Guppedantha Manasu: ఇంటికొచ్చి మరీ సాక్షి వార్నింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన దేవయాని.. ఏకాంతంగా వసు-రిషి! !

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్ లో రిషి, వసుధార కలిసి బయటకు వెళతారు. అక్కడ కారు చెడిపోతుంది. ఆ సమయంలో సాక్షి రిషికి ఫోన్ చేయడంతో నేను వసుధార కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పడంతో రిషి ఇంటికి వెళ్లి పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏం చేసుకుంటావో చేసుకో

ఏం చేసుకుంటావో చేసుకో


ఇంటికి వచ్చిన సాక్షి గట్టిగట్టిగా అరుస్తూ ఉండడంతో జగతి ఆమె మీద ఫైర్ అవ్వబోతుండగా ఆమెను ఆపి నేను సమాధానం చెబుతానని అంటుంది. ఇక రిషికి నువ్వంటే ఇష్టం లేదని సాక్షికి చెబుతుంది దేవయాని, ఎవరూ ఊహించని విధంగా ఆమె మాట్లాడిన దానికి అంతా షాక్ అవుతారు. సాక్షితో మాట్లాడుతూ దేవయాని అసలు నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదని... వాస్తవంలో జీవించమని సలహా ఇచ్చి ఆమెను ఆలోచనలో పడేస్తుంది. అంతేకాక అసలు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని మరింత రెచ్చగొడుతుంది. మొన్నటి వరకు నాకు సపోర్ట్ చేసినట్టే చేసి... ఇప్పుడు రివర్స్ అవుతున్నారు ఏమిటి అని దేవయానని సాక్షి ప్రశ్నిస్తుంది సాక్షి. దానికి దేవయాని రిషి మనుసులో నువ్వు లేనప్పుడు ఎలా సపోర్ట్ చేస్తానని ప్లేటు ఫిరాయిస్తుంది దేవయాని. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని... ఎవరి పరువు తీసుకుంటావో తీసుకోమని కీ ఇచ్చినట్టు రెచ్చగొడుతుంది.

Recommended Video

సీతా రాముల ప్రేమ కావ్యం, ఓ అద్భుతం *Reviews | Telugu FilmiBeat
కారు రిపేర్‌ కావడంతో

కారు రిపేర్‌ కావడంతో


అంతేకాదు మరో రెండు రోజుల్లో మా వాళ్లని పిలిచి మా పెళ్లి సంగతి మాట్లాడక పోతే మీ అందరినీ కేసు పెట్టి కోర్టుకు ఈడుస్తానంటూ హెచ్చరిస్తుంది సాక్షి. దానికి మహేంద్రన్యాయం ఎవరివైపు ఉంటే వాళ్లే గెలుస్తారని అంటాడు. దేవయానికి కూడా అవును మహేంద్ర మనకేమీ భయం లేదని అంటుంది. ఇప్పుడు మేము అందరం ఒక్కటయ్యామని తమను నువ్వు ఏం చేయలేవని కూడా అంటుంది దేవయాని. దీంతో రెచ్చిపోయిన సాక్షి... రెండు రోజుల్లో రిషి, సాక్షి పెళ్లి లగ్నపత్రిక ఇంటికి రాకపోతే మీ అందరి పేర్లు రాసి పెట్టి మీ ఇంట్లోనే విషం తాగి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఆ తరువాత మీ కుటుంబాన్ని నాశనం చేసే వరకు సాక్షి నిద్రపోదని హెచ్చరించి మరీ వెళ్లిపోతుంది. కారు రిపేర్‌ కావడంతో రోడ్డు పై నిలిచి పోయిన వసుధార, రిషి ఇబ్బంది పడుతుంటారు. ఇక ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా తమ పిల్లలు చదువుకుంటున్నారని చెప్పి రిషి గారు తనకు తెలుసు అంటూ పరిచయం చేసుకుంటాడు.

