం మాట్లాడకుండా నాతో రా అని అంటాడు. రిషి ని చూస్తూ ఆ వెనుకే అడుగులో అడుగువేస్తూ నడుస్తూ వసుధార కూడా వెళుతుంది. ఇంతలో రిషికి కాల్ చేసిన సాక్షి ఎక్కడ ఉన్నావంటే. నేను వసుధారతో ఉన్నాను మళ్లీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు...

  మర్యాదల కోసం రాలేదు

  మర్యాదల కోసం రాలేదు

  వసుధార ఎందుకు, ఏంటి అని అడగొద్దు కూర్చో అని కార్ డోర్ తీస్తాడు అలా వారు బయలుదేరతారు. ఇక మరోపక్క కాఫీ తీసుకొచ్చి జగతి, మహేంద్రకి ఇస్తుంది ధరణి. వదిన గారు ఇంకా ఇటు రాలేదేంటి అని మహేంద్ర అంటే..కాసేపట్లో వస్తారు అంటుంది. వదిన గారు ఈ టైమ్ లో నిద్రపోతుంటారా అని మహేంద్ర అంటే..లేదు మావయ్యగారు ఏదో కొత్త ప్లాన్ వేస్తూ ఉంటారని అంటే జగతి వారిస్తుంది. మరోపక్క కార్లో రిషి-వసు వెళుతుంటారు. అయితే కారు చెడిపోతుంది...ఆపి రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ సెట్ అవ్వదు. మరోపక్క రిషి ఇంట్లో కోపంగా ఎంట్రీ ఇచ్చిన సాక్షి..జగతి దగ్గరకు వచ్చి ఆంటీ నాకు సమాధానం కావాలి అంటే కూర్చోమంటుంది. దానికి ఆమె నేను మర్యాదల కోసం రాలేదు..నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని అవునా కాదా అనేది తేల్చుకునేందుకే వచ్చానంటుంది.

  ఏదైనా సమస్య ఉంటే

  ఏదైనా సమస్య ఉంటే


  రిషికి కాల్ చేస్తే..ఆ వసుధారతో కలసి ఎక్కడికో వెళ్తున్నారంట..ఎక్కడికి అని అడిగితే చెప్పడు..నేను కాల్ చేస్తే ఒక్కముక్కలో ఆన్సర్ చెప్పి కట్ చేశాడని, మళ్లీ కాల్ చేస్తే తీయడం లేదని అంటుంది. అసలు ఏం జరుగుతోందో నాకు మాత్రం అర్థంకావడం లేదన్నా ఆమె రిషికి ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలియదని అంటుండు. ఈ విషయాన్నీ నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను..రిషి పద్ధతి మార్చుకోవాలి..రిషి ఇలా చేయడం ఏం బాలేదని అంటుంది. దానికి జగతి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు..మీకు మీకు ఏదైనా సమస్య ఉంటే రిషి-నువ్వు తేల్చుకోవాలి.. ఇంటికొచ్చి గొడవ చేయడం ఏంటని అంటుంది.

  రెచ్చగొట్టేలా

  రెచ్చగొట్టేలా


  దానికి దేవయాని నేను మాట్లాడతాను అంటూ సాక్షి నీ ప్లాబ్లెమ్ ఏంటి అంటే సాక్షి ఎంగేజ్ మెంట్ అయిందని నేను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఊరుకున్నాడు..ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదని అంటుంది. వ్వు ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత రిషి ఏమీ మాట్లాడకపోతే అవును అని నువ్వు ఎలా అనుకుంటావ్. మౌనం అర్థాంగీకారం అన్నారు కానీ పూర్తి అంగీకారం అనలేదు కదా, కాలేజీలో అందరి ముందూ మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పినదానికి ఒప్పుకున్నట్టు కాదు కదా అంటుంది. ఆమె అలా అనడంతో జగతి, మహేంద్ర, ధరణి...వీళ్లంతా ఆమె రివర్స్ గేమ్ ఆడుతున్నదని అనుకుంటారు.. సాక్షి కూడా మీరు కూడా రిషిని సపోర్ట్ చేస్తున్నారా అంటే దేవయాని రిషికి నువ్వుంటే ఇష్టం లేదు..రిషి నిన్ను ప్రేమించడం లేదు..రిషి నిన్ను పెళ్లిచేసుకోవడం లేదు ఏమి చేసుకుంటావో చేసుకో పో అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

  English summary
  Guppedantha Manasu Episode 519: Jagathi informs Rishi about Vasudhara's love for him. Later, Rishi lashes out at Devayani as she tries to convince him to marry Sakshi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X