For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu సాక్షితో పెళ్లికి రిషి నిర్ణయం.. షాక్‌లో వసుధార..

  |


  రిషి కోసం వసుధార కంగారు పడిపోయింది. రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఐస్‌క్రీమ్‌కు బదులు కాఫీ తెచ్చి ఇచ్చారేంటి అంటూ కస్టమర్ ప్రశ్నించడంతో ఏదో సర్ది చెప్పింది. అయితే రిషి సార్ వస్తే బాగుండు అనుకొంటుండగా మొబైల్ మెసేజ్ వచ్చింది. మీరు త్వరగా బయటకు వస్తే మీతో మాట్లాడాలని రిషి పంపిన మెసేజ్ చేసి ఆనందపడి పోయింది. నేను మనసులో అనుకొంటున్నట్టుగానే రిషి కూడా అనుకొంటున్నాడా? ఇద్దరం ఒకేసారి అనుకొంటున్నామంటే.. దీనిని అని సంబరపడిపోయింది. రెస్టారెంట్ మేనేజర్ పర్మిషన్ తీసుకొని రిషి వద్దకు వెళ్లింది. గుప్పెడంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 533లో ఏం జరిగిందంటే?

  చదువు కోసం పెళ్లి పీటల మీద నుంచి

  చదువు కోసం పెళ్లి పీటల మీద నుంచి

  తన వద్దకు రాగానే.. వసుధార నీవు పెళ్లి పీటల మీద నుంచి ఎందుకు పారిపోయి వచ్చావు అని రిషి అడగ్గానే.. ఏమిటి రిషి సార్ ఇలా అడుగుతున్నాడు అని మనసులో అనుకొంటుంటే.. నీకు చదువు అంటే ఇష్టం. మీ ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని అన్నారు. మీరు చదువు కోసం పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చావు. అంతేకదా అని రిషి అంటే.. అంతే అని వసుధార కూడా చెప్పింది. నా జీవితంలో ఓ లక్ష్యం ఉంది. నాకు అది తప్ప పెళ్లి, మరో విషయంపై నాకు ఎలాంటి దృష్టి లేదు కదా... అని రిషి అంటే అవును అని సమాధానం చెప్పింది.

   నీ లక్ష్యం బాగా నచ్చిందంటూ

  నీ లక్ష్యం బాగా నచ్చిందంటూ


  అయితే వసుధార గురించి రిషి ఎమోషనల్ అవుతూ.. నీ లక్ష్యం నాకు బాగా నచ్చింది. వసుధార నీవు బాగా చదువుకోవాలి. వృద్ధిలోకి రావాలి. బీబీ కాలేజ్ స్టూడెంట్ ఇంత ఎత్తుకు ఎదిగిందని నేను గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి స్థితిలో చూడాలని నేను అనుకొంటున్నాను అని రిషి అంటే.. తప్పకుండా అని వసుధార చెప్పింది. జీవితం అన్నాక చాలా జరుగుతుంటాయి. కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు అన్నీ తట్టుకొని అన్నీ తట్టుకొని నదీ ప్రవాహంలా ముందుకు వెళ్లడమే గొప్పతనం. ఏం జరిగినా ఎలాంటి సంఘటనలు ఎదురైనా నీ జీవితం ముందు లక్ష్యాన్ని మరిచిపోవద్దు. జీవితం అంటేనే ఊహించనివి జరుగుతుంటాయి. ఏది ఏమైనా నీవు నీ లక్ష్యాన్ని చేరుకొనే విధంగా ప్రయాణం సాగించాలి అని రిషి అన్నాడు.

  Recommended Video

  వాడంత వెధవ ఉండడు, సంచలనంగా మారిన నాగబాబు ట్వీట్ *Politics | Telugu OneIndia
   కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు

  కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు


  రిషి ఎమోషనల్‌గా మాట్లాడటంతో.. ఏంటి సార్.. ఇది చెప్పడానికే నీవు పిలిచావా అంటే.. అవును. కొన్ని సార్లు చెప్పింది వినాలి.. ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఇక ఈ టాపిక్ నేను మాట్లాడం అవసరం లేదని అనుకొంటున్నాను. ఇక వెళ్దాం పద అని రిషి అన్నాడు. దాంతో ఏంటి రిషి.. రమ్మన్నారు.. వద్దన్నారు.. అసలు రిషి సార్‌కు ఏమైంది అనుకొంటూ రిషితోపాటు కారులో వెళ్లిపోయింది. కారులో ప్రయాణిస్తూ.. ఏంటో రిషి సార్.. కొన్నిసార్లు అర్ధం కాదు. జీవితం..లక్ష్యం అంటూ క్లాస్ ఇచ్చారని వసుధార అనుకొంటుంటే.. కారులో ఇలా వెళ్లడం బాగుంటుంది కదా.. ఎన్నోసార్లు కారులో వెళ్లాం కదా.. అవి మంచి అనుభూతిగా మిగిలిపోతాయి కదా అని రిషి అంటే.. ఏంటి సార్.. మనం మున్ముందు కారులో వెళ్దాం కదా.. మీరు ఏదో చెప్పాలనుకొని ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు అర్ధం కావడం లేదు అని వసుధార అంటే.. నా మనసులో ఉన్న మాట చెప్పాను అని రిషి సమాధానం ఇచ్చాడు. అయితే రషి మాటల్లో ఏదో తెలియని సందేశం ఉంది. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అని అంటే.. కారు ఆపి.. వసుధార నీ దిగాల్సిన ప్రదేశం వచ్చిందని అన్నాడు.