మెకానిక్‌కు ఫోన్ చేసి

మెకానిక్‌కు ఫోన్ చేసి


కారు రిపేర్‌ అయిందని తెలియడంతో తన ఇంటికి రమ్మని ఇద్దర్నీ ఆహ్వానిస్తే అలాగే వెళతాడు. సరే అని మెకానిక్‌కు ఫోన్ చేసి వాళ్ల ఇంటికి వెళ్తారు ఇద్దరూ. మరో పక్క సాక్షి ఇచ్చిన వార్నింగ్‌తో ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. దేవయాని కూడా కంగారుపడుతున్నట్టు హడావుడి చేయడంతో గౌతమ్‌కు అనుమానం వస్తుంది. అదే విషయాన్ని ధరణిని అడిగితే అనుసమానమే లేదు అది అదే అంటుంది ధరణి. ఇంతలో తనకు ఆరోగ్యం బాగాలేదని రిషికి ఫోన్ చేయమని గౌతమ్‌కు చెబుతుంది దేవయాని. అదేంటి బాగానే ఉన్నావు కదా అంటే నాకు నిజంగానే బాలేదని అంటుంది. అలాగే అని చెప్పి బయటకు వెళ్లిన గౌతమ్ తో ఫోన్ చేయవద్దని అంటుంది ధరణి. అయితే కారు చెడిపోవడంతో రిషి, వసుధార అక్కడి ఒక రైతు ఇంటికి వెళ్తారు.

మెకానిక్‌కు ఫోన్ చేసి

మెకానిక్‌కు ఫోన్ చేసి


అక్కడ తాను ఎవరో తెలిసినట్టు మాట్లాడటంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఎలా తెలుసు అంటే... మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చదువు అందిస్తున్న మిమ్మల్ని ఎలా మర్చిపోతామని అనడంతో చాలా ఆనంద పడతారు. అంతేకాక ఇప్పట్లో కారు బాగయ్యే పరిస్థితి లేకపోవడంతో అక్కడే భోజనం చేయమంటారు. సరే అంటాడు రిషి. అయితే అక్కడ ఉన్న పిల్లలతో వసుధార మాట్లాడుతుంది. ఇంతలో చీకటి పడడంతో పాటు కరెంటు కూడా పోతుంది. పక్కింట్లో కరెంటు ఉంది ఇక్కడ పోవడం ఏంటని ఆలోచించి, నేను చూస్తానంటూ వెళ్తుంది వసుధార. ఇక ధరణి మీద రెచ్చిపోతున్న దేవయాని వద్దకు వెళ్లిన జగతి అనవసరమైన విషయాల్లో ఎందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నిస్తుంది.

అనుమానం

అనుమానం


నా బాధ ఎవరికీ అర్థం కాదని... రిషికి మాత్రమే అర్థమవుతుందని, నా బిడ్డ రిషి అంటూ ఆయనకు ఫోన్ చేయబోతుంది. తాము అతిథిగా వచ్చిన రైతు ఇంట్లో కరెంటు పోవడంతో దాన్ని రిపేర్ చేసే పనిలో వసుధార బిజీగా ఉంటుండగా షాక్ కొట్టి రిషిపై పడుతుంది వసుధార. అలా ఉంటూ తన మనసులో మాట చెబుదామనే సరికి పిల్లలు వచ్చి మేడం ఏమైంది అని అడుగుతారు. దీంతో ఆ విషయాన్ని మరచిపోయి ఫ్యూజ్ పోయిందని చెప్పి ఆ ఫ్యూజ్ పెట్టేస్తుంది. అలా కరెంట్‌ వచ్చాక అందరం భోజనాలకు వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే ఉండిపోమని ఆ ఇంట్లో అందరూ రిక్వస్ట్ చేయడం వలన సరే అని ఒప్పుకుంటారూ. మరో పక్క సాక్షి హెచ్చరికలు, దేవయాని హాంగామాతో జగతి, మహేంద్ర, గౌతమ్‌కు అనుమానం వస్తుంది. ఇంత సడెన్‌గా సాక్షికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆలోచనలో పడడంతో ఎపిసోడ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X