Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగే షాకిచ్చిన రిషి.. మరో స్కెచ్చేసిన సాక్షి అండ్ కో!

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేజిపై సాక్షి చెప్పిన మాటలతో ఇంట్లో కూర్చుని రిషి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో రిషి దగ్గరకు వెళ్లి మాట్లాడాలని జగతి ప్రయత్నిస్తుంది,. జగతి వెళ్ళిన సమయంలో గౌతం వచ్చాడనుకుని నా మనసేమీ బాలేదు ఈరోజు వేరే గదిలో పడుకోమని చెబుతాడు రిషి. అయితే వచ్చింది నేను అని జగతి చెప్పడంతో ఇప్పుడు వసుధార గురించి కానీ సాక్షి గురించి గానీ ఏమీ చెప్పవద్దు అంటాడు.

 మనసులో లేనిది

మనసులో లేనిది


దానికి ఆమె వసుధార గురించి మీరు చెప్పవద్దు అన్నారు కానీ మీకు ఒక విషయం చెప్పాలి, వసు మీ విషయంలోనూ తన విషయంలోనూ చాలా స్పష్టంగా ఉంది. ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోంది అని అంటుంది. భలే చెప్పారు అయినా నేనేమీ అంటను, మీరు ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్పేదేముంది ఒకప్పుడు డిఐజి గారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు నేను వసుధారను ప్రేమిస్తున్నానని మీరే చెప్పారు. ఇప్పుడు అదే మాటను తిరగేసి చెబుతున్నారు. అప్పుడు మీరు ఎందుకు అన్నారో తెలియదు కానీ నా మనసులో లేనిది చెప్పారు. అంటే నా ప్రేమ గురించి ఒక రకంగా జోస్యం చెప్పారు.

 క్లారిటీ లేదన్నది

క్లారిటీ లేదన్నది


నా మనసులో తర్వాత కలిగిన భావన నేను తెలుసుకున్న తర్వాత వసుధారకు చెబితే అప్పుడు తను ఏమన్నదో తెలుసా నాకు క్లారిటీ లేదన్నది. నాకు మనుషులను అంచినా వేయడం రాదు అని చెప్పింది. అంతేకాక నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో కరెక్ట్ గా చెప్పలేదు. కానీ అనేక ఆరోపణలు చేసింది. సాక్షిపై గెలవడానికి మీకు ప్రేమ పుట్టింది అంటూ అప్పట్లో వసుధార చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకుంటాడు. పోనీ నన్ను రిజెక్ట్ చేసింది కదా దానికి సరైన కారణం మీకైనా చెప్పాలి కదా అంటే జగతి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అయితే ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోవడం లేదా లేదా నేను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లేదా అనే డౌట్ ఉంది. చిన్నప్పుడు నా ప్రమేయం లేకుండానే నా కన్నతల్లి వదిలేసి వెళ్ళింది, అప్పుడు ఎందుకు వదిలేసి వెళ్లిందో ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. వసుధార నాకు కన్నతల్లిని కూడా అర్థం చేసుకోవడం రాదు అని ముఖం మీద చెప్పింది.

 శిష్యురాలు

శిష్యురాలు


కానీ నేను ఎవరిని అర్థం చేసుకోవాలి? చిన్నప్పుడు నా ప్రమేయం లేకుండా వదిలేసిన కన్నతల్లినా? మధ్యలో సంవత్సరాల పాటు ఏమయ్యానో అర్థం చేసుకోని కన్నతల్లినా? అనుకోకుండా వచ్చి మళ్లీ నా జీవితంలో ఎంటర్ అయిన కన్నతల్లి? ఏ తల్లి మనసుని నేను అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి అనడంతో కొన్ని ప్రశ్నలకు కన్నతల్లి కన్నా కాలమే సరైన సమాధానం చెబుతుందని వసుని మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో ఆమె మిమ్మల్ని దానికి రెట్టింపు ఇష్టపడుతుందని ఆ విషయం నాకు తెలుసు అని ఆమె అంటుంది. ఆమె నన్ను వద్దన్నది కదా అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని జగతి అనుకుంటుంది. తర్వాత ఈ విషయాలన్నీ మీరే చెబుతున్నారా లేక మీ శిష్యురాలు చెప్పమన్నదా అంటే ఒకరు చెప్పిన విషయాలు చేరవేసే అవసరం నాకు లేదు అని అంటుంది.

ఏదో కొత్త ప్లాన్

ఏదో కొత్త ప్లాన్


ఇక ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చుని మాట్లాడుతున్న సమయంలో వసుధారకు కాల్ చేయాలనుకుంటాడు. అదే సమయంలో వసుధార కూడా కాల్ చేయడంతో బిజీ వస్తుంది. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటే చివరికి కాల్ కనెక్ట్ అవుతుంది. చెప్పండి సార్ అని వసు అంటే చెప్పమని రిషి అంటాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత వసుధార ఏడవటం మొదలు పెడుతుంది. దీంతో రిషి నేను వచ్చి కలుస్తాను, కలిసినప్పుడు మాట్లాడదాం అని అంటే ధైర్యంగా ఫోన్ కట్ చేస్తుంది. తరువాత ఉదయాన్నే ఫణీంద్ర ఏమిటి ఏదో చెప్పాలన్నావ్ అని దేవయానితో అంటే అవును ఒక విషయం చర్చించాలి రిషిని కూడా రానివ్వండి అంటుంది దేవయాని. ధరణి ఈవిడ ఏదో కొత్త ప్లాన్ వేసింది అనుకుంటూ ఉండగానే రిషి వస్తాడు. రిషి వచ్చిన తర్వాత మన కుటుంబానికి సంబంధించిన సాక్షి గురించి అని అంటూ ఉండగానే రిషి అసలు సాక్షి సమస్య కాదు అంటాడు.

 ఇష్టం ఉందా? లేదా?

ఇష్టం ఉందా? లేదా?


అదేమిటి అని దేవయాని అంటే గతంలో లైబ్రరీలో సాక్షి చేసిన ఘనకార్యాన్ని వివరంగా చెబుతాడు. నిన్న కూడా కాలేజీ పరువు కోసం మాట్లాడలేదు లేకపోతే అప్పుడే మాట్లాడేవాడిని అని రిషి అంటాడు. అలాగే కొన్ని ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుందనే విషయాన్ని కూడా రిషి బయట పెడతాడు. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది. జరగబోతున్న ఎపిసోడ్లో మాత్రం రిషి వసుధార ఒకచోట నిలుచుని మాట్లాడుకుంటూ ఉండగా వసుధార చేయి పట్టుకున్న రిషి ఏమి మాట్లాడకుండా నాతో రమ్మని అంటాడు. ఇంతలో సాక్షి కాల్ చేయడంతో తాను వసుధార ఒకచోటే ఉన్నామని చెప్పడం కనిపిస్తోంది. అయితే సాక్షి రిషి ఇంటి దగ్గరకు వెళ్లి అసలు రిషికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా? లేదా? అని అడిగితే దేవయాని కావాలని, అదేమీ ఇష్టం లేదు రిషికి నువ్వంటే ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రెచ్చగొడుతున్నట్లుగా చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X