   సాక్షి పేరెంట్స్‌ను రమ్మని చెప్పండి

  సాక్షి పేరెంట్స్‌ను రమ్మని చెప్పండి


  ఇంట్లో అందరూ కలిసి ఉండటంపై గౌతమ్ స్పందించాడు. పెద్దమ్మ అందరం కలిసి ఉండటం పండగలా ఉంది కదా అంటే.. అవును అంటూ కుటుంబ సభ్యులు అన్నారు. రిషి మౌనంగా అయితే రిషి మౌనంగా ఉండటం చూసి.. ఇంట్లో ఇద్దరే తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరు రిషి..మరోకరు ధరణి. రుషి మాట్లాడే అవకాశాన్ని తక్కువగా వాడుకొంటాడు. ధరణికి తక్కువగా మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుంది అని రిషి డాడీ అంటే.. మాట ఆయుధం.. దానిని తక్కువగా వాడుకొంటూనే మంచిది. సాక్షి పేరెంట్స్‌ను వీలు చూసుకొని రమ్మనండి అంటూ రిషి చెప్పగానే అందరూ షాక్ తిన్నారు. కానీ పెద్దమ్మ ముఖంలో ఆనందం కనిపించింది. అయితే రిషి వారితో పని ఏమిటి అని పెద్దమ్మ అంటే... పెద్దమ్మ.. లగ్న పత్రిక రాసుకోవడానికి రమ్మని చెప్పండి అంటూ రిషి చెప్పగానే.. అందరూ కంగారులో లేచి నిలబడ్డారు.

   సాక్షితో పెళ్లి విషయంలో మార్పులు లేవు

  సాక్షితో పెళ్లి విషయంలో మార్పులు లేవు


  రిషి మాటలు వినగానే.. గౌతమ్ వచ్చి.. ఏం మాట్లాడుతున్నావు.. సాక్షిని పెళ్లి చేసుకొందామని అనుకొంటున్నావా? అంటే.. అవును అని రిషి సమాధానం చెప్పాడు. దాంతో పెద్దమ్మ ముఖంలో మరింత ఆనందం కనిపించింది. ఈ విషయం గురించి ఏమీ అడుగ వద్దు. ఈ కార్యక్రమం త్వరగా జరిగేలా మీరే చూడాలి అంటూ రిషి చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయా? అంటే.. ఓపెన్‌గా చెప్పండి అని రిషి అన్నారు. ఈ విషయంలో నీవు నచ్చావురా.. నీకు సాక్షికి పెళ్లేంటిరా అని నేను అనేస్తాను అని గౌతమ్ అన్నాడు. నీ ప్రజాభిప్రాయం నచ్చింది. అయితే నాకు నచ్చలేదు. కానీ నీ ఇష్టాన్ని కాదనలేను అని రిషి డాడీ తెగేసి చెప్పాడు.అయితే నా ఇష్టం అన్నారు కాబట్టి.. నా మనసుకు నచ్చిన నిర్ణయాన్ని నేనే తీసుకొంటాను అని రిషి అంటే.. నీ నిర్ణయాన్ని మార్చుకొంటావా? అని గౌతమ్ ప్రశ్నిస్తే. అవును.. సాక్షితో జరిగే పెళ్లిలో ఎలాంటి మార్పులు లేవు అని మరోసారి షాక్ ఇచ్చారు. చివరకు పెళ్లి హడావిడి లేకుండా జరగాలి. వాళ్ల కుటుంబం, మన ఫ్యామిలీ మాత్రమే ఉండాలని చెప్పాడు.

   వసుధారకు షాకిచ్చిన జగతి

  వసుధారకు షాకిచ్చిన జగతి

  అయితే రిషి మాటలు అర్ధం కాకుండా ఉండటంతో ఆలోచనల్లో పడింది. అంతలోనే వసుధారకు జగతి ఫోన్ చేసింది. రిషి ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకొన్నాడు అని జగతి అంటే.. ఏం నిర్ణయం తీసుకొన్నాడని అని వసుధార అడిగితే.. సాక్షిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకొన్నాడని చెప్పగానే వసుధార షాక్ తిన్నది.

  English summary
  Guppedantha Manasu Episode 523: Rish decided to marry Sakshi instead of Vasudhara
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X