For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: విషం తాగేందుకు సిద్దమైన దేవయాని.. స్కెచ్చేసి మరీ సాక్షికి బలిచ్చేందుకు ప్లాన్!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని సాక్షి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అది మిస్ ఫైర్ అవడంతో సాక్షి దేవయానికి వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. దీంతో మళ్ళీ నాటకాలు మొదలు పెట్టిన దేవయాని సాక్షి విషయంలో నేను పొరపాటు చేశాను క్షమించు రిషి అని ఏడుస్తుంది. పెద్దమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడగడంతో ఆమె అదేమీ లేదని నాదొక చిన్న కోరిక మిగిలిపోయింది తీరుస్తావా అని అంటుంది.. చెప్పండి పెద్దమ్మా తీరుస్తాను అని రిషి అంటాడు. పక్కన టేబుల్ మీద ఉన్న గ్లాస్ ఇవ్వమని అడుగుతుంది.

  సాక్షి మారిపోయింది

  సాక్షి మారిపోయింది


  అది రిషి అందిస్తే తీసుకుని నీ చేతులతో ఇచ్చిన విషం తాగాలని నా కోరిక నాన్న అని దాని తాగబోతుంటే పెద్దమ్మా అని అరిచి గ్లాస్ లాక్కుని పడేస్తాడు. విషం ఏంటి అసలు మీరు విషం తాగాడమెంటి.. అంత కష్టం ఏం వచ్చింది నేను ఉన్నాను కదా అని రిషి ఆమె నటనకు పడిపోతాడు. అసలు మీకొచ్చిన కష్టం ఏంటి అసలు ఏం జరిగింది.. ఎందుకు ఇదంతా అని కూడా దేవయానిని అడుగుతాడు. అయితే దానికి కారణం సాక్షి అని ఆమె చెప్తుంది. తప్పు చేశాను రిషి. తన ప్రేమని చూసి నీకు సరైన జోడీ అనుకున్నానని, సాక్షికి నీతో పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చానని దేవయాని అంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేక పోతున్నానని, సాక్షి మారిపోయింది రిషి అని అంటుంది.

  విషం తాగి

  విషం తాగి


  అంతే కాక నీతో పెళ్లి జరిపించకపోతే నన్ను జైలుకి పంపిస్తానని, కుటుంబం పరువు తీస్తానని ఎన్నెన్ని మాటలు అన్నదో అంటూ సాక్షి ఇంట్లో మాటలు మాట్లాడినవి అన్నీ పూసగుచ్చినట్టు వివరిస్తుంది. అంతేకాక ఇందులో తన తప్పే కాదు నాది కూడా ఉంది కదా అని అంటూ తనే కరెక్ట్ అని నమ్మానని, ఇప్పుడు నిన్ను పెంచిన ప్రేమతో నీ పెళ్లి ఫలానా వాళ్ళతో అనే అధికారం నాకు లేదు కదా అని నాటకం మొదలు పెడుతుంది. సాక్షిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పలేను కదా రిషి, అందుకే ఇచ్చిన మాట తప్పడం కన్నా ఇంత విషం తాగి చావడం మంచిది కదా ఆ విషం ఏదో నీ చేతుల మీదగా తాగితే అదే తులసి తీర్థంగా తాగుతానని అంటుంది.

   అడ్డు చెప్పానా

  అడ్డు చెప్పానా


  దానికి రిషి పెద్దమ్మా అలా మాట్లాడకండని అంటే దేవయాని ఇంతక మించి వేరే దారి లేదని అంటుంది. అసలు ఆ సాక్షి ఎవరు రిషి, నేను తనకేదో మాట ఇచ్చాను.. అయినా నీ ఇష్టమే నా ఇష్టం.. నీ ఆనందమే నా ఆనందమని అంటుంది. జగతిని ఇంటికి తీసుకొచ్చావ్ నేను ఏమైనా అడ్డుపడ్డానా, వసుధారకి ఎక్కువ ప్రాధాన్యత వద్దు అన్నా తను చాలా తెలివైనది కాలేజీకి మంచి పేరు తీసుకొస్తుంది అన్నావ్ నేనేమైనా అడ్డు చెప్పానా.. లేదు కదా . సాక్షి విషయంలో నేను మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నాను ఎందుకంటే తనకి నువ్వంటే పిచ్చి ప్రేమ. సాక్షి చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చని కానీ ఇన్ని చేసిన సాక్షి చివరికి నన్ను బెదిరించిందని అంటుంది.

  బయటకు వెళ్లబోతుంటే

  బయటకు వెళ్లబోతుంటే

  నేను సాక్షిని పెళ్లి చేసుకోమని అడగడం లేదు, నేను అలా ఆడగలేను అలా అడగడం ధర్మం కాదని అంటుంది. రెండోది సాక్షి ముందు తల వంచడం అలా ఎప్పటికీ జరగదు అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నానని రిషి ముందు నాటకం ఆడుతుంది. ఇప్పుడు గ్లాస్ పారేశావు కానీ ఏదో ఒక టైంలో నేను ఇదే చేస్తాను కదా అని కూడా అంటుంది. అయితే ఆ మాటలకి ఆమె ఏమీ మాట్లాడలేక రిషి బాధగా వెళ్ళిపోతూ ఉండగా అలా వెళ్లిపోతున్న సమయంలో వసుధార చూస్తుంది. వసు బయటకు వెళ్లబోతుంటే దేవయాని ఆమెను పిలుస్తుంది. రిషిని నువ్వే కాపాడుకో అని దేవయాని వసు చేతులు పట్టుకుని మరీ బతిమాలాడుతున్నట్టు మాట్లాడుతూ నువ్వే కాపాడుకోవాలని అంటుంది.

  కావాలని అనిపిస్తుంది

  కావాలని అనిపిస్తుంది

  అది విని వసుధార ఇదేంటీ అని అలోచించి రిషి సార్ ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు ఏం చెయ్యాలో రిషి సర్ కి తెలుసని అంటుంది. అయినా మీరు సాక్షికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అంటే ఏనుగు పెద్దది అయినా చిన్న ముల్లు భయపెడుతుందని దేవయాని అంటుంది. ఇక్కడ ఆ ముల్లు సాక్షి అని ఏంటి మొన్నటి దాకా సాక్షిని వెంట పెట్టుకుని తిరిగి ఇలా మాట్లాడుతుంది అనుకోవచ్చు కానీ రిషిని ఆ సాక్షి ఇబ్బంది పెడుతుందని అంటుంది. రిషి మంచితనం నీకు తెలుసు కదా రిషికి నువ్వే సాయం చెయ్యాలి అని అంటే దానికి మేడమ్ అని వసు అంటుంది. రిషి, దేవయాని మాటలు గురించి ఆలోచిస్తూ ఉండగా వసు కాఫీ తీసుకుని వస్తుంది. ఒక్కొసారి వద్దనుకున్నవి కావాలని అనిపిస్తుంది ఆలోచించండి సార్, నా విషయంలో అదే జరిగింది అని మనసులో అనుకుంటుంది. అలా ఈ ఎపిసోడ్ ముగించారు.

  English summary
  Guppedantha Manasu Episode 522: Devayani manages to manipulate Rishi and Vasudhara with a motive. Later, Rishi gets upset as he lands in a puzzled situation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